ETV Bharat / entertainment

ఓటీటీలో ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్స్ వేడుక - లైవ్ స్ట్రీమింగ్ ఎందులో అంటే? - Oscar Awards live streaming

96th Oscar Awards ceremony Live Streaming OTT : మరో నాలుగు రోజుల్లో 96వ ఆస్కార్‌ అవార్డ్​ వేడుక గ్రాండ్​గా జరగనుంది. అయితే ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన ఈ అకాడమీ అవార్డ్స్‌ వేడుకలను భారతీయులకు లైవ్‌ ద్వారా వీక్షించే అవకాశం కల్పించారు నిర్వాహకులు. ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం ఎక్కడ, ఎందులో చూడొచ్చో తెలుసుకుందాం.

ఓటీటీలో ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్స్ వేడుక - లైవ్ స్ట్రీమింగ్ ఎందులో అంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 6, 2024, 7:24 AM IST

96th Oscar Awards ceremony Live Streaming OTT : ప్రపంచ చలన చిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మక భావించే పురస్కారం ఆస్కార్‌. జీవితంలో ఒక్కసారైనా ఈ అవార్డును ముద్దాడాలనుకుని ఫిల్మ్ ఇండస్ట్రీలోని ఎంతో మంది కళాకారులు ఆరాటపడుతుంటారు. బాక్సాఫీసు కలెక్షన్లను కొల్లగొట్టడం ఒక విజయం అయితే ఆస్కార్‌ను అందుకోవడం తమ జీవితంలో ఓ వరంలా భావిస్తుంటారు. ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని గెలుచుకుంటే ఆ ఆనందానికి హద్దులే ఉండవు. మరో నాలుగు రోజుల్లో 96వ ఆస్కార్‌ అవార్డ్​ వేడుక గ్రాండ్​గా జరగనుంది.

అయితే ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన ఈ అకాడమీ అవార్డ్స్‌ వేడుకలను భారతీయులకు లైవ్‌ ద్వారా వీక్షించే అవకాశం కల్పించారు నిర్వాహకులు. ఆదివారం రాత్రి జరగనున్న ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. హాస్యనటుడు జిమ్మీ కిమ్మెల్ నాలుగో సారి ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేయబోతుండటం విశేషం.

భారతీయ కాలమానం ప్రకారం మార్చి 11న సోమవారం ఉదయం నాలుగు గంటలకు ఆస్కార్ వేడుకను లైవ్ స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ అధికారికంగా తెలిపింది. ఈ సందర్భంగా ఆస్కార్‌కు నామినేట్ అయిన చిత్రాలను జోడించి ఓ స్పెషల్ వీడియోను పోస్ట్ చేసింది.

కాగా, ఈ ఏడాది ఆస్కార్ అవార్డులకు ఓపెన్‌హైమర్, కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్, మాస్ట్రో, బార్బీ, పూర్ థింగ్స్ అమెరికన్ ఫిక్షన్ వంటి లాంటి చిత్రాలు పోటీ పడేందుకు బరిలోకి దిగాయి. భారత్​ నుంచి పోటీలో టు కిల్ ఏ టైగర్ ఉంది. ఉత్తమ డాక్యుమెంటరీ విభాగంలో ఈ చిత్రం ఆస్కార్​కు నామినేట్ అయింది. భారత్‌లోని ఓ మారుమూల గ్రామంలో షూటింగ్ జరుపుకుందీ చిత్రం. నిషా పహుజ దర్శకత్వం వహించారు.

ఇకపోతే గతేడాది భారత్​కు రెండు ఆస్కార్ అవార్డులు దక్కిన సంగతి తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్​ఆర్​ఆర్​ చిత్రంలోని నాటు నాటు సాంగ్​కు ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డ్ దక్కింది. అలాగే ది ఎలిఫెంట్‌ విష్పరర్స్ అనే డాక్యుమెంటరీ సిరీస్‌ కూడా ఈ ప్రతిష్ఠాత్మక అవార్డ్‌ను కైవసం చేసుకుంది.

ఓటీటీలోకి బాలయ్య బ్యూటీ హనీ రోజ్ రియల్ స్టోరీ మూవీ! - స్ట్రీమింగ్ ఎక్కడంటే?

మహేశ్ నటించిన ఆ రెండు చిత్రాలు నమ్రతకు అస్సలు నచ్చవట!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.