ETV Bharat / entertainment

పంద్రాగస్ట్​ - బాక్సాఫీస్ మాస్ జాతరే! - 2024 Independence Day Boxoffice

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 22, 2024, 10:09 AM IST

2024 Independence Day Tollywood Boxoffice : ఈ ఇండిపెండెన్స్​ డే టాలీవుడ్​ బాక్సాఫీస్ ముందు మాస్ జాతర కనిపించనుంది. భారీ హైప్​తో పలు మాస్ చిత్రాలు రిలీజ్​కు రెడీ అయ్యాయి. అవేంటంటే?

source Getty Images
2024 Independence Day Tollywood Boxoffice (source Getty Images)

2024 Independence Day Tollywood Boxoffice : టాలీవుడ్​ ఫస్టాఫ్​లో ఆశించినంత రేంజ్​లో సినిమాలేమీ హిట్ అందుకోలేదు. పక్కా మాస్ సినిమాగా వచ్చిన మహేశ్ గుంటూరు కారం మిక్స్​డ్ టాక్​తో ముగించేసింది. కేవలం హనుమాన్, టిల్లు స్క్వేర్ మాత్రమే మంచి సక్సెస్​ అందుకున్నాయి. ఇక సకెండాఫ్​ ప్రారంభంలో(జూన్​ చివర్లో) వచ్చిన కల్కి సెన్సేషనల్ హిట్ అందుకుంది. బాక్సాఫీస్​ను షేక్ చేసేసింది. దీంతో టాలీవుడ్ బాక్సాఫీస్ నెక్ట్స్ టార్గెట్ ఇండిపెండెన్స్​ డే.

అయితే ఇప్పుడు ఈ పంద్రాగస్ట్​న బాక్సాఫీస్ ముందు మాస్ జాతర కనిపించనుంది. వాస్తవానికి ఇండిపెండెన్స్ డే వీకెండ్​లో ముందుగా పుష్ప - 2, భారతీయుడు 2 కర్చీఫ్​లు వేశాయి. దీంతో బాక్సాఫీస్ షేకే అని అంతా ఆశించారు. కానీ ప్లాన్ మారింది. భారతీయుడు 2 ముందుగానే విడుదలై డిజాస్టర్​ అవ్వగా, పుష్ప 2 డిసెంబర్​కు వాయిదా పడింది.

దీంతో ఇప్పుడు ఇండిపెండెన్స్​ డే రోజున కొత్త చిత్రాలు కర్చీఫ్​లు వేశాయి. ఉస్తాద్​ రామ్ - పూరి జగన్నాథ్‌ డబుల్ ఇస్మార్ట్ ఆగస్టు 15కు(Double Ismart Release Date) షెడ్యూల్​ ఫిక్స్ చేసుకుంది. ఈ చిత్రం ఎంత మాస్​గా ఉండబోతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పట్లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మాస్‌ను ఒక ఊపు ఊపేసి బ్లాక్‌ బస్టర్ అందుకుంది. ఇప్పుడు సీక్వెల్​పై కూడా మాస్​ వర్గం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక తాజాగా ఆగస్టు 15 రేసులోకి మరో పెద్ద సినిమా కూడా వచ్చి చేరింది. అదే మిస్టర్ బచ్చన్(Mr Bachan Release Date). అసలే రవితేజ అంటే మాస్‌ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. పైగా ఆయనతో హరీశ్​ శంకర్ జట్టు కట్టడం వల్ల మాస్‌లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. చిత్రంలో మాస్​ అంశాలకు ఢోకా ఉండదనిపిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ ప్రోమోలు కూడా రవితేజ ఫ్యాన్స్​ను ఆకట్టుకున్నాయి. కాబట్టి ఈ ఏడాది పంద్రాగస్ట్​కు మాస్ సెంటర్లలో జాతరే అని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు.

ఇకపోతే ఆగస్టు 15నే ఆయ్, 35 లాంటి చిన్న చిత్రాలు కూడా విడుదలకు సిద్ధమయ్యాయి. కానీ డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ వస్తున్నాయి కాబట్టి ఈ సినిమాలు డౌటే. మరోవైపు పంద్రగస్ట్​నే తమిళ అనువాద చిత్రం విక్రమ్​ తంగలాన్(Vikram Thangalaan Release Date) కూడా రానుంది. డిఫరెంట్ కాన్సెప్ట్​తో రానున్న ఈ చిత్రం కూడా మాస్​ ప్రేక్షకులను అలరించే అవకాశాలు ఉన్నాయి.

షారుక్​ను బీట్ చేసిన ప్రభాస్‌ - మోస్ట్​ పాపులర్​ హీరోల్లో బన్నీ, చరణ్‌ ర్యాంక్ ఎంతంటే? - Most Popular Hero Prabhas

ధనుశ్ కామెంట్స్​తో ఎన్టీఆర్​, పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ! - Raayan Dhanush

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.