UPSC CAPF Notification 2024 : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) 506 అసిస్టెంట్ కమాండెంట్ (గ్రూప్-ఏ) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్), బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్), ఇండో-టిబిటెన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ), సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ)ల్లో పనిచేయాల్సి ఉంటుంది.
పోస్టుల వివరాలు
- బీఎస్ఎఫ్ - 186 పోస్టులు
- సీఆర్పీఎఫ్ - 120 పోస్టులు
- సీఐఎస్ఎఫ్ - 100 పోస్టులు
- ఐటీబీపీ - 58 పోస్టులు
- ఎస్ఎస్బీ - 42 పోస్టులు
- మొత్తం పోస్టులు - 506
విద్యార్హతలు
యూపీఎస్సీ సీఏపీఎఫ్ 2024 నోటిఫికేషన్ ప్రకారం, అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా విద్యాసంస్థ నుంచి బ్యాచులర్ డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి
అభ్యర్థుల వయస్సు 20 నుంచి 25 ఏళ్లలోపు ఉండాలి. అయితే రిజర్వేషన్ ఉన్నవాళ్లకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు.
దరఖాస్తు రుసుము
అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.200 చెల్లించాలి. అయితే మహిళలు, ఎస్సీ, ఎస్టీలు ఎలాంటి దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక విధానం
అభ్యర్థులకు ముందుగా రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణులైనవారికి ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్ (పీఈటీ), ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ (పీఎంటీ) చేస్తారు. చివరిగా ఇంటర్వ్యూ చేసి, అర్హులైన అభ్యర్థులను అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులకు ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం
- అభ్యర్థులు ముందుగా యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
- వెబ్సైట్లో మీ పేరు, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీ, ఆధార్ నంబర్ తదితర వివరాలు నమోదు చేసి, రిజిస్టర్ చేసుకోవాలి.
- అప్పుడు మీ పేరు మీద రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్ క్రియేట్ అవుతాయి. వాటితో లాగిన్ కావాలి.
- యూపీఎస్సీ సీఏపీఎఫ్ అప్లై లింక్‌ను ఓపెన్ చేయాలి.
- మీ వ్యక్తిగత వివరాలు, విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి.
- మీ ఫొటో, సిగ్నేచర్లను కూడా నిర్దేశిత ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు కూడా ఆన్లైన్లోనే చెల్లించాలి.
- అన్ని వివరాలు మరోసారి చెక్ చేసుకుని, అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
- భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్అవుట్ను భద్రపరుచుకోవాలి.
ముఖ్యమైన తేదీలు
- దరఖాస్తు స్వీకరణ ప్రారంభం : 2024 ఏప్రిల్ 24
- దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2024 మే 14
- అప్లికేషన్ కరెక్షన్ తేదీలు : 2024 మే 15 నుంచి 21 వరకు
- పరీక్ష తేదీ : 2024 ఆగస్టు 4
పీహెచ్డీ చేయాలా? CSIR-యూజీసీ నెట్‌కు అప్లై చేయండిలా! - CSIR UGC NET