ETV Bharat / education-and-career

ఎంసెట్​ కౌన్సెలింగ్​ అభ్యర్థులకు బిగ్ అలర్ట్ - మీ వద్ద ఈ సర్టిఫికెట్లు ఉన్నాయా? - లేదంటే తిప్పలు తప్పవు! - TS EAMCET Counselling 2024

TS EAMCET Counselling 2024 : రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశం పొందేందుకు జులై 4 నుంచి ఎప్​సెట్(ఎంసెట్) కౌన్సెలింగ్ మొదలైంది. ఈ క్రమంలో కౌన్సెలింగ్​కి హాజరయ్యే విద్యార్థులకు బిగ్ అలర్ట్. కౌన్సెలింగ్​కి అవసరమైన ఈ ధ్రువ పత్రాలు కలిగి ఉన్నారో లేదో ఓసారి పరిశీలించుకోండి. అవి లేకపోతే ఇబ్బందే. ఇంతకీ.. ఆ పత్రాలేంటో ఇప్పుడు చూద్దాం.

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 4, 2024, 4:30 PM IST

TS EAPCET 2024 COUNSELLING
TS EAMCET Counselling 2024 (ETV Bharat)

TS EAPCET (EAMCET) 2024 Counselling Updates : తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో బీటెక్‌లో ప్రవేశం పొందేందుకు ఎప్‌సెట్‌(ఎంసెట్) తొలి విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ జులై 4 (గురువారం) నుంచి స్టార్ట్ అయింది. మొత్తం మూడు విడతల్లో ఈ ప్రక్రియ కొనసాగనుంది. దీని ద్వారా ఇంజినీరింగ్​తోపాటు ఎంపీసీ నుంచి ఫార్మసీ కోర్సులకు వెళ్లే వారికి సీట్ల కేటాయించడం జరుగుతుంది. ఈ క్రమంలోనే ఎప్​సెట్ కౌన్సెలింగ్​లో పాల్గొనే విద్యార్థులు ముందుగానే తమ వద్ద ఈ ధ్రువపత్రాలు ఉన్నాయో లేదో ఓసారి చెక్ చేసుకోవాలి. లేదంటే.. కౌన్సెలింగ్ టైమ్​లో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది! ఇంతకీ, టీఎస్ ఎప్​సెట్(EAPCET 2024) కౌన్సెలింగ్​లో పాల్గొనే వారికి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

టీఎస్ ఎప్​సెట్ వెబ్‌కౌన్సెలింగ్‌లో భాగంగా నిర్వహించే ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా కొన్ని అవసరమైన డాక్యుమెంట్లు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒరిజినటల్ సర్టిఫికేట్లతోపాటు రెండు జతల జిరాక్స్ కాపీలు అభ్యర్థులు తమ వెంట తీసుకెళ్లాల్సి ఉంటుందనే విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా కౌన్సెలింగ్​కు హాజరయ్యే విద్యార్థులు ఇప్పుడు చెప్పబోయే సర్టిఫికేట్లు వారి వద్ద కలిగి ఉండాలి. అవేంటంటే..

  • పదో తరగతి మార్కుల మెమో
  • ఇంటర్ మార్కుల మెమో
  • ట్రాన్స్​ ఫర్ సర్టిఫికేట్(TC)
  • స్టడీ సర్టిఫికెట్లు(6 నుంచి ఇంటర్ వరకు తప్పనిసరిగా ఉండాలి)
  • లేటెస్ట్ ఇన్​కం సర్టిఫికెట్(అంటే.. 01-01-2024 తర్వాత జారీ అయి ఉండాలి)
  • క్యాస్ట్ సర్టిఫికేట్
  • ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్(అంటే.. మీకు EWS రిజర్వేషన్ అర్హత ఉంటే స్థానిక ఎమ్మార్వో ఆఫీస్ నుంచి సర్టిఫికెట్ తీసుకోవాలి)
  • ఆధార్ కార్డు
  • టీఎస్ ఈఏపీసెట్(ఎంసెట్) - 2024 హాల్‌టికెట్‌
  • టీఎస్ ఈఏపీసెట్(ఎంసెట్) - 2024 ర్యాంక్ కార్డు(ఒకవేళ.. మీ వద్ద ర్యాంక్ కార్డు లేకపోతే https://eapcet.tsche.ac.in/ వెబ్ సైట్​లోకి వెళ్లి డౌన్​లోడ్ చేసుకోండి)
  • పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలు

పైన చెప్పిన సర్టిఫికెట్లను ఎప్​సెట్ 2024 కౌన్సెలింగ్​లో పాల్గొనే అభ్యర్థులు ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవడం మంచిది.

స్టడీ గ్యాప్ వచ్చినవారు - ఎంసెట్, నీట్ వంటి పరీక్షలు రాయొచ్చా?

ఎప్‌సెట్‌ వెబ్‌సైట్‌లోనే ప్రవేశాల లింక్‌ : గత సంవత్సరం వరకు ఫలితాలు విడుదల చేసేందుకు, ప్రవేశాల కౌన్సెలింగ్​కు వేర్వేరు వెబ్‌సైట్‌ ఉండేది. దీంతో.. విద్యార్థులు కాస్త గందరగోళానికి గురయ్యేవారు. కానీ.. ఈసారి ఎప్‌సెట్‌ వెబ్‌సైట్‌ (www.eapcet.tsche.ac.in) లోకి వెళ్లినా అక్కడే అడ్మిషన్​పై క్లిక్​ చేస్తే కౌన్సెలింగ్​ వెబ్​సైట్ (www.tseapcet.nic.in)లోకి వెళ్లొచ్చు.

తొలి విడత : జులై 4 నుంచి 12 వరకు విద్యార్థులు ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించి, సర్టిఫికెట్ వెరిఫికేషన్​కు ఎప్పుడు హాజరవుతారో స్లాట్‌ బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. జులై 6 నుంచి 13 వరకు రాష్ట్రవ్యాప్తంగా 36 హెల్ప్‌లైన్‌ కేంద్రాల్లో ఏదో ఒకచోట సర్టిఫికెట్ వెరిఫికేషన్​కు హాజరుకావాలి. సర్టిఫికెట్ వెరిఫికేషన్​ చేయించుకున్న వారు జులై 8 నుంచి 15 వరకు వారికి నచ్చిన కళాశాలలు, కోర్సులను ఎంచుకునేందుకు వెబ్‌ఆప్షన్లు ఇచ్చుకోవాలి. వారికి జులై 19న తొలివిడత సీట్ల కేటాయింపు పూర్తి చేయనున్నారు.

రెండో విడత : జులై 26 నుంచి రెండో విడత కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. జులై 27 సర్టిఫికెట్ వెరిఫికేషన్, జులై 27 నుంచి 28 వరకు వెబ్ ఆప్షన్లకు ఛాన్స్ కల్పిస్తారు. జులై 31న రెండో విడత సీట్ల కేటాయింపు కంప్లీట్ అవుతుంది.

మూడో విడత : ఆగస్టు 8 నుంచి మూడో విడత కౌన్సిలింగ్ ప్రక్రియ మొదలుపెట్టి ఆగస్టు 9న సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయనున్నారు. అదే రోజు నుంచి.. ఆగస్టు 10 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇచ్చి ఆగస్టు 13న లాస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి చేయనున్నారు. కన్వీనర్ కోటా ఇంటర్నల్ స్లైడింగ్​కు ఆగస్టు 21, 22 తేదీల్లో అవకాశం కల్పించి ఆగస్టు 26న సీట్లు కేటాయింపు కంప్లీట్ చేయనున్నారు.

గవర్నమెంట్ జాబ్​ కోసం ప్రిపేర్ అవుతున్నారా? ఈ 10 టిప్స్ పాటిస్తే ఉద్యోగం గ్యారెంటీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.