SSC GD Notification 2025 : నిరుద్యోగ యువతకు శుభవార్త. 39,481 కానిస్టేబుల్ (జీడీ) పోస్టుల భర్తీ కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) నోటిఫికేషన్‌ను జారీ చేసింది. 2025 జనవరి లేదా ఫిబ్రవరిలో రాత పరీక్షలు జరగనున్నాయి. పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. కనుక అర్హత, ఆసక్తి ఉన్నవారు గడువులోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టుల వివరాలు
బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ, ఎస్‌ఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులు; అసోం రైఫిల్స్‌లో రైఫిల్‌మ్యాన్ (జనరల్ డ్యూటీ); ఎన్‌సీబీలో సిపాయి పోస్టులు ఉన్నాయి.
విద్యార్హతలు : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ నుంచి మెట్రిక్యులేషన్/ పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
ఫిజికల్ స్టాండర్డ్స్ : పురుష అభ్యర్థుల ఎత్తు 170 సెం.మీ., మహిళా అభ్యర్థుల ఎత్తు 157 సెం.మీ.లకు తగ్గకూడదు.
వయస్సు :
- అభ్యర్థుల వయస్సు 18 నుంచి 23 ఏళ్ల మధ్యలో ఉండాలి.
- ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు; ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులకు ఐదేళ్లు వయోపరిమితి సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము :
- జనరల్, ఓబీసీ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.100 చెల్లించాలి.
- మహిళలు, మాజీ సైనిక ఉద్యోగులు, ఎస్టీ, ఎస్సీలు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక విధానం
రాత పరీక్ష, ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, రిజర్వేషన్‌ల ఆధారంగా అర్హులైన అభ్యర్థులను కానిస్టేబుల్ పోస్టులకు ఎంపిక చేస్తారు.
సీబీఈ పరీక్ష విధానం : ప్రశ్నాపత్రం 160 మార్కులకు ఉంటుంది. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు చొప్పున ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్‌నెస్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్/ హిందీ అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు. నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది.
దరఖాస్తు విధానం : అభ్యర్థులు ఎస్ఎస్సీ అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష ఫీజు కూడా ఆన్లైన్లోనే చెల్లించాలి.
ఆంధ్రప్రదేశ్‌లోని పరీక్షా కేంద్రాలు : విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, చీరాల, కర్నూలు, తిరుపతి,
తెలంగాణాలోని పరీక్ష కేంద్రాలు : హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.
ముఖ్యమైన తేదీలు
- దరఖాస్తులు ప్రారంభం : 2024 సెప్టెంబర్ 5
- దరఖాస్తుకు చివరి తేదీ : 2024 అక్టోబర్ 14
- ఎడిట్ ఆప్షన్ : నవంబర్ 5, 6, 7
- పరీక్ష తేదీలు : 2025 జనవరి/ ఫిబ్రవరి