ETV Bharat / education-and-career

SBI భారీ నోటిఫికేషన్‌ - 1511 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు భర్తీ - దరఖాస్తుకు మరో 3రోజులే ఛాన్స్‌! - SBI SO Recruitment 2024 - SBI SO RECRUITMENT 2024

SBI SO Recruitment 2024 : బ్యాంక్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్‌. ఎస్‌బీఐ 1511 స్పెషలిస్ట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చేయడానికి మరో 3 రోజులే ఛాన్స్ ఉంది. పూర్తి వివరాలు మీ కోసం.

SBI
SBI (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 1, 2024, 5:23 PM IST

SBI SO Recruitment 2024 : దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ), సెంట్రల్ రిక్రూట్‌మెంట్ & ప్రమోషన్ డిపార్ట్‌మెంట్, కార్పొరేట్ సెంటర్ - రెగ్యులర్ ప్రాతిపదికన స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్ ద్వారా 1,511 స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్ నియమకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అక్టోబర్‌ 4వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

పోస్టుల వివరాలు

  • డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్) - ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ అండ్‌ డెలివరీ - 187 పోస్టులు
  • డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్) - ఇన్‌ఫ్రా సపోర్ట్ అండ్‌ క్లౌడ్ ఆపరేషన్స్ - 412 పోస్టులు
  • డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్) - నెట్‌వర్కింగ్ ఆపరేషన్స్‌ - 80 పోస్టులు
  • డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్) - ఐటీ ఆర్కిటెక్ట్ - 27 పోస్టులు
  • డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్) - ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ - 07 పోస్టులు
  • అసిస్టెంట్ మేనేజర్ (సిస్టమ్) - 798 పోస్టులు
  • మొత్తం పోస్టులు - 1,511

విద్యార్హతలు : పోస్టును అనుసరించి అభ్యర్థులు సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంటెక్‌, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.

వయోపరిమితి : 2024 జూన్‌ 30 నాటికి డిప్యూటీ మేనేజర్ పోస్టులకు 25 నుంచి 35 ఏళ్లు; అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 21 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య అభ్యర్థుల వయస్సు ఉండాలి.

దరఖాస్తు రుసుము : జనరల్, ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.750 చెల్లించాలి. దివ్యాంగులకు, ఎస్టీ, ఎస్సీలకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

ఎంపిక విధానం : రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా అర్హులైన అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

పే స్కేల్ : డిప్యూటీ మేనేజర్‌లకు నెలకు రూ.64,820 - రూ.93,960 జీతం ఉంటుంది. అసిస్టెంట్ మేనేజర్‌లకు నెలకు రూ.48,480 - రూ.85,920 సాలరీ ఉంటుంది.

పోస్టింగ్ స్థలం : హైదరాబాద్‌/ నవీ ముంబయి

ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తులు ప్రారంభం : 2024 సెప్టెంబర్‌ 14
  • దరఖాస్తుకు చివరి తేదీ : 2024 అక్టోబర్‌ 4

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.