Railway Jobs 2024 : గోరఖ్‌పుర్‌లోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్, నార్త్ ఈస్ట్రన్ రైల్వే ఎన్ఈఆర్ పరిధిలోని యూనిట్లలో ఖాళీగా ఉన్న 1104 యాక్ట్ అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత ఉన్న ఆభ్యర్థులు గడువులోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
పోస్టుల వివరాలు (వర్క్‌షాప్/ యూనిట్ల వారీగా)
- మెకానికల్ వర్క్‌షాప్ (గోరఖ్‌పూర్) - 411
- సిగ్నల్ వర్క్‌షాప్ (గోరఖ్‌పూర్ కంటోన్మెంట్) - 63
- బ్రిడ్జ్ వర్క్‌షాప్ (గోరఖ్‌పూర్ కంటోన్మెంట్) - 35
- మెకానికల్ వర్క్‌షాప్ (ఇజ్జత్‌నగర్) - 151
- డీజిల్ షెడ్ (ఇజ్జత్‌నగర్) - 60
- క్యారేజ్ అండ్ వ్యాగన్ (ఇజ్జత్‌నగర్) - 64
- క్యారేజ్ అండ్ వ్యాగన్ (లఖ్‌నవూ జంక్షన్) - 155
- డీజిల్ షెడ్ (గోండా) - 23
- క్యారేజ్ అండ్ వ్యాగన్ (వారణాసి) -75
- మొత్తం పోస్టులు - 1104
ట్రేడ్స్
RRC NER Trades : ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్, కార్పెంటర్, టర్నర్, మెకానిక్ డీజిల్, ట్రిమ్మర్, పెయింటర్, మెషినిస్ట్
విద్యార్హతలు
RRC NER Apprentice Eligibility : అభ్యర్థులు కనీసం 50 % మార్కులతో పదో తరగతి సహా, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి
RRC NER Apprentice Age Limit :అభ్యర్థుల వయస్సు 2024 జూన్ 12 నాటికి 15 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్యలో ఉండాలి.
దరఖాస్తు రుసుము
RRC NER Apprentice Application Fee :
- జనరల్, ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.100 చెల్లించాలి.
- మహిళలు, దివ్యాంగులు, ఎస్టీ, ఎస్సీలు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
శిక్షణ వ్యవధి
RRC NER Apprentice Training : యాక్ట్ అప్రెంటీస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఒక ఏడాది పాటు శిక్షణ ఇస్తారు.
ఎంపిక విధానం
RRC NER Apprentice Selection Process : పదో తరగతి, ఐటీఐ పరీక్షల్లో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపింక చేస్తారు.
దరఖాస్తు విధానం
- ముందుగా మీరు https://ner.indianrailways.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
- RRC NER Apprentice Recruitment 2024 లింక్‌పై క్లిక్ చేయాలి.
- దరఖాస్తు ఫారమ్‌లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి.
- అవసరమైన అన్ని డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి.
- దరఖాస్తు రుసుము కూడా ఆన్లైన్లోనే చెల్లించాలి.
- అన్ని వివరాలు మరోసారి చెక్ చేసుకొని అప్లికేషన్‌ను సబ్మిట్ చేయాలి.
- భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్అవుట్ను భద్రపరుచుకోవాలి.
ముఖ్యమైన తేదీలు
- దరఖాస్తు స్వీకరణ ప్రారంభం : 2024 జూన్ 12
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 2024 జులై 11
పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్నారా? ఇలా చదివితే ఉద్యోగం గ్యారెంటీ! - Smart Study Tips