ETV Bharat / education-and-career

ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారా? 2024లో ఫుల్​ డిమాండ్ ఉన్న టాప్​-6 జాబ్స్​ ఇవే! - high salary jobs in india

Most Demanding Jobs In India 2024 : మీరు మంచి జాబ్​ కోసం ప్రయత్నిస్తున్నారా? వర్క్ కాస్త క్రియేటివ్​గా ఉండాలా? అయితే ఇది మీ కోసమే. ప్రస్తుతం ఫుల్ డిమాండ్​ ఉన్న టాప్​-6 జాబ్స్​పై ఓ లుక్కేద్దాం రండి.

high demand jobs in india
Most Demanding Jobs In India 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 9, 2024, 12:23 PM IST

Most Demanding Jobs In India 2024 : నేటి కాలంలో చాలా మంది ఉద్యోగులు ప్రస్తుతం తాము చేస్తున్న జాబ్​ విషయంలో అసంతృప్తిగా ఉన్నారని లింక్డ్​ఇన్​ అధ్యయనంలో తేలింది. అందుకే చాలా మంచి కొత్త కేరీర్ ఆప్షన్ల కోసం వెతుకున్నారని స్పష్టం చేసింది. పని ఒత్తిడి వల్ల లేదా మూస ఉద్యోగాలు చేయడం ఇష్టం లేదా మెరుగైన జీతం కోసం చాలా మంది ప్రొఫెషనల్స్ తాము చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకునేందుకు సిద్ధపడుతున్నారు. లింక్డ్​ఇన్ అధ్యయనం​ ప్రకారం, మన దేశంలోని దాదాపు 88 శాతం మంది నిపుణులు కొత్త ఉద్యోగాల కోసం అన్వేషిస్తున్నారు. ఇలాంటి వారి కోసమే లింక్డ్​ఇన్​ ప్రస్తుతం భారత్​లో అత్యధిక డిమాండ్ ఉన్న ఉద్యోగాల జాబితాను విడుదల చేసింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

  1. క్లోజింగ్ మేనేజర్
    దేశంలో క్లోజింగ్ మేనేజర్​ జాబ్​కు మంచి డిమాండ్ ఉంది. ​ఒక వ్యాపార సంస్థలో లేదా ఆర్గనైజేషన్​లో సిబ్బంది నిర్వహణ, ఇన్వెంటరీ మేనేజ్​మెంట్​, క్వాలిటీ కంట్రోల్​ లాంటి రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షించడం క్లోజింగ్ మేనేజర్ ప్రధాన విధి. రోజువారీ వ్యాపార కార్యకలాపాలు, పనులు, బాధ్యతలను సజావుగా ముగించడంలో క్లోజింగ్ మేనేజర్​ది కీలక పాత్ర.
  2. ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ స్పెషలిస్ట్
    ఏదైనా ఒక బ్రాండ్ లేదా ఉత్పత్తికి తగిన డిమాండ్ కల్పించమే ఈ ఇన్​ఫ్లూయెన్సర్​ మార్కెటింగ్ స్పెషలిస్టు ప్రధాన విధి. రిలేషన్ షిప్ బిల్డింగ్, క్యాంపెయిన్ మేనేజ్‌మెంట్, బడ్జెట్ మేనేజ్‌మెంట్ , ట్రెండ్ అనాలిసిస్ లాంటి కీలక బాధ్యతలను ఇన్​ఫ్లూయెన్సర్​ మార్కెటింగ్ స్పెషలిస్ట్​ నిర్వర్తించాల్సి ఉంటుంది.
  3. డిజైన్ స్పెషలిస్ట్
    డిజైన్ ప్రిన్సిపల్స్​పై లోతైన అవగాహన కలిగి ఉండి, అత్యుత్తమ పరిష్కారాలను కనుక్కోవడం డిజైన్ స్పెషలిస్ట్ చేయాల్సిన ముఖ్యమైన పని. గ్రాఫిక్ డిజైన్, యూజర్ ఇంటర్‌ఫేస్ డిజైన్, బ్రాండింగ్, ప్రోటోటైపింగ్ ఇవన్నీ డిజైన్ స్పెషలిస్ట్​ చేయాల్సి ఉంటుంది.
  4. డ్రోన్ పైలట్
    యూఏవీలను, డ్రోన్‌లను వివిధ ప్రయోజనాల కోసం ఆపరేట్ చేయడంలో డ్రోన్ పైలట్​దే కీలకపాత్ర. డ్రోన్‌లను సురక్షితంగా, సమర్ధవంతంగా ఎగరవేయడం, ఏరియల్ ఫుటేజీని జాగ్రత్తగా సేకరించడం, అలాగే డ్రోన్ నిర్వహణ నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడం లాంటివి డ్రోన్ పైలట్ చూసుకోవాలి.
  5. రిక్రూటర్
    ఒక సంస్థకు అవసరమైన మానవ వనురులను అందించడానికి అర్హత కలిగిన అభ్యర్థులను గుర్తించడం, వారిని నియమించడం ఈ రిక్రూటర్ ప్రధానమైన విధులు. అభ్యర్థులను ఎంపిక చేయడం నుంచి ఆన్‌బోర్డింగ్ వరకు అంతా రిక్రూటర్సే చూసుకోవాల్సి ఉంటుంది. రిక్రూట్‌మెంట్ ప్రక్రియను సరిగా నిర్వహించి, సంస్థ నిర్వహణలో ఈ రిక్రూటర్ కీలకపాత్ర పోషిస్తాడు.
  6. సేల్స్ డెవలప్‌మెంట్ రిప్రజెంటేటివ్​
    సంస్థ అమ్మకాలను పెంచి, లాభాలబాట పట్టించడంలో కీలకపాత్ర పోషించే వారినే సేల్స్ డెవలప్​మెంట్​ రిప్రజెంటేటివ్​ అని పిలుస్తారు. సేల్స్ ఎలా జరుగుతుంది? ఎలాంటి ఉత్పత్తులపై సంస్థ దృష్టి సారించాలి? అమ్మకాలను ఎలా పెంచాలి? లాంటి విధులన్నీ ఈ సేల్స్ డెవలప్​మెంట్​ రిప్రజెంటేటివ్​ చూసుకుంటాడు.

TCS సీక్రెట్ లీక్- ఆ పని చేస్తే జీతం డబుల్ కావడం ఖాయమట!

ఛాలెంజింగ్ జాబ్స్ చేయాలా? 2024లో ఉన్న టాప్-6​ కెరీర్ ఆప్షన్స్ ఇవే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.