ETV Bharat / education-and-career

డిగ్రీ అర్హతతో - LICలో 200 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు - దరఖాస్తు చేసుకోండిలా! - LIC Recruitment 2024 - LIC RECRUITMENT 2024

LIC Recruitment 2024 : డిగ్రీలు చేసి ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్​. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్​ఐసీ) హౌసింగ్​ ఫైనాన్స్​ లిమిటెడ్​లో ఉన్న 200 జూనియర్ అసిస్టెంట్​ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. పూర్తి వివరాలు మీ కోసం.

LIC HFL Junior Assistant Recruitment 2024
LIC (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 30, 2024, 10:16 AM IST

LIC Recruitment 2024 : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్​ఐసీ) హౌసింగ్​ ఫైనాన్స్​ లిమిటెడ్​లో ఉన్న 200 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్​లైన్​లో గడువులోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

ఉద్యోగాల వివరాలు

  • మొత్తం పోస్టులు - 200
  • ఆంధ్రప్రదేశ్​ - 12 పోస్టులు
  • తెలంగాణ - 31 పోస్టులు

విద్యార్హతలు
LIC HFL Junior Assistant Qualification : అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా విద్యా సంస్థ నుంచి కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.

వయోపరిమితి
LIC HFL Junior Assistant Age Limit : అభ్యర్థుల వయస్సు 21 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్యలో ఉండాలి.

దరఖాస్తు రుసుము
LIC HFL Junior Assistant Fee : అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.800 + జీఎస్టీ చెల్లించాలి.

ఎంపిక ప్రక్రియ
LIC HFL Junior Assistant Selection Process : అభ్యర్థులకు ముందుగా ఆన్​లైన్ పరీక్ష పెడతారు. ఇందులో క్వాలిఫై అయిన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి, అర్హులను జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు ఎంపిక చేస్తారు.

జీతభత్యాలు
LIC HFL Junior Assistant Salary : జూనియర్ అసిస్టెంట్​లకు నెలకు రూ.32,000 నుంచి రూ.35,200 వరకు జీతం ఉంటుంది.

పరీక్ష విధానం
LIC HFL Junior Assistant Exam Pattern : అభ్యర్థులకు 200 మార్కులకు ఆన్​లైన్​ పరీక్ష నిర్వహిస్తారు. దీనిని 120 నిమిషాల వ్యవధిలోనే రాయాల్సి ఉంటుంది. లాజికల్ రీజనింగ్​, న్యూమరికల్ అబిలిటీ, ఇంగ్లీష్​, జనరల్ అవేర్​నెస్​, కంప్యూటర్ స్కిల్స్​పై ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో విభాగం నుంచి 40 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కట్ చేస్తారు. అంటే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.

దరఖాస్తు విధానం
LIC HFL Junior Assistant Application Process :

  • అభ్యర్థులు ముందుగా ఎల్​ఐసీ హెచ్​ఎఫ్​ఎల్ అధికారిక వెబ్​సైట్​ https://www.lichousing.com/ ఓపెన్ చేయాలి.
  • హోమ్ పేజ్​లోని Careers ఆప్షన్​పై క్లిక్ చేయాలి.
  • LIC HFL Junior Assistant Notification 2024 లింక్​పై క్లిక్​ చేయాలి.
  • దరఖాస్తు ఫారమ్​లో మీ వ్యక్తి, విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి.
  • అప్లికేషన్ ఫీజు కూడా ఆన్​లైన్​లోనే చెల్లించాలి.
  • అన్ని వివరాలు మరోసారి చెక్ చేసుకుని, అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.

ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తు స్వీకరణ ప్రారంభం : 2024 జులై 25
  • దరఖాస్తుకు చివరి తేదీ : 2024 ఆగస్టు 15
  • పరీక్ష తేదీ : 2024 సెప్టెంబర్​

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - రైల్వేలో 7951 జేఈ, సూపర్​ వైజర్​ పోస్టులు భర్తీ - దరఖాస్తు చేసుకోండిలా! - RRB JE Recruitment 2024

డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా అర్హతతో - ఇండియన్​ నేవీలో 741 పోస్టులు - దరఖాస్తుకు మరో 7 రోజులే ఛాన్స్​! - Indian Navy Recruitment 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.