ITBP Head Constable Jobs 2024 : ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ) 112 హెడ్ కానిస్టేబుల్ (ఎడ్యుకేషన్ అండ్ స్ట్రెస్ కౌన్సిలర్) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటికి పురుషులతోపాటు, మహిళలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ గ్రూప్-సీ (నాన్-గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్) పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
హెడ్ కానిస్టేబుల్ పోస్టుల వివరాలు
- పురుషులు - 96
- మహిళలు - 16
- మొత్తం పోస్టులు - 112
విద్యార్హతలు
ITBP Head Constable Qualification : సైకాలజీలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. లేదా డిగ్రీ, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి
ITBP Head Constable Age Limit : 2024 ఆగస్టు 5 నాటికి అభ్యర్థుల వయస్సు 20 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, వివిధ కేటగిరీల వారికి వయోపరిమితి నుంచి మినహాయింపులు లభిస్తాయి.
దరఖాస్తు రుసుము
ITBP Head Constable Application Fee :
- జనరల్, ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.100 చెల్లించాలి.
- మహిళలు, మాజీ సైనికోద్యోగులు, ఎస్టీ, ఎస్సీలకు దరఖాస్తు రుసుము నుంచి మినహాయింపు ఉంది.
ఎంపిక ప్రక్రియ
ITBP Head Constable Selection Process : ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్లు చేసి, అర్హులైన వారిని హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు ఎంపిక చేస్తారు.
జీతభత్యాలు
ITBP Head Constable Salary : ఐటీబీపీ హెడ్ కానిస్టేబుల్‌కు నెలకు రూ.25,500 నుంచి రూ.81,100 వరకు జీతం ఉంటుంది.
దరఖాస్తు విధానం
ITBP Head Constable Application Process :
- ముందుగా ఐటీబీపీ అధికారిక వెబ్సైట్ https://recruitment.itbpolice.nic.in/rect/index.php ఓపెన్ చేయాలి.
- పోర్టల్‌లో మీ వివరాలు నమోదు చేసి, రిజిస్టర్ చేసుకోవాలి. వెంటనే మీకొక యూజర్ ఐడీ, పాస్వర్డ్ జనరేట్ అవుతుంది.
- ఈ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లతో వెబ్సైట్లో లాగిన్ కావాలి.
- అప్లికేషన్ ఫారమ్‌లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి.
- మీ ఫొటో, సిగ్నేచర్ సహా, అవసరమైన అన్ని పత్రాలు అప్లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు కూడా ఆన్లైన్లోనే చెల్లించాలి.
- అన్ని వివరాలు మరోసారి చెక్ చేసుకొని, అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
- భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్అవుట్ను భద్రపరుచుకోవాలి.
ముఖ్యమైన తేదీలు
ITBP Recruitment 2024 Apply Last Date :
- ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం : 2024 జులై 7
- ఆన్లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2024 ఆగస్టు 5
ఆర్ట్స్ విద్యార్థుల కోసం IITs అందిస్తున్న బెస్ట్ కోర్సులు ఇవే! - Arts Students Career Options