ETV Bharat / education-and-career

అసిస్టెంట్​ మేనేజర్​ ఉద్యోగాలు- లక్షా40వేలు జీతం!- పూర్తి వివరాలివే - govt job news 2024

IRCON Recruitment 2024 : ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్​ న్యూస్. ఇర్కాన్​లో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీ కోసంనోటిఫికేషన్ విడుదలైంది. విద్యార్హతలు, వయోపరిమితి, దరఖాస్తు ఫీజు, అప్లికేషన్ విధానం తదితర పూర్తి వివరాలు మీకోసం.

IRCON Recruitment 2024
IRCON Recruitment 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 25, 2024, 6:02 PM IST

Updated : Jan 25, 2024, 6:13 PM IST

IRCON Recruitment 2024 : ఇంజనీరింగ్ చేసి రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్​న్యూస్. తాజాగా భారత రైల్వేశాఖకు చెందిన IRCON (ఇండియన్ రైల్వే కన్​స్ట్రక్షన్​ ఇంటర్నేషననల్ లిమిటెడ్​)లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఇంజనీరింగ్, కన్​స్ట్రక్షన్​, రవాణా మౌలిక వసతులపై ఈ సంస్థ పనిచేస్తుంటుంది. అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల నియామకాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పోస్టుకు కావాల్సిన అర్హతలు, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం మొదలైన వివరాలు మీకోసం.

  • పోస్టు : అసిస్టెంట్ మేనేజర్
  • పోస్టుల సంఖ్య : 28
  • దరఖాస్తు చేయడానికి చివరి తేదీ : ఫిబ్రవరి 9

అర్హతలు
ప్రభుత్వ గుర్తింపు పొందిన కళాశాల నుంచి సివిల్ ఇంజనీరింగ్​లో గ్రాడ్యుయేషన్​ పూర్తిచేసి ఉండాలి. బీటెక్​లో కనీసం 75 శాతం మార్కులతో ఉత్తీర్ణత చెంది ఉండాలి. రహదారులు, రైల్వేలు, బ్రిడ్జిల కన్​స్ట్రక్షన్​ విభాగాల్లో కనీసం రెండేళ్ల ఎక్స్​పీరియన్స్​ ఉన్నవారికి ఉద్యోగ ఎంపికలో ప్రాధాన్యం ఉంటుంది. దరఖాస్తు చేసే అభ్యర్థుల వయసు 30 ఏళ్లలోపు ఉండాలి.

ఎంపిక ప్రక్రియ

  1. ఆన్​లైన్​లో ఎగ్జామ్​
  2. పర్సనల్ ఇంటర్య్యూ
  3. డాక్యుమెంట్​ వెరిఫికేషన్

ఆన్​లైన్​లో అప్లై చేయు విధానం

  • ముందుగా IRCON అఫీషియల్ పోర్టల్​ https://ircon.org/ వెబ్​సైట్​ను సందర్శించాలి.
  • వెబ్​సైట్​లోని హోమ్​పేజ్​పై క్లిక్ చేయాలి. అక్కడ అసిస్టెంట్ మేనేజర్​ రిక్రూట్​మెంట్ అనే లింక్​ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి పోస్టుకు సంబంధించిన వివరాలను చదవండి.
  • ఆ తర్వాత హోమ్​పేజ్​లోని అప్లై నౌ అనే ఆప్షన్​పై క్లిక్ చేయాలి. ముందుగా మీ పేరు, అడ్రస్ మొదలైన వివరాలు ఎంటర్ చేయాలి. ఈ మొత్తం వివరాలు నమోదు చేసి రిజిస్టర్ అవ్వాలి.
  • మీ రిజిస్టర్ నంబర్​తో లాగిన్ అయ్యి అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభించాలి.
  • అవసరమైన అన్ని డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి.
  • మొత్తం వివరాలన్నింటిని ఎంటర్ చేశాక అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

అప్లికేషన్ ఫీజు

  • ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్​, ఎక్స్-సర్వీస్​మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు
  • జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ. 1000 ఆన్​లైన్​లో చెల్లించాలి.

వేతన శ్రేణి
అసిస్టెంట్​ మేనేజర్ రిక్రూట్​మెంట్​కు ఎంపికయ్యే వారికి రూ. 40,000- రూ.1,40,000 లభిస్తుంది. ఉద్యోగంలో చేరేముందు అభ్యర్థులు కనీసం 3 ఏళ్ల పాటు సేవలందించేలా బాండ్​పై సంతకం చేయాల్సి ఉంటుంది. ఒక వేళ ఉద్యోగంలో చేరాక మీరు బాండ్ బ్రేక్ చేయాలనుకుంటే కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.

రైల్వేలో 5696 అసిస్టెంట్​ లోకో పైలట్ ఉద్యోగాలు - అప్లై చేయండిలా!

ఐటీఐ అర్హతతో 1646 రైల్వే ఉద్యోగాలు - అప్లై చేసుకోండిలా!

Last Updated : Jan 25, 2024, 6:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.