IOCL Recruitment 2024 : ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) 88 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఇంజినీరింగ్ అసిస్టెంట్, టెక్నికల్ అటెండెంట్, క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్ పోస్టులు ఉన్నాయి. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు గడువులోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఉద్యోగాల వివరాలు
- ఇంజినీరింగ్ అసిస్టెంట్ - 38 పోస్టులు
- టెక్నికల్ అటెండెంట్ - 29 పోస్టులు
- జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్ - 21 పోస్టులు
- మొత్తం పోస్టులు - 88
విద్యార్హతలు
IOCL Jobs Eligibility :
- ఇంజినీరింగ్ అసిస్టెంట్ : ఈ పోస్టులకు అభ్యర్థులు రిలవెంట్ డిసిప్లైన్లో ఇంజినీరింగ్ డిప్లొమా చేసి ఉండాలి.
- టెక్నికల్ అటెండెంట్ : ఈ పోస్టులకు అభ్యర్థులకు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ చేసి ఉండాలి.
- జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్ : ఈ పోస్టులకు అభ్యర్థులు బీఎస్సీ చదివి ఉండాలి.
వయోపరిమితి
IOCL Engineer Job Age Limit : అభ్యర్థుల వయస్సు 2024 జులై 31 నాటికి 18 ఏళ్ల నుంచి 26 ఏళ్ల మధ్యలో ఉండాలి. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం, వివిధ కేటగిరీల వారికి వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు రుసుము
IOCL Application Fee :
- జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.300 చెల్లించాలి.
- దివ్యాంగులు, ఎస్టీలు, ఎస్సీలు ఎలాంటి దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ
IOCL Job Selection Process : అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి, మెరిట్ సాధించిన వారిని ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
జీతభత్యాలు
IOCL Engineer Salaries :
- ఇంజినీరింగ్ అసిస్టెంట్, జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.25,000 నుంచి రూ.1,05,000 వరకు జీతం ఇస్తారు.
- టెక్నికల్ అటెండెంట్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.23,000 నుంచి రూ.78,000 జీతం అందిస్తారు.
దరఖాస్తు విధానం
IOCL Job Application Process :
- ముందుగా మీరు ఐవోసీఎల్ అధికారిక వెబ్సైట్ https://iocl.com/ ఓపెన్ చేయాలి.
- Whats New సెక్షన్లోకి వెళ్లి, 'రిక్రూట్మెంట్ ఆఫ్ నాన్-ఎగ్జిక్వూటివ్ పర్సనల్ 2024 రిఫైనరీ అండ్ పైప్‌లైన్ డివిజన్ 2024'పై క్లిక్ చేయాలి.
- తరువాత Apply Online లింక్‌పై క్లిక్ చేయాలి.
- మీ మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీలను నమోదు చేసి, రిజిస్టర్ చేసుకోవాలి.
- వెంటనే మీ మెయిల్‌కు ఒక రిజిస్ట్రేషన్ ఐడీ, పాస్వర్డ్ వస్తుంది.
- వాటితో మళ్లీ వెబ్సైట్లోకి లాగిన్ కావాలి.
- అప్లికేషన్ ఫారమ్‌లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి.
- అవసరమైన అన్ని పత్రాలు అప్లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు కూడా ఆన్లైన్లోనే చెల్లించాలి.
- అన్ని వివరాలు మరోసారి చెక్ చేసుకుని, అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
- భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు
- ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరణ ప్రారంభం : 2024 జులై 22
- ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 2024 ఆగస్టు 21