Interview Tips For Job Seekers : ప్రస్తుత పోటీ ప్రపంచంలో అర్హతకు తగిన ఉద్యోగం సంపాదించడం చాలా కష్టమైపోతోంది. వాస్తవానికి చాలా మంది రాత పరీక్షలో మంచి ప్రతిభ చూపించినప్పటికీ, ఇంటర్వ్యూలో తేలిపోతుంటారు. ఎంతో ప్రతిభ ఉన్న అభ్యర్థులు సైతం ఇంటర్వ్యూల్లో ఫెయిల్ అయిపోతుంటారు. దానికి ప్రధాన కారణం - ఇంటర్వ్యూల్లో చెప్పకూడని విషయాలు చెప్పడమే. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం.
పాత సంస్థ గురించి నెగెటివ్‌గా చెప్పొద్దు!
ఏ కంపెనీ అయినా తమ సంస్థ పట్ల మంచి నిబద్ధత కలిగి ఉన్న వ్యక్తిని ఉద్యోగిగా నియమించుకునేందుకు ఇష్టపడుతుంది. అలాగే తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులు మంచి నైపుణ్యం కలిగి ఉండాలని ఆశిస్తుంది. అందుకే ఇంటర్వ్యూకు వెళ్లేవారు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇంటర్వ్యూ చేసే వ్యక్తి మిమల్ని అంతకుముందు పనిచేసిన సంస్థ గురించి అడుగుతారు. అప్పుడు మీరు చాలా తెలివిగా సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. మీరు పనిచేసిన పాత సంస్థలో ఎదురైన సవాళ్లు, ఇబ్బందులు గురించి కూడా ప్రశ్నలు అడుగుతారు. అప్పుడు మీరు మీ పాత సంస్థ గురించి తప్పుగా చెప్పకూడదు.
పాత కంపెనీలో పని ఒత్తిడి ఉందా? అక్కడ ఆహ్లాదకరమైన పని వాతావరణం ఉందా? మీ పాత ఆఫీసులో ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? మొదలైన ప్రశ్నలు అడుగుతుంటారు. వాటికి మీరు తెలివిగా సమాధానం చెప్పండి. మీరు పనిచేసిన పాత సంస్థ గురించి నెగెటివ్‌గా చెప్పకుండా ఉండటం బెటర్. లేదంటే ఆ ప్రభావం మీ ప్రస్తుత ఇంటర్వ్యూపై పడే అవకాశం ఉంది. పాత కంపెనీని వదిలేయడానికి గల కారణాలను జాగ్రత్తగా చెప్పాలి. మంచి భవిష్యత్ కోసం, కెరీర్ గ్రోత్ కోసం ఉద్యోగం మారుతున్నానని చెప్పడం మంచిది.
వాటి గురించి ప్రస్తావించకపోవడమే బెటర్!
ఇంటర్వ్యూ టైమ్‌లో మీకు కావాల్సిన పెటర్నిటీ, మెటర్నిటీ లీవ్స్ గురించి చెప్పకపోవడమే బెటర్. అలాగే వైద్య అవసరాలు, వెకేషన్ ప్లాన్స్ గురించి కూడా చెప్పకూడదు. ఎందుకంటే గర్భిణీలకు చట్టప్రకారం మెటర్నిటీ లీవ్స్ ఇవ్వాలి. అప్పుడు లాంగ్ లీవ్ తీసుకుని ఉద్యోగి వెళ్లిపోతారని తెలిసి, కంపెనీలు ఉద్యోగిని రిక్రూట్ చేసుకునేందుకు ఇష్టపడవు. వేరే వాళ్ల వైపు మొగ్గు చూపిస్తాయి.
జీతం విషయంలో జాగ్రత్త!
మంచి ప్రతిభ ఉన్నంత మాత్రాన, స్థాయికి మించిన జీతాన్ని కోరకూడదు. అధిక అలవెన్స్‌లకు ఆశించకూడదు. జాబ్‌పై మీకు ఉన్న అభిరుచి (ప్యాషన్)ని, ఇష్టాన్ని తెలియజేయాలి. మీకొచ్చే జీతానికి మీరు ఎంతమేర న్యాయం చేయగలరో వివరించాలి. మీ నైపుణ్యాలు, ఉద్యోగం పట్ల మీకున్న ఆసక్తిని తెలియజేయాలి. అప్పుడే మీకు విజయం లభిస్తుంది. ఆల్ ది బెస్ట్!
AI ఎంత డెవలప్ అయినా ఈ స్కిల్ ఉంటే చాలు - జాబ్ గ్యారెంటీ! - Best Job Skills