Indian Coast Guard Recruitment 2024 : ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో పనిచేయాలని ఆశించే అభ్యర్థులకు గుడ్‌న్యూస్. ఇండియన్ కోస్ట్ గార్డ్ 260 నావిక్ (జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది. కోస్ట్‌గార్డ్ ఎన్రోల్డ్ పర్సనల్ టెస్ట్-2024 ద్వారా నావిక్ జనరల్ డ్యూటీ ఉద్యోగాల భర్తీకి అర్హులైన ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హత, వయోపరిమితి, ఎంపిక విధానం మొదలైన వివరాలు మీకోసం.
పోస్టు : నావిక్(జనరల్ డ్యూటీ)
- మొత్తం పోస్టుల సంఖ్య : 260
జోన్ల వారీగా ఖాళీలు
- నార్త్ జోన్-79
- వెస్ట్‌జోన్-66
- నార్త్ ఈస్ట్-68
- ఈస్ట్ జోన్-33
- నార్త్‌వెస్ట్ జోన్-12
- అండమాన్ నికోబార్-03
నావిక్ పోస్టులకు అర్హతలు
- 10+2లో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులలో ఉత్తీర్ణత చెంది ఉండాలి.
- నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయోపరిమితి : 18 నుంచి 22 ఏళ్ల వయసు గల అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే అభ్యర్థులు 01-09-2002 నుంచి 31-08-2006 మధ్య పుట్టిన వారై ఉండాలి.
జీతభత్యాలు : ప్రారంభ వేతనం నెలకు రూ.21,700
ఎంపిక ప్రక్రియ : కోస్ట్‌గార్డ్ నావిక్ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియలో స్టేజ్-1, స్టేజ్-2, స్టేజ్-3, స్టేజ్-4 టెస్ట్‌లు ఉంటాయి. మెడికల్ టెస్ట్‌లు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- దరఖాస్తు రుసుము : ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ ఫీజుగా రూ. 300 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది.
- అన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమయ్యే తేదీ : 13-02-2024
- ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 27-02-2024
ఈ అడ్మిట్‌కార్డ్ డౌన్లోడ్
- స్టేజ్-1 : 2024 ఏప్రిల్
- స్టేజ్-2 : 2024 మే
- స్టేజ్-3 : 2024 అక్టోబర్
ఏవిధంగా దరఖాస్తు చేసుకోవాలి? : అర్హత గల అభ్యర్థులు కోస్ట్‌గార్డ్ అఫీషియల్ వెబ్‌సైట్‌ను సందర్శించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
రైల్వేలో 900 ఉద్యోగాలు - రిక్రూట్మెంట్ షెడ్యూల్ ఇదే!
పట్నా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించి ఓ అధికారిక ప్రకటన ఇటీవలే విడుదల చేసింది. అందులో నియామక ప్రక్రియకు సంబంధించిన వివరాలను అందించింది. రైల్వే శాఖ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం 9000 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారని పట్నా ఆర్ఆర్బీ వెల్లడించింది. పూర్తి వార్తను చదివేందుకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో అగ్నివీర్ వాయు జాబ్స్‌కు నోటిఫికేషన్ రిలీజ్
భారత్ డైనమిక్స్‌లో 361 ఇంజినీరింగ్ పోస్టులు - పరీక్ష లేకుండానే జాబ్స్!