ETV Bharat / education-and-career

'పెద్ద జీతంతో ఉద్యోగం రావాలంటే - ఏఐ నైపుణ్యాలు పెంచుకోవాల్సిందే' - ఇన్ఫోసిస్​ సీటీఓ - AI Skills For IT Job - AI SKILLS FOR IT JOB

AI Skills For IT Job : ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI)​ నైపుణ్యాలు ఉన్నవారికి భవిష్యత్​లో భారీ జీతాలతో, మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఇన్ఫోసిస్​ సీటీఓ రఫీ తరఫ్​దార్​ పేర్కొన్నారు. ఇంకా ఆయన ఏం చెప్పారంటే?

Artificial Intelligence
AI Skills For IT Job (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 22, 2024, 10:41 AM IST

AI Skills For IT Job : ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్​ (AI)తో ఉద్యోగాలు పోతాయని కొందరు వాదిస్తుంటే, మరికొందరు మాత్రం ఇది కొత్త అవకాశాలు సృష్టిస్తుందని చెబుతున్నారు. ఏఐ నైపుణ్యాలు అందిపుచ్చుకుంటే, మంచి ఉద్యోగ అవకాశాలు, భారీ జీతాలు అందుకోవచ్చని సూచిస్తున్నారు. దిగ్గజ దేశీయ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్​ సీటీఓ రఫీ తరఫ్​దార్​ కూడా ఇదే విషయాన్ని నొక్కి చెబుతున్నారు.

కృత్రిమ మేధ (ఏఐ)ను సమర్థవంతంగా అర్థం చేసుకోగలిగిన వారి భవిష్యత్ చాలా బాగుంటుందని రఫీ తరఫ్​దార్ అభిప్రాయపడ్డారు. ప్రధానంగా ఉద్యోగ ప్రపంచంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధంగా ఉన్న యువ ఇంజినీర్లు ఏఐ టూల్స్​పై అవగాహన పెంచుకోవడం చాలా అవసరమని ఆయన సూచించారు.

ఏఐ స్కిల్స్ ఉండాల్సిందే!
ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న రఫీ తరఫ్​దార్, విద్యార్థులకు కొన్ని కీలకమైన సూచనలు చేశారు. ‘ప్రస్తుతం జాబ్​ వరల్డ్​ రెండు విభాగాలుగా ఉంది. ఒక విభాగంలో ఏఐ సృష్టికర్తలు ఉంటే, మరోదానిలో ఏఐ వినియోగదారులు ఉన్నారు. అందుకే దాదాపు అన్ని కంపెనీలు ఈ రెండు విభాగాల్లో ఉన్న సమర్థులైన అభ్యర్థుల కోసం ఎదురుచూస్తున్నాయని రఫీ తరఫ్​దార్​ తెలిపారు.

'సాఫ్ట్​వేర్ ఇంజినీరింగ్ బ్యాక్​గ్రౌండ్​ లేకుండా వచ్చేవాళ్లు ఏఐ టెక్నాలజీని సమర్థవంతంగా ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవాలి. అప్పుడే తమ ఏఐ స్కిల్స్​తో మరింత ఉత్పాదకతను పెంచగలుగుతారు. ఇంజినీరింగ్ బ్యాక్​గ్రౌండ్​ నుంచి వచ్చివారు ఏఐ సృష్టికర్తలుగా మారాలి. ఇందుకోసం తమ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు పెంచుకుంటా ఉండాలి. అప్పుడే కొత్త సాంకేతికతలను అభివృద్ధి చేయగలుగుతారు. కస్టమర్లకు కావాల్సిన సేవలు అందించగలుగుతారు' అని రఫీ తరఫ్​దార్ అన్నారు.

హైరింగ్ పద్ధతులు మారుతున్నాయి!
ఇన్ఫోసిస్​ ఏప్రిల్​ నెలలో తమ హైరింగ్ మోడల్​లో పలు మార్పులు చేసినట్లు ప్రకటించింది. ఏఐ స్కిల్స్ ఉన్న ఫ్రెషర్లను సగానికిపైగా క్యాంపస్​ వెలుపల నుంచే తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది. ఇదే విధానాన్ని ఇంకా చాలా కంపెనీలు అమలు చేస్తున్నాయి. మరికొన్ని అందుకు సిద్ధం అవుతున్నాయి.

ఇన్ఫోసిస్​, టీసీఎస్ లాంటి దిగ్గజ ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీపై ట్రైనింగ్ ఇస్తున్నాయి. ఇందుకోసం భారీగా డబ్బులు ఖర్చు పెడుతున్నాయి. ఇప్పటికే ఇన్ఫోసిస్​లోని 2,50,000 మంది ఉద్యోగులకు జెన్​ ఏఐ టెక్నాలజీపై శిక్షణ ఇచ్చారు. మరోవైపు మిగతా కంపెనీలు కూడా ఏఐ నైపుణ్యాలు కలిగిన వ్యక్తులనే ఎక్కువగా నియమించుకుంటున్నాయి.

AI ఎంత డెవలప్ అయినా ఈ స్కిల్ ఉంటే చాలు - జాబ్ గ్యారెంటీ! - Best Job Skills

'రెజ్యూమ్ ప్రిపేర్ చేస్తున్నారా? ఈ 3 తప్పులు అస్సలు చేయకండి' - గూగుల్ మాజీ రిక్రూటర్​ - Resume Writing Tips

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.