ETV Bharat / education-and-career

డిగ్రీ అర్హతతో IBPS ఆఫీసర్​, క్లర్క్ పోస్టుల భర్తీ - అప్లై చేసుకోండిలా! - IBPS Clerk Recruitment 2024

IBPS Clerk Recruitment 2024 : బ్యాంకింగ్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్​. ఐబీపీఎస్​ క్లర్క్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఎంపికైన వాళ్లు రీజినల్ రూరల్ బ్యాంక్స్​ (ఆర్​ఆర్​బీ)ల్లో పనిచేయాల్సి ఉంటుంది. విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాలు మీ కోసం.

RRB Clerk recruitment 2024
IBPS Recruitment 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 7, 2024, 2:49 PM IST

IBPS Clerk Recruitment 2024 : నిరుద్యోగ యువతకు శుభవార్త. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్సన‌ల్ సెల‌క్షన్ (IBPS) ఆఫీసర్​, క్లర్క్​ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిలో ఎంపికైన వారు రీజనల్‌ రూరల్‌ బ్యాంకు(ఆర్‌ఆర్‌బీ)ల్లో పని చేయాల్సి ఉంటుంది.

ఐబీపీఎస్​ జూన్​ 6న ఆర్​ఆర్​బీ కామ‌న్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌-XIII నోటిఫికేషన్​ను విడుద‌ల చేసింది. దీని ద్వారా దేశ‌వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ గ్రామీణ బ్యాంకుల్లోని ఆఫీస‌ర్(స్కేల్‌-1, 2, 3), ఆఫీస్ అసిస్టెంట్(మ‌ల్టీ ప‌ర్పస్‌)/ క్లర్క్ పోస్టులను భ‌ర్తీ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోనూ ఈ పోస్టులు ఉన్నాయి.

ఉద్యోగాల వివరాలు

  • ఆఫీసర్​ (స్కేల్‌- I, II, III)
  • ఆఫీస్‌ అసిస్టెంట్​ (మల్టీపర్పస్‌)/ క్లర్క్​

విద్యార్హతలు
పోస్టులను అనుసరించి అభ్యర్థులు బ్యాచిలర్స్‌ డిగ్రీ/ ఎంబీఏ/ సీఏ ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండి తీరాలి.

వ‌య‌స్సు

  • ఆఫీసర్ స్కేల్-3 (సీనియర్ మేనేజర్) పోస్టులకు అభ్యర్థుల వయస్సు 21 నుంచి 40 ఏళ్లు మధ్యలో ఉండాలి.
  • ఆఫీసర్ స్కేల్-2 (మేనేజర్) పోస్టులకు 21 నుంచి 32 ఏళ్లు ఉండాలి.
  • ఆఫీసర్ స్కేల్-1 (అసిస్టెంట్ మేనేజర్) పోస్టులకు 18 ఏళ్లు నుంచి 30 ఏళ్లు ఉండాలి.
  • ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) పోస్టులకు అభ్యర్థుల వయస్సు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం
అభ్యర్థులకు ముందుగా ఆన్​లైన్​లో ప్రిలిమినరీ ఎగ్జామ్ పెడతారు. ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులను మెయిన్ ఎగ్జామ్​కు సెలక్ట్ చేస్తారు. ఇందులోనూ క్వాలిఫై అయిన వారిని ఇంటర్వ్యూకు పిలుస్తారు. తరువాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ చేసి, అర్హులైన వారిని ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం

  • అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.
  • అధికారిక వెబ్‌సైట్‌: https://www.ibps.in/

ఖాళీలు భర్తీ కానున్న బ్యాంకులు ఇవే! ఠ
ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్, కర్ణాటక గ్రామీణ బ్యాంక్ మొదలైనవి.

ముఖ్యమైన తేదీలు

  • ఐబీపీఎస్​ దరఖాస్తు ప్రారంభం : 2024 జూన్ 7
  • దరఖాస్తుకు చివరి తేదీ : 2024 జూన్ 27
  • ప్రిలిమిన‌రీ పరీక్ష : 2024 ఆగస్టు 3, 4, 10, 17, 18 తేదీలు
  • మెయిన్స్​ పరీక్ష తేదీ : 2024 సెప్టెంబర్​ 29, 06 తేదీలు

గూగుల్ బంపర్ ఆఫర్​ - ఉచితంగా AI కోర్సులు - నేర్చుకుంటే జాబ్​ గ్యారెంటీ! - Google AI Courses For Free

ఫ్రీలాన్సర్​గా పని చేయాలా? ఈ టాప్​-10 వెబ్​సైట్స్​పై ఓ లుక్కేయండి! - Best Freelancing Sites

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.