IBPS Clerk Application Date Extended : బ్యాంకింగ్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఐబీపీఎస్ క్లర్క్ ఉద్యోగాల దరఖాస్తు గడువును జులై 28 వరకు పెంచారు. కనుక ఇప్పటి వరకు దరఖాస్తు చేయనివారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
భారీ రిక్రూట్మెంట్
ఐబీపీఎస్ దేశవ్యాప్తంగా ఉన్న 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న 6,128 క్లర్క్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకోసం 2025-26 సంవత్సరానికి సంబంధించి కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ CRP-XIV నిర్వహించనుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు గడువులోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
పోస్టుల వివరాలు
- మొత్తం పోస్టులు : 6128
- ఆంధ్రప్రదేశ్లోని పోస్టులు - 105
- తెలంగాణాలోని పోస్టులు - 104
విద్యార్హతలు
IBPS Clerk Education Qualification : అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.
వయోపరిమితి
IBPS Clerk Age Limit : అభ్యర్థుల వయస్సు 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్యలో ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, వివిధ కేటగిరీల అభ్యర్థులకు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు రుసుము
IBPS Clerk Application Fee :
- జనరల్, ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.850 చెల్లించాలి.
- ఎక్స్-సర్వీస్మెన్, దివ్యాంగులు, ఎస్టీ, ఎస్సీలు రూ.175 చెల్లించాలి.
దరఖాస్తు విధానం
IBPS Clerk Application Process :
- అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.
- అధికారిక వెబ్‌సైట్: https://www.ibps.in/
ఎంపిక విధానం
IBPS Clerk Selection Process : అభ్యర్థులకు ప్రిలిమినరీ, మెయిన్స్ రాత పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో వచ్చిన మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ చేసి, అర్హులను క్లర్క్ పోస్టులకు ఎంపిక చేస్తారు.
ఉద్యోగాలు కల్పిస్తున్న బ్యాంకులు : బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సిండికేట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర,
ముఖ్యమైన తేదీలు
- ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం : 2024 జులై 1
- ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2024 జులై 28
- ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ నిర్వహణ తేదీలు : 2024 ఆగస్టు 12 నుంచి 17 వరకు
- ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష తేదీలు : 2024 ఆగస్టు 24, 25, 31.
- ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల విడుదల : 2024 సెప్టెంబర్
- ఆన్‌లైన్ మెయిన్ పరీక్ష : 2024 అక్టోబర్ 13
పరీక్ష కేంద్రాలు
- తెలంగాణాలోని పరీక్ష కేంద్రాలు : హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్.
- ఆంధ్రప్రదేశ్లోని పరీక్ష కేంద్రాలు : విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కర్నూలు.