ETV Bharat / education-and-career

ఏజ్​ బార్ అవుతోందని భయంగా ఉందా? ఈ స్ట్రాటజీ పాటిస్తే - కోరుకున్న ఉద్యోగం గ్యారెంటీ! - Job Hunting Tips - JOB HUNTING TIPS

How To Search For Jobs Aligned With Age : జాబ్ సెర్చ్ అంటే ఆషామాషీ విషయం కాదు. ఉద్యోగ ఎంపికలో వయసు, అనుభవం అనేవి రెండు కీలకమైన ప్రమాణాలు. ఈ రెండు ప్రమాణాలకు తగిన విధంగా మనం ఉద్యోగ అన్వేషణ ప్రణాళికను చేసుకోవాల్సి ఉంటుంది. వీటిని పరిగణనలోకి తీసుకోకుండా ఇష్టానుసారంగా ఉద్యోగాలకు అప్లై చేస్తే ఫలితాలు వచ్చే అవకాశాలు తగ్గుతాయే కానీ పెరగవు.

How to get a job - 6 expert tips
job searching tips (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 15, 2024, 3:57 PM IST

How To Search For Jobs Aligned With Age : జాబ్ కోసం సెర్చ్ చేసే వారు చాలా అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రత్యేకించి మీ వయసు ఎంత? అనుభవం ఎన్నేళ్లు? అనేది దృష్టిలో ఉంచుకోవాలి. వీటిని పరిగణనలోకి తీసుకోకుండా ఉద్యోగాలకు ఎడాపెడా అప్లై చేస్తుంటే ఫలితాలు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. ఎందుకంటే చాలా కంపెనీలు వెలువరించే జాబ్ నోటిఫికేషన్లు ఫ్రెషర్స్‌ను రిక్రూట్ చేసుకోవడంపైనే ఫోకస్‌ పెట్టి ఉంటాయి. ఈ విషయాన్ని పట్టించుకోకుండా మనం అప్లై చేస్తే ఏం లాభముంటుంది? వయసు, అనుభవానికి తగిన జాబ్ రోల్ కోసం వెతకడానికి ముందు మన స్కిల్స్‌ను సానబెట్టుకోవాలి. మీరు కోరుకున్న ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాల్ని అందిపుచ్చుకోవాలి. సీనియారిటీ ఉన్నా, సరైన సాంకేతిక నైపుణ్యాలు, అవగాహనా పరిజ్ఞానం లేకుంటే ఉద్యోగ పోటీలో విజేతగా నిలవడం కష్టతరంగా మారుతుంది. తక్కువ హోదాలో, తక్కువ జీతంతో ఎక్కువ గంటల పాటు పనిచేసేందుకు యువ ఉద్యోగార్థులు రెడీగా ఉన్న ప్రస్తుత తరుణంలో సీనియారిటీ కలిగిన అభ్యర్థికి ఉద్యోగం దొరకాలంటే, వారికి పదునైనా ఉద్యోగ నైపుణ్యాలు ఉండాల్సిందే. అందుకే అభ్యర్థులు తమ వయసుకు అనుగుణమైన వ్యూహంతో ఉద్యోగానికి అప్లై చేయాలి.

20 నుంచి 30 ఏళ్ల మధ్యలో
సాధారణంగా చాలా మంది తమ కెరీర్‌ను 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్యలో ప్రారంభిస్తుంటారు. ఒకవేళ మీరు Gen Z లేదా లేట్ Gen Y అయినా వయస్సు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాలేజీ విద్య ముగిసిన తర్వాత ఏదైనా ఉద్యోగంలో చేరడం ఎంత ముఖ్యమో, ఆ ఉద్యోగానికి సంబంధించిన నైపుణ్యాలను పెంచుకోవడం అంతకంటే ఎక్కువ ముఖ్యం. ఒకవేళ నైపుణ్యాలను పెంచుకోకుండా పనిచేస్తూ కాలం వెళ్లదీసే వ్యక్తికి, తదుపరి కెరీర్‌లో ప్రాధాన్యం తగ్గుతూపోతుంది. కాలేజీ దశలో ఉండగానే రెజ్యూమ్ తయారు చేయడం, ఇంటర్వ్యూలకు హాజరుకావడం, కేస్ స్టడీ ప్రిపరేషన్ వంటివి నేర్చుకోవాలి. కాలేజీ లేదా యూనివర్సిటీలో ఉన్న క్యాంపస్ ప్లేస్‌మెంట్ విభాగాల సేవలను వాడుకోవాలి. తదుపరిగా Coursera, Udemy వంటి ప్లాట్‌ఫామ్‌ల ద్వారా సర్టిఫికెట్ కోర్సులను చేయొచ్చు. కమ్యూనికేషన్ స్కిల్స్ , టీమ్ వర్క్, లీడర్‌షిప్ వంటి అంశాలపై దృష్టి పెట్టాలి. కాలేజీ క్యాంపస్ దశ ముగిసిన తర్వాత ఉద్యోగ మేళాలకు హాజరుకావాలి.

30 నుంచి 50 ఏళ్ల మధ్యలో
ఉద్యోగ కెరీర్‌లోని అత్యంత కీలకమైన టైం అనేది 30 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య ఉంటుంది. మొదటి పదేళ్ల కాలంలో అందరూ ఉద్యోగ నైపుణ్యాలను నేర్చుకుంటారు. ఇక 30వ పడిలో ఆదాయం సంపాదించడంపై ఫోకస్ పెట్టొచ్చు. గత ఉద్యోగాల్లో ఉండగా సాధించిన విజయాల గురించి ఈ టైంలో పనిచేసే కంపెనీల్లో ప్రజెంటేషన్ ఇచ్చుకోవచ్చు. పాత కంపెనీలకు సంబంధించిన తోటి ఉద్యోగులు, మేనేజర్ల వివరాలను సేవ్ చేసి ఉంచుకోవాలి. మీ కెరీర్‌లో పెద్ద నెట్​వర్క్ నిర్మాణానికి ఈ కాంటాక్ట్స్ భవిష్యత్తులో ఉపయోగపడతాయి. ఫ్యూచర్‌లో కీలకమైన జాబ్ రోల్స్‌కు మీరు ఎంపిక కావడానికి లీడ్స్ ఈ కాంటాక్ట్స్ నుంచే మీకు దొరకొచ్చు. మీ కెరీర్‌ గ్రోత్‌లో ఉన్నట్టు కనిపించినా కొత్త స్కిల్స్ నేర్చుకునే విషయంలో నిర్లక్ష్యాన్ని చూపొద్దు. సరికొత్త అంశాలపై సర్టిఫికెట్ కోర్సులు చేయండి. మీ లింక్డ్‌ఇన్ ప్రొఫైల్‌ను అప్‌డేట్‌గా ఉంచుకోండి. ఇక 50 ఏళ్ల తర్వాతి కెరీర్‌లో మీ అనుభవం, విశ్వసనీయతలే పెట్టుబడిగా పనిచేస్తాయి. ఈ టైంలో మీరు మీ అనుభవానికి తగిన విధంగా సరికొత్త ఉద్యోగ పాత్ర కోసం అన్వేషణ చేయొచ్చు. మీ అనుభవం వల్ల కంపెనీ సేవలు లేదా ఉత్పత్తులకు వ్యాల్యూ యాడ్ అవుతుందని భావిస్తే తప్పకుండా మంచి అవకాశం లభిస్తుంది. అయితే అర్ధవంతమైన ప్రజెంటేషన్ చేయగలిగితే మీరు ఇలాంటి కీలక పాత్రను దక్కించుకోగలుగుతారు.

పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా? 'ఒత్తిడి'ని చిత్తు చేసి, విజయాన్ని చేకూర్చే గొప్ప మంత్రం ఇదే! - Stress Management Tips

ఎడ్యుకేషన్​ లోన్ కావాలా? బ్యాంక్​కు వెళ్లకుండానే ఆన్​లైన్​లోనే అప్లై చేసుకోండిలా! - Education Loan Online Apply Process

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.