HAL Apprenticeship Recruitment 2024 : ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. మహారాష్ట్ర నాసిక్‌లోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఎయిర్ క్రాఫ్ట్ డివిజన్ 324 అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి అభ్యర్థులు ఆగస్టు 31 తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఖాళీల వివరాలు :
ఐటీఐ అప్రెంటిస్: 324 ఖాళీలు
విభాగాలు : ఫిట్టర్ -138, టూల్ అండ్ డై మేకర్ -10, టర్నర్ - 20, మెషినిస్ట్ -17, ఎలక్ట్రీషియన్ -27, మోటార్ వెహికల్ మెకానిక్ -6, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ -8, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్ - 6, పెయింటర్ - 7, కార్పెంటర్ - 6, షీట్ మెటల్ వర్కర్ - 4, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ -50, వెల్డర్ -10, స్టెనోగ్రాఫర్ -3.
విద్యార్హతలు
HAL Apprentice Jobs Eligibility : సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి
HAL Apprentice Age Limit : జనరల్ కేటగిరి అభ్యర్థుల వయసు 27 సంవత్సరాలు ఉండాలి . అయితే ప్రభుత్వ నిబంధనలు అనుసరించి ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితి 30 సంవత్సరాలు; అదే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 32 వయోపరిమితి వరకు అప్లై చేసుకోవచ్చు.
ఎంపిక ప్రక్రియ
HAL Job Selection Process : అభ్యర్థులను పదోతరగతి, ఐటీఐ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
స్టైపెండ్
HAL Apprentice Stipend : అప్రెంటీస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు మొదటి సంవత్సరం నెలకు రూ.7700; రెండో సంవత్సరం నెలకు రూ.8,050 చొప్పున స్టైపెండ్ ఇస్తారు.
దరఖాస్తు రుసుము
HAL Application Fee : ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
ముఖ్యమైన తేదీలు
- ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం : 2024 ఆగస్టు 8
- దరఖాస్తు చివరి తేదీ : 2024 ఆగస్టు 31
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ తేదీలు : 2024 సెప్టెంబర్ రెండు/ మూడో వారం
- ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి : 2024 సెప్టెంబర్ నాలుగో వారం
- జాయినింగ్ తేదీ : 2024 అక్టోబర్ రెండో వారం
ITBPలో కానిస్టేబుల్ ఉద్యోగాలు - రూ.69వేల శాలరీ - అప్లై చేసుకోండిలా! - ITBP Jobs 2024
డిగ్రీ, డిప్లొమా అర్హతలతో - రైల్వే శాఖలో 1376 పారా మెడికల్ పోస్టులు - RRB Notification 2024