ETV Bharat / education-and-career

నిరుద్యోగులకు అలర్ట్​ ​ - ఘోస్ట్ జాబ్స్ విషయంలో జర జాగ్రత్త! - Ghost jobs explained - GHOST JOBS EXPLAINED

Ghost Jobs Explained : దేశంలో ఘోస్ట్ జాబ్ ట్రెండ్ బాగా పెరుగుతోంది. కొన్ని కార్పొరేట్ సంస్థలు, చోటా కంపెనీలు నిరుద్యోగులతో ఆడుకుంటున్నాయి. తమ దగ్గర ఖాళీలు లేకున్నా, ఉద్యోగ ప్రకటనలు ఇస్తూ అభ్యర్థుల విలువైన సమయాన్ని హరిస్తున్నాయి. అందుకే ఈ ఘోస్ట్​ జాబ్స్ విషయంలో నిరుద్యోగులు చాలా అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

What is Ghost job
Ghost jobs explained
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 25, 2024, 11:01 AM IST

Ghost Jobs Explained : ప్రస్తుతం జాబ్‌ మార్కెట్‌లో 'ఘోస్ట్ జాబ్స్​' ట్రెండ్‌ నడుస్తోంది. చాలా కంపెనీలు తమ దగ్గర ఎలాంటి ఖాళీలు లేకపోయినా, ఉద్యోగ ప్రకటనలు ఇస్తూ నిరుద్యోగులను మోసం చేస్తున్నాయి. వీటిని నమ్మి నిరుద్యోగులు తమ విలువైన సమయాన్ని, డబ్బును కోల్పోతున్నారు. ఇది ఎంతో ఆందోళన కలిగించే అంశం. కనుక ఉద్యోగాల కోసం ప్రయత్నించే అభ్యర్థులు చాలా అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

సాధారణంగా కంపెనీలు తమ సంస్థలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి ఉద్యోగ ప్రకటనలు జారీ చేస్తుంటాయి. పరీక్షలు నిర్వహించి, ఇంటర్వ్యూలు చేసి, సరైన అభ్యర్థులను ఆయా పోస్టుల కోసం ఎంపిక చేసుకుంటాయి. కానీ నేడు పలు కంపెనీలు తమ దగ్గర ఎలాంటి ఉద్యోగాలు లేకపోయినా, జాబ్​ ఓపెనింగ్స్​ను ప్రకటిస్తున్నాయి. అంతేకాదు అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించి, ఇంటర్వ్యూలు కూడా చేస్తున్నాయి. కానీ ఎవరికీ ఉద్యోగాలు కల్పించడం లేదు. అందుకే వీటిని ఘోస్ట్ జాబ్స్ (Ghost Jobs)గా పరిగణిస్తారని నిపుణులు చెబుతున్నారు.

ఇలాంటి ఘోస్ట్ జాబ్స్​ వలలో చిక్కుకున్న నిరుద్యోగులు నెలల తరబడి వేచిచూస్తూ, విలువైన సమయాన్ని, డబ్బును కోల్పోతున్నారు. చివరికి అవి ఘోస్ట్ జాబ్స్ అని తెలుసుకుని, ఏమి చేయాలో తెలియక తీవ్రమైన ఆవేదనకు గురువుతున్నారు. అందుకే ఈ తరహా ఘోస్ట్ జాబ్​ల విషయంలో నిరుద్యోగులు చాలా అప్రమత్తంగా ఉండాలి అని నిపుణులు సూచిస్తున్నారు.

ఏమిటీ విపరీత ధోరణి!
మౌరీన్ క్లాఫ్ అనే ఓ మహిళ సోషల్‌మీడియా యాప్‌ ‘థ్రెడ్‌’ (Thread) లో ఈ ఘోస్ట్ జాబ్స్ గురించి వివరంగా తెలియజేశారు. నేను పనిచేస్తున్న కంపెనీలోని హెచ్‌ఆర్‌ సిబ్బంది ఉద్యోగాల భర్తీ కోసం అభ్యర్థులను ఇంటర్వ్యూ చేయాలని నన్ను కోరారు. కానీ వాస్తవానికి కంపెనీలో ఎలాంటి ఖాళీలు లేవు. ఇక్కడ జరుగుతున్న మోసం ఏమిటంటే, ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చంటూ కంపెనీలు వెబ్‌సైట్లో ప్రకటనలు జారీ చేస్తాయి. కానీ వాటిని భర్తీ చేయకుండా, నిరుద్యోగులను మోసం చేస్తుంటాయి. మా కంపెనీ కూడా ఇలాంటి తప్పుడు ప్రకటనలు చేసి అభ్యర్థులను ఇంటర్వ్యూ చేయమని నాకు చెప్పింది. కానీ నేను దానికి అంగీకరించలేదు' అని మౌరీన్ క్లాఫ్​ తన థ్రెడ్ ఖాతాలో వివరంగా రాశారు. దీనితో ఈ ఘోస్ట్​ జాబ్స్ విషయం అందరికీ తెలిసి, పెద్ద చర్చనీయాంశంగా మారింది.

అసలు ఎందుకిలా చేస్తారు?
ఉనికిలో లేని ఉద్యోగాలు ఉన్నాయంటూ ప్రకటనలు ఇచ్చే కంపెనీలు చాలానే ఉన్నాయి. అయితే ఇలా ఉద్యోగ ప్రకటనలు ఇవ్వడానికి భిన్నమైన కారణాలు ఉంటాయని పలువురు మార్కెట్‌ రంగ నిపుణులు చెబుతున్నారు. ప్రతిభావంతులైన అభ్యర్థుల్ని ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు, కొన్ని కంపెనీలు ఇలా చేస్తుంటాయని అంటున్నారు. భవిష్యత్తులో అవసరమయ్యే జాబ్​ పొజిషన్స్​ భర్తీ కోసం కూడా ఒక్కోసారి కంపెనీలు ఇలా ఘోస్ట్ జాబ్స్​ గురించి ప్రకటనలు విడుదల చేస్తుంటాయని పేర్కొంటున్నారు.

ఘోస్ట్ జాబ్స్​ను ఎలా గుర్తించాలి?
సాధారణంగా ఉద్యోగ ప్రకటనల్లో, అభ్యర్థుల అర్హతలు గురించి తెలియజేస్తారు. అలాగే ఉద్యోగుల విధులు, బాధ్యతల గురించి కచ్చితమైన సమాచారాన్ని ఇస్తారు. కానీ ఘోస్ట్‌ జాబ్స్‌ విషయంలో అలాంటి వాటి గురించి పెద్దగా సమాచారం ఉండదు. నెలలు గడిచినా కంపెనీల నుంచి ఎలాంటి స్పందన రాదు. దీనిని బట్టి మీరు వాటిని ఘోస్ట్ జాబ్స్​గా అర్థం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఒక సంస్థ ఉద్యోగ ప్రకటన చేసి, చాలా కాలం అయినప్పటికీ దానిని జాబ్​ పోర్టల్​ నుంచి తీసివేయలేదంటే, దానిని కూడా ఘోస్ట్ జాబ్​గా గుర్తించాలని అంటున్నారు.

ఇస్రో బంపర్​ ఆఫర్​ - ఇంటర్న్​షిప్​ & ప్రాజెక్ట్ ట్రైనీ స్కీమ్స్​ ప్రకటన - అప్లై చేసుకోండిలా! - ISRO Internship 2024

మాక్ ఇంటర్వ్యూలకు ఎటెండ్​ కావాలా? ఈ టాప్​-4 ఫ్రీ వెబ్​సైట్స్​పై ఓ లుక్కేయండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.