ETV Bharat / education-and-career

"సాలరీ ఎంత ఎక్స్​పెక్ట్​ చేస్తున్నారు?" - ఈ ప్రశ్నకు ఎలా ఆన్సర్​ ఇవ్వాలో - ఎక్కువ జీతం ఎలా పొందాలో మీకు తెలుసా? - Best Tips For Salary Negotiations - BEST TIPS FOR SALARY NEGOTIATIONS

Best Tips For Salary Negotiations : ప్రైవేటు రంగంలో ఉద్యోగం ఏదైనా సరే "ఇంటర్వ్యూ" తప్పకుండా ఉంటుంది. ఇంటర్వ్యూలో మీ టాలెంట్​ పరీక్షించిన తర్వాత అడిగే ఆఖరి ప్రశ్న "సాలరీ ఎంత ఎక్స్​పెక్ట్​ చేస్తున్నారు?". దీనికి చాలా మంది సరైన ఆన్సర్​ చేయలేరు. ఫలితంగా.. తక్కువ జీతంతో జాబ్​లో చేరి బాధపడేవారు కొందరైతే.. ఎక్కువ వేతనం అడిగి జాబ్​ కోల్పోయేవారు మరికొందరు. మరి.. ఇంతకీ సరైన ఆన్సర్​ ఎలా ఇవ్వాలి?

Smart Ways To Handle Salary Negotiations
Best Tips For Salary Negotiations (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 29, 2024, 4:40 PM IST

Smart Ways To Handle Salary Negotiations : ఏ చిన్న జాబ్​కైనా సరే ముందుగా అభ్యర్థుల స్కిల్స్ టెస్ట్​ చేసి, ఆ తర్వాత సాలరీ మేటర్ డిస్కస్ చేస్తారు. అయితే.. ఇక్కడ ఎంత వేతనం ఇస్తారో కంపెనీ ప్రతినిధులు చెప్పరు. ఎంత కావాలో చెప్పమని అభ్యర్థినే అడుగుతారు. చాలా మందికి ఈ ప్రశ్న ఒక సవాల్. ఎందుకంటే.. ఒకవేళ ఎక్కువ జీతం అడిగితే కంపెనీలు వేరే వ్యక్తులను పరిశీలించే ఛాన్స్ ఉంటుంది. అదే.. తక్కువ శాలరీ అడిగితే, మన సామర్థ్యాల్ని మనమే తక్కువ చేసుకున్నట్టు అవుతుంది. ఆ తర్వాత బాధపడాల్సి వస్తుంది. అందుకే.. సరైన ఆన్సర్ చెప్పడం చాలా ముఖ్యం. మరి.. ఇందుకోసం ఎలాంటి టిప్స్ పాటించాలో ఇప్పుడు చూద్దాం.

సెర్చ్ చేయండి : ఇంటర్వ్యూకి వెళ్లే ముందు మీ స్కిల్స్​ విషయంలో ఎలా ప్రిపేర్ అవుతారో.. శాలరీ ఎంత అడగాలి? అనే విషయంలోనూ అలాగే ప్రిపేర్ కావాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకోసం.. మీరు చేయాల్సిన మొదటిపని ఇంటర్నెట్ సెర్చ్. ఆన్​లైన్​లో ఎన్నో రకాల జాబ్ పోర్టల్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో.. మీ జాబ్ ప్రొఫైల్​లో ఉన్నవారికి ఎంత శాలరీ వస్తోందనే విషయాన్ని సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు. మీ అనుభవం, విద్యార్హతలు, నైపుణ్యాలు వంటి అంశాల ఆధారంగా.. సోషల్ మీడియాతో పాటు వివిధ జాబ్ ఆఫరింగ్ సైట్లు రీసెర్చ్ చేయడం ద్వారా మీ జీతంపై ఒక అవగాహన వస్తుందంటున్నారు నిపుణులు.

వారితో కనెక్ట్ అవ్వాలి : మీరు చేరాలనుకుంటున్న కంపెనీలో ఇప్పటికే పనిచేస్తున్న వారితో కచ్చితంగా కనెక్ట్ అవ్వాలి. ఆ కంపెనీలో మీ ప్రొఫైల్​ ఉన్నవారికి జీతాలు ఏవిధంగా ఇస్తున్నారో అడిగి తెలుసుకోవాలి. ప్రస్తుత పరిస్థితిలో ఎంత మొత్తం శాలరీ కోట్ చేయొచ్చనేది ముందే అడిగి తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వేరే సంస్థల్లో పనిచేస్తున్న వారు ఎవరైనా తెలిస్తే.. వారిని కూడా సంప్రదించాలని చెబుతున్నారు.

ముందే నిర్ణయించుకోండి : పైన చెప్పిన వివరాల ఆధారంగా ఒక నిర్ణయానికి వచ్చేసి.. జీతం ఎంత అడగాలి అనేది ముందే డిసైడ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇంటర్వ్యూ చేసే వారు అడగ్గానే తడుముకోకుండా చెప్పేసేలా ఉండాలి. మీ కాన్ఫిడెన్స్ చూస్తే.. అడిగినంత ఇవ్వొచ్చు అనేలా ఉండాలి తప్ప.. మాట తడబడొద్దని సూచిస్తున్నారు. ఒకవేళ సరైన ఫిగర్ చెప్పలేకపోతే "ఇంత రేంజ్​లో శాలరీ ఆశిస్తున్నాను" అని చెప్పాలి. అలా చెప్పడం వల్ల రిక్రూటర్‌కి ఒక ఛాన్స్ ఇచ్చినట్లు అవుతుంది. ఫలితంగా రేంజ్‌లోనే శాలరీ పొందే వీలు కలుగుతుందంటున్నారు నిపుణులు.

Job Skills: జాబ్ కొట్టాలంటే.. ఇవి ఉండాల్సిందే..!

శాలరీపై వివరణకు సిద్ధంగా ఉండాలి : "కంపెనీ మీకు ఇంత శాలరీ ఎందుకు ఇవ్వాలి?" అని ఇంటర్వ్యూ చేసేవాళ్లు అడగొచ్చు. ఈ ప్రశ్నకు తడబడకుండా సమాధానం చెప్పేందుకు ముందే ప్రిపేర్​గా ఉండాలి. ఇందుకోసం మీ ప్రత్యేకతలను చెప్పాలి. మీరు ఫ్రెషర్ అయితే.. మీ ఎడ్యుకేషనల్ విజయాలు చెప్పాలి. పని విషయంలో మీ నిబద్ధత ఎలా ఉంటుందో వివరించాలి. సీనియర్ అయితే.. గత సంస్థలో, మీ కెరీర్‌లో సాధించిన విజయాలను వివరించే ప్రయత్నం చేయాలి. పని చేయడంలో మీ నైపుణ్యాలు ఏంటో చెప్పాలి. వర్క్​లో మీ సిన్సియారిటీని అర్థం చేయాలి. తద్వారా.. కంపెనీకి మీరొక అసెట్‌గా పనికొస్తారనే భావన వారికి కలిగించాలి.

లాంగ్‌టర్మ్ అసోసియేషన్ : పైన చెప్పిన విషయాలతోపాటు మరో విషయం అర్థం చేయించాలి. అదే.. కంపెనీతో అనుబంధం. ఒక వ్యక్తిని తీసుకుంటే అతను లాంగ్​ టర్మ్​ సంస్థతో ఉండాలని ప్రతినిధులు కోరుకుంటారు. మీరు అలాంటి వారే అనే ఉద్దేశం వారికి కలిగించాలి. ఈ కంపెనీలోనే దీర్ఘకాలం పాటు పనిచేస్తానని చెప్పే ప్రయత్నం చేయాలి. అలాంటి కమిట్‌మెంట్‌తో పనిచేయగలమనే భరోసా కల్పించాలి.

ఇంటర్వ్యూకి వెళ్లేముందు ఈ అంశాలపై కచ్చితంగా హోం వర్క్ చేయాలి. మీ సబ్జెక్ట్​ స్కిల్స్​తోపాటు పై విషయాలను తడబడకుండా మేనేజ్ చేస్తే.. తప్పకుండా బెటర్​ సాలరీ అందుకునే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సో.. చూశారు కదా! మీరు గానీ ఇంటర్వ్యూకు వెళ్లాల్సి వస్తే.. తప్పకుండా ఇవి పాటించండి. కోరుకున్నంత సాలరీ ఒడిసి పట్టండి.

పదే పదే ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతున్నారా? ఈ టిప్స్ పాటిస్తే జాబ్​ గ్యారెంటీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.