ETV Bharat / education-and-career

పార్ట్ టైమ్ జాబ్​ చేయాలా? ఈ టాప్​-10 ఆప్షన్స్​పై ఓ లుక్కేయండి! - Best Part Time Jobs In India 2024

Best Part Time Jobs In India : మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారా? జాబ్స్​ కోసం ప్రిపేర్ అవుతూనే పార్ట్​ టైమ్ జాబ్ కూడా​ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న టాప్​-10 పార్ట్​ టైమ్​ జాబ్స్ గురించి తెలుసుకుందాం రండి.

Top 10 Part Time Jobs In India 2024
Best part time jobs in india
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 9, 2024, 10:40 AM IST

Best Part Time Jobs In India : విదేశీ యువతీ యువకులు చాలా మంది చదువుకుంటూనే పార్ట్​ టైమ్ జాబ్స్ కూడా చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులపై ఆధారపడకుండా, తమ స్వశక్తితో డబ్బు సంపాదించుకుంటారు. తమ జీవితం ఎలా ఉండాలో కూడా వారే నిర్ణయించుకుంటారు. కానీ మన దేశంలో పరిస్థితి వేరుగా ఉంటుంది. తల్లిదండ్రులు చదివిస్తూ ఉంటారు. చదువు పూర్తి అయిన తరువాత కోచింగ్​ కూడా వారే ఇప్పిస్తూ ఉంటారు. ఇలా ఉద్యోగం వచ్చే వరకు కుటుంబ సభ్యులే మన ఆర్థిక అవసరాలను తీరుస్తుంటారు. కానీ ఇది సరైన పద్ధతి కాదు. చిన్నతనం నుంచే డిగ్నిటీ ఆఫ్ లేబర్​ను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే ప్రతి ఒక్కరూ తమ స్వశక్తితో పైకి ఎదుగుతారు. మరి మీరు కూడా ఇలానే ఆలోచిస్తున్నారా? అయితే ఇది మీ కోసమే.

మీరు చదువుకుంటున్నా లేదా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఫర్వాలేదు. పార్ట్ టైమ్ జాబ్​ చేస్తూ, మీ ఖర్చులకు సరిపోయే డబ్బులు సంపాదించవచ్చు. అందుకే ఈ ఆర్టికల్​లో మంచి డిమాండ్ ఉన్న టాప్​-10 పార్ట్​ టైమ్ జాబ్స్ గురించి తెలుసుకుందాం.

  1. బ్లాగింగ్​ : నేడు చాలా మంది యువతీ యువకులు బ్లాగింగ్ చేస్తూ భారీగా డబ్బులు సంపాదిస్తున్నారు. మీకు ఇష్టమైన, మంచి నైపుణ్యం ఉన్న రంగానికి సంబంధించిన కంటెంట్​ను బ్లాగ్​ల్లో పోస్ట్ చేయవచ్చు. దీనికి గూగుల్ యాడ్​సెన్స్​ అప్రూవల్ వస్తే చాలు. మీరు బోలెడంత డబ్బులు సంపాదించవచ్చు.
  2. అఫిలియేటింగ్ మార్కెటింగ్​ : ప్రస్తుతం అఫిలియేటింగ్ మార్కెటింగ్​కు మంచి డిమాండ్ ఉంది. అమెజాన్​, ఫ్లిప్​కార్ట్​, మింత్రా లాంటి సైట్లలో అఫిలియేషన్ తీసుకుని, మీరే స్వయంగా ప్రొడక్టులను ప్రమోట్​ చేసి, భారీగా డబ్బులు సంపాదించవచ్చు.
  3. కంటెంట్ రైటింగ్​ : నేడు మార్కెట్లో కంటెంట్​ రైటర్లకు మంచి డిమాండ్ ఉంది. ఆర్టికల్స్​, బ్లాగ్స్​, కమర్షియల్స్, సోషల్ మీడియా అడ్వైర్టైజింగ్​, మార్కెటింగ్, కాపీ రైటింగ్​ల కోసం పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించి కంటెంట్ రైటర్లను హైర్ చేసుకుంటున్నారు. మీకు కనుక స్పెషల్ రైటింగ్ స్కిల్స్ ఉంటే, ఇక తిరుగుండదు.
  4. ఆన్​లైన్/ ఆఫ్​లైన్ ట్యూటరింగ్ : మీకు బోధనారంగంపై ఆసక్తి ఉంటే ఆన్​లైన్​, ఆఫ్​లైన్ విధానాల్లో పాఠాలు బోధించవచ్చు. ఇందు కోసం నేడు చాలా ప్లాట్​ఫామ్​లు అందుబాటులో ఉన్నాయి. స్కైప్​, జూమ్​, గూగుల్ మీట్ లాంటి యాప్స్ ద్వారా మీరు లైవ్​లో పాఠాలు చెప్పవచ్చు. లేదా మీరే స్వయంగా ఒక యాప్​ లేదా వెబ్​సైట్​ క్రియేట్ చేసుకుని, పాఠాల వీడియోలను షూట్ చేసి, అందులో పెట్టవచ్చు. సబ్​స్క్రిప్షన్ తీసుకునే వారి నుంచి డబ్బులు వసూలు చేయవచ్చు. అలాకాకుంటే నేరుగా హోమ్ ట్యూషన్లు చెప్పి, డబ్బులు సంపాదించవచ్చు.
  5. వర్చువల్ అసిస్టెంట్​ : ప్రస్తుతం చాలా కంపెనీలు వర్చువల్ అసిస్టెంట్​లను నియమించుకుంటున్నాయి. వర్చువల్ అసిస్టెంట్​లు ప్రధానంగా సోషల్ మీడియా అకౌంట్లు నిర్వహించడం, అపాయింట్​మెంట్లు, అరేంజ్​మెంట్లు చేయడం లాంటి పనులు చేస్తారు.
  6. ఆన్​లైన్ మీడియా ఎడిటర్​ : నేడు ఆన్​లైన్ న్యూస్ పేపర్లు, బ్లాగ్​లు విపరీతంగా పెరిగిపోయాయి. వాటినిలోని ఆర్టికల్స్​ను ఎడిట్ చేయడానికి, తప్పు, ఒప్పులు సరిదిద్దడానికి, ప్రచురణ యోగ్యం చేయడానికి ఎడిటర్​లను నియమించుకుంటూ ఉంటారు. ఆసక్తి ఉన్న వాళ్లు ఈ ఆన్​లైన్ మీడియా ఎడిటర్ జాబ్ చేస్తూ డబ్బులు సంపాదించవచ్చు.
  7. వీడియో ఎడిటర్ : ప్రస్తుతం సోషల్​ మీడియా హవా నడుస్తోంది. కనుక ఫొటో, వీడియో ఎడిటర్లకు మంచి డిమాండ్ ఉంటోంది. వ్లాగర్స్​, డాక్యుమెంటరీ, ఫిల్మ్​ మేకర్స్​, మార్కెటింగ్ ఆర్గనైజేషన్స్​, ఏజెన్సీస్​ వీడియో ఎడిటర్లను నియమించుకుంటున్నాయి. ఈ రంగంలో పనిచేసేవారికి భారీ ఎత్తున సంపాదన ఉంటుంది.
  8. యాప్​ డెవలపర్ : కోడింగ్ స్కిల్స్ ఉన్నవారు యాప్​ డెవలపర్​గా రాణించవచ్చు. స్మార్ట్​ఫోన్ నిత్యజీవితంలో భాగం అయిపోయిన దగ్గర నుంచి యాప్స్​కు వివరీతంగా డిమాండ్ పెరిగిపోయింది.
  9. హోమ్-ఫుడ్ డెలివరీ : నేటి కాలంలో ఫుడ్ బిజినెస్ మంచి భూమ్​లో ఉంది. మంచి హెల్దీ, టేస్టీ ఫుడ్​ అందించే వారికి ఇక తిరుగుండదు. మీకు కనుక మంచి కుకింగ్ స్కిల్స్ ఉంటే చాలు. బోలెడు డబ్బులు సంపాదించవచ్చు.
  10. చైల్డ్ డేకేర్​ : ధనవంతులు, ఉద్యోగాలు చేసుకునేవారు తమ పిల్లల ఆలనా, పాలనా చూసుకునేందుకు ఆయాలను నియమించుకుంటూ ఉంటారు. అలా వీలుకానివారు, డేకేర్ సెంటర్లకు తమ పిల్లలను పంపుతూ ఉంటారు. కనుక మీరు కూడా చైల్డ్ డేకేర్ సెంటర్లను నిర్వహిస్తూ, మంచిగా డబ్బులు సంపాదించవచ్చు.

ఆన్​లైన్ ఇంటర్వ్యూకు సిద్ధమవుతున్నారా? ఈ 6-టిప్స్ పాటిస్తే జాబ్​ రావడం గ్యారెంటీ!

క్రియేటివ్ జాబ్స్ చేయాలా? డబ్బులు కూడా బాగా సంపాదించాలా? ఈ టాప్​-5 కెరీర్​ ఆప్షన్స్​పై ఓ లుక్కేయండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.