ETV Bharat / education-and-career

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 600 పోస్టులు - పరీక్ష లేకుండానే జాబ్​​ - దరఖాస్తు చేసుకోండిలా! - BOM RECRUITMENT 2024

డిగ్రీ, డిప్లొమా అర్హతతో - BoMలో 600 అప్రెంటీస్​ పోస్టులు - స్టైపెండ్ ఎంతంటే?

Bank of Maharashtra
Bank of Maharashtra (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 14, 2024, 1:58 PM IST

Bank of Maharashtra Recruitment 2024 : బ్యాంకు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్​. పుణె ప్రధాన కేంద్రంగా గల బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 600 అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అక్టోబర్‌ 24వ తేదీలోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

పోస్టుల వివరాలు

  • యూఆర్​ - 305 పోస్టులు
  • ఓబీసీ - 131 పోస్టులు
  • ఈడబ్ల్యూఎస్​ - 51 పోస్టులు
  • ఎస్టీ - 48 పోస్టులు
  • ఎస్సీ - 65 పోస్టులు
  • మొత్తం పోస్టులు - 600

రాష్ట్రాల వారీగా పోస్టుల వివరాలు : ఆంధ్రప్రదేశ్‌లోని బ్యాంకు శాఖల్లో 11, తెలంగాణలోని బ్యాంకు శాఖల్లో 16 పోస్టులు ఉన్నాయి.

విద్యార్హతలు : అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా విద్యాసంస్థ నుంచి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి :

  • అభ్యర్థుల వయస్సు 2024 జూన్​ 30 నాటికి 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్యలో ఉండాలి.
  • ఓబీసీలకు 3 ఏళ్లు; దివ్యాంగులకు 10-15 ఏళ్లు; ఎస్టీ, ఎస్సీలకు 5 ఏళ్ల వరకు వయోపరిమితి సడలింపు ఉంటుంది.

దరఖాస్తు రుసుము :

  • యూఆర్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.150 + జీఎస్‌టీ చెల్లించాలి.
  • ఎస్టీ, ఎస్సీలు దరఖాస్తు రుసుముగా రూ.100 + జీఎస్‌టీ చెల్లించాలి.
  • దివ్యాంగులకు పరీక్ష ఫీజు నుంచి పూర్తి మినహాయింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ : 12వ తరగతి (హెచ్‌ఎస్‌సీ/ 10+2)/ డిప్లొమా మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్​లిస్ట్ చేస్తారు. తరువాత సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి అర్హులను అప్రెంటీస్ పోస్టులకు ఎంపిక చేస్తారు.

శిక్షణ వ్యవధి : బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అప్రెంటీస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఏడాది పాటు శిక్షణ ఉంటుంది.

స్టైపెండ్ : శిక్షణ కాలంలో అప్రెంటీస్​లకు నెలకు రూ.9000 స్టైపెండ్ అందిస్తారు.

దరఖాస్తు విధానం

  • అభ్యర్థులు ముందుగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అధికారిక వెబ్​సైట్ ఓపెన్ చేయాలి.
  • కెరీర్స్ సెక్షన్​లోకి వెళ్లి అప్రెంటీస్​ రిక్రూట్​మెంట్​ లింక్​పై​ క్లిక్​ చేయాలి.
  • దరఖాస్తు ఫారమ్​లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి.
  • అవసరమైన అన్ని డ్యాకుమెంట్లు సహా, మీ ఫొటో, సిగ్నేచర్​లను అప్లోడ్ చేయాలి.
  • అప్లికేషన్ ఫీజు కూడా ఆన్​లైన్​లోనే చెల్లించాలి.
  • అన్ని వివరాలు మరోసారి చెక్ చేసుకుని, అప్లికేషన్​ను సబ్మిట్ చేయాలి.
  • భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్​అవుట్​ను భద్రపరుచుకోవాలి.

ముఖ్యమైన తేదీలు

  • ఆన్‌లైన్ దరఖాస్తుకు ప్రారంభ తేదీ : 2024 అక్టోబర్​ 14
  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 2024 అక్టోబర్​ 24

ముఖ్యాంశాలు :

  • 600 అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
  • అర్హులైన అభ్యర్థులు అక్టోబర్‌ 24వ తేదీలోగా ఆన్‌లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.