ETV Bharat / business

ఎక్స్​ వేదికగా జొమాటో ట్వీట్​ - కామెంట్లతో మోత మోగిస్తున్న కస్టమర్లు! - Zomato Tweet Viral - ZOMATO TWEET VIRAL

Zomato Latest Tweet : ప్రముఖ ఫుడ్‌ డెలివరీ ఫ్లాట్‌ఫామ్‌ జొమాటో ఎక్స్‌(ట్విట్టర్​) వేదికగా ఓ ట్వీట్‌ చేసింది. అయితే ఆ ట్వీట్​పై కస్టమర్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం

Zomato Tweet
Zomato Latest Tweet (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 3, 2024, 4:25 PM IST

Zomato Request to The Customers: ప్రస్తుతం ఆన్​లైన్​లో ఫుడ్ ఆర్డర్స్​ పెట్టుకునే వారి సంఖ్య క్రమ క్రమంగా పెరుగుతోంది. వంట చేసుకోవడానికి టైమ్‌ లేక కొందరు.. నచ్చిన ఆహార పదార్థాలను తిన్నాలన్నా కోరికతో మరికొందరు.. ఇలా పలు కారణాలతో చాలా మంది నిమిషాల్లో ఆర్డర్​ ప్లేస్​ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే డెలివరీ బాయ్స్​ కూడా ఫుడ్​ను డెలివరీ చేస్తున్నారు. నగరాల్లో ఈ యాప్‌లకు ఫుల్‌ డిమాండ్‌ ఉంది. ఈ క్రమంలోనే ఫుడ్​ డెలివరీ బాయ్స్​ పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా జొమాటో తమ కస్టమర్లను రిక్వెస్ట్​ చేస్తూ ఓ ట్వీట్​ చేసింది. అయితే ప్రస్తుతం ఆ ట్వీట్​పై నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్​ అవుతున్నారు. ఇంతకీ ఏమని ట్వీట్​ చేసిందో ఈ స్టోరీలో చూద్దాం..

దేశవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. పెరిగిన ఉష్ణోగ్రతలు, ఉక్కపోత వంటి కారణంగా చాలా మంది అల్లాడుతున్నారు. అయితే దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నా.. మరికొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ ఫుడ్​ డెలివరీ ప్లాట్​పామ్​ జొమాటో తమ డెలివరీ బాయ్స్​ పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా ఓ ట్వీట్​ చేసింది.

"తప్పనిసరిగా అవసరమైతే తప్పా మధ్యాహ్న సమయాల్లో ఫుడ్​ ఆర్డర్​ పెట్టుకోవద్దు.. ప్లీజ్​" అని రిక్వెస్ట్​ చేస్తూ ఎక్స్​(ట్విట్టర్​) వేదికగా జొమాటో ట్వీట్ చేసింది. మధ్యాహ్నం టైమ్‌లో ఎండవేడి ఎక్కువగా ఉంటోంది. దీనివల్ల ఫుడ్‌ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు బైక్‌పై తిరగడం కష్టం అవుతోంది. ఫుడ్‌ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు ఎండవేడిని తట్టుకోలేకపోతున్నారు. ఈ కారణంగానే జొమాటో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

How to Get Zomato Gold Membership : జొమాటో గోల్డ్ మెంబర్​షిప్ ఉచితం.. ఎలా పొందాలో తెలుసా?

జొమాటో చేసిన ట్వీట్‌కు నెటిజన్‌ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. కొంతమంది కస్టమర్‌లు "లంచ్‌ టైమ్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేయకుండా ఉండలేము" అని కామెంట్‌ చేయగా, మరికొంతమంది "ఇలా అయితే, మేము ఇతర ఫుడ్‌ డెలివరీ ఫ్లాట్‌ఫామ్‌ల నుంచి ఆర్డర్‌ చేసుకుంటాం" అని సరదగా కామెంట్​ చేస్తున్నారు. ఇంకొంతమంది "ఇంట్లో ఒంటరిగా ఉన్నవారు, వృద్ధుల పరిస్థితి ఏంటని" కామెంట్​ చేస్తున్నారు.

జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసే వాళ్లకు - షాక్ ఇచ్చిన యాజమాన్యం! - Zomato Increased Platform Fee

జొమాటోకు బిగ్​ షాక్​ - పన్ను, పెనాల్టీ కలిపి రూ.184 కోట్లు చెల్లించాలని ఐటీ నోటీస్​! - Zomato Gets Rs184 Cr IT Notice

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.