ETV Bharat / business

రహస్యంగా వివాహం చేసుకున్న జొమాటో సీఈఓ - పెళ్లి కూతురు ఎవరంటే? - Zomato CEO Deepinder Goyal marriage - ZOMATO CEO DEEPINDER GOYAL MARRIAGE

Zomato CEO Deepinder Goyal Marriage : జొమాటో సీఈఓ దీపిందర్​ గోయల్, మెక్సికన్ మోడల్​, పారిశ్రామికవేత్త గ్రేసియా మునోజ్​ను వివాహం చేసుకున్నారని సమాచారం. నెల రోజుల క్రితమే ఈ పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. దీపీందర్ గతంలో కంచన్​ జోషిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే!

Mexican model and entrepreneur Grecia Munoz
Zomato CEO Deepinder Goyal Marriage
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 22, 2024, 1:44 PM IST

Updated : Mar 22, 2024, 1:52 PM IST

Zomato CEO Deepinder Goyal Marriage : ప్రముఖ ఫుడ్​ డెలివరీ యాప్‌ జొమాటో సీఈఓ దీపిందర్, మెక్సికోకు చెందిన మోడల్​, పారిశ్రామికవేత్త అయిన గ్రేసియా మునోజ్​ను వివాహం చేసుకున్నారు. ఆయనకు ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం.

రహస్యంగా పెళ్లి!
దీపిందర్​ ఐఐటీలో చదివే రోజుల్లోనే కంచన్ జోషిని వివాహం చేసుకున్నారు. తరువాత వారిద్దరూ విడిపోయారు. దీనితో ఆయన రహస్యంగా రెండో వివాహం చేసుకున్నారు. వాస్తవానికి నెల క్రితమే ఈ పెళ్లి జరగగా, తాజాగా ఈ విషయం సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది.

మాజీ మోడల్​
Who Is Grecia Munoz : మునోజ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ బయో ప్రకారం, ఆమె మెక్సికోలో జన్మించారు. మొదట్లో ఆమె మోడలింగ్ చేసేవారు. మెట్రోపాలిటన్ ఫ్యాషన్​ వీక్​ 2022 విజేతగా నిలిచారు. తరువాత దానికి స్వస్తి చెప్పి, సొంతంగా స్టార్టప్​ మొదలుపెట్టారు. ప్రస్తుతం దానినే నడిపిస్తున్నారు.

కొత్త ఇంటికి వచ్చా
మునోజ్ ప్రస్తుతం భారత్​లోనే ఉంటున్నారు. ఆమె దిల్లీకి వచ్చి, కొన్ని చారిత్రాత్మక ప్రదేశాలు సందర్శించారు. వాటి ఫొటోలను తన ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్ చేస్తూ, 'నా కొత్త ఇంట్లో, నా కొత్త జీవితం' అనే క్యాప్షన్ ఇచ్చారు.

ఉద్యోగం వదిలేసి
దీపిందర్​ ఐఐటీ చదివారు. మొదట్లో ఒక కన్సల్టింగ్​ కంపెనీలో పనిచేశారు. తరువాత 2008లో హరియాణాలోని గురుగ్రామ్​ కేంద్రంగా జొమాటో యాప్​ను ప్రారంభించారు. ప్రస్తుతం దేశంలోని వెయ్యికి పైగా నగరాల్లో జొమాటో సేవలు అందిస్తోంది.

శాకాహారుల కోసం జొమాటో ‘ప్యూర్‌ వెజ్‌ ఫ్లీట్‌’
జొమాటో వ్యవస్థాపకుడు, సీఈఓ దీపిందర్ జోషి ఇటీవలే శాకాహారుల కోసం ప్రత్యేకంగా 'ప్యూర్​ వెజ్​ ఫ్లీట్​' పేరుతో ప్రత్యేక సేవలను ప్రారంభించారు. దీని వల్ల కస్టమర్లు శాకాహారం మాత్రమే అందించే రెస్టారెంట్‌లను ఎంపిక చేసుకునే సౌకర్యం కలుగుతుంది. అంతేకాదు నాన్​-వెజ్​ వండే హోటల్స్​ను పూర్తిగా మినహాయించే అవకాశం కూడా యూజర్లకు కల్పిస్తారు. అయితే ఇందుకోసం మొదటిగా ఆకుపచ్చ డెలివరీ బాక్స్​లను ఉపయోగించాలని జొమాటో భావించింది. కానీ చివరికి ఎర్ర బాక్స్​ల్లోనే ఫుడ్​ ఆర్డర్స్ అందించాలని నిర్ణయించుకుంది.

క్రెడిట్​ కార్డ్​ యూజర్లకు అలర్ట్ ​- ఏప్రిల్‌ 1 నుంచి మారనున్న రూల్స్​! - Credit Card Rules From April 2024

మీరు టూ-వీలర్స్​ నడుపుతుంటారా? ఈ టాప్​-10 రోడ్ సేఫ్టీ టిప్స్ మీ కోసమే! - Road Safety Tips For Bike Riders

Last Updated : Mar 22, 2024, 1:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.