Zee5 Subscription Offers : ఒకప్పుడు కొత్త సినిమాలు చూడాలంటే థియేటర్‌కి వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎంత కొత్త సినిమా అయినా మహా అయితే నెల లేదా రెండు నెలల్లోనే ఓటీటీలో రిలీజ్ అవుతుంది. మనకు ఓటీటీ ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ సినిమాను చూసుకోవచ్చు. అలాంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో జీ5 ఒకటి.
ప్రస్తుతం వెబ్‌సిరీస్‌ల నుంచి సినిమాల వరకు, సీరియల్స్ నుంచి రియాలలిటీ షోస్ వరకు కంటెంట్ అంతా ఓటీటీల్లోనే మనకు దొరుకుతుంది. అందుకే ఓటీటీల వైపు జనాల ఆకర్షితులవుతున్నారు. ప్రస్తుతం మనకు అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, జీ5, జియో, ఆహా లాంటి ఓటీటీలు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో జీ5 ఓటీటీ అందుబాటు ధరల్లో అందిస్తున్న సబ్స్క్రిప్షన్ ఆఫర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
6నెలల ప్లాన్!
ప్రస్తుతం జీ5లో రెండు రకాల ప్రీమియం ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో 6 నెలలు వ్యాలిడిటీతో ఒకటి, ఏడాది వ్యాలిడిటీ కలిగిన ప్లాన్ రెండోది. 6 నెలల ప్లాన్ విషయానికి వస్తే దీని ధర రూ.749 కాగా ఆఫర్లో భాగంగా రూ.699కే వస్తోంది. దీంతో 6శాతం యూజర్లు ఆదా ఆదాచేసుకోవచ్చు. ఇందులో మూవీస్, వెబ్‌సిరీస్‌లు, టీవీ షోలు ఉంటాయి. వీటిని మనం డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. అంతేకాకుండా అన్లిమిటెడ్ మ్యూజిక్నూ డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. రెండు డివైజ్‌లలో దీన్ని ఉపయోగించుకోవచ్చు. 1080p రిజల్యూషన్ (ఫుల్ హెచ్డీ) క్వాలిటీలో వీడియోలను వీక్షించవచ్చు. Dolby 5.1 క్వాలిటీతో మ్యూజిక్‌ను ఎంజాయ్ చేయవచ్చు.
ఏడాది ప్లాన్!
ఇక వార్షిక సబ్స్క్రిప్షన్ ప్లాన్ విషయానికొస్తే- ఇందులో రెండు రకాలున్నాయి. ఒకటి ప్రీమియం HD కాగా, మరొకటి ప్రీమియం 4k. ప్రీమియం HD ధర రూ.899. ఇందులో అన్ని రకాల కంటెంట్‌ను చూడవచ్చు. వీడియో క్వాలిటీ 1080pగా ఉంటుంది. Dolby 5.1 క్వాలిటీతో మ్యూజిక్‌ను కూడా వినవచ్చు. టీవీ, ల్యాప్‌టాప్‌లో వినియోగించుకోవచ్చు. ప్రీమియం కంటెంట్‌కి మాత్రం యాడ్స్ వస్తాయి.
ఇందులో ప్రీమియం హెచ్డీ ధర రూ.1199 ఉండగా, ఆఫర్లో రూ.899కే అందిస్తోంది జీ5 సంస్థ. దీంతో 25శాతం వరకు డబ్బులు సేవ్ చేసుకోవచ్చని చెబుతోంది. ఇక ప్రీమియం 4k ధర రూ.1999 ఉండగా, ఈ ప్లాన్‌ను రూ.1199కే అందిస్తోంది. ఇందులోనూ కంటెంట్ అంతా వీక్షించవచ్చు. అన్లిమిటెడ్ మ్యూజిక్, లైవ్ టీవీని ఆస్వాదించవచ్చు. పూర్తిగా యాడ్ ఫ్రీ కంటెంట్‌ను ఎంజాయ్ చేయవచ్చు. అంతేకాకుండా ఒకేసారి 4 డివైజ్‌లలో దీనిని వాడుకోవచ్చు. వీడియో క్వాలిటీ కూడా పేరుకు తగ్గట్లే 4kలో ఉంటుంది. అయితే ఇది 4kని సపోర్ట్ చేసే టీవీ, డివైజ్‌లలో మాత్రమే పనిచేస్తుంది. Dolby Atmos టెక్నాలజీతో సంగీతాన్ని ఆస్వాదించవచ్చు. ఆన్లైన్ లేదా యూపీఐ ద్వారా ఈ ప్లాన్స్‌ను కొనుగోలు చేయవచ్చు.
ఆ ఎక్స్ యూజర్స్‌కు ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్- ప్రీమియం ఫీచర్లన్నీ ఫ్రీ! - elon musk