What To Do If Someone Else Occupies Your Reserved Seat On The Train : దూర ప్రయాణమనగానే ఎక్కువ మంది ఓటేసేది రైళ్లకే. తక్కువ ఖర్చుతో రైలులో సౌకర్యవంతంగా ప్రయాణం చేయవచ్చు. అందుకే ఎక్కువ మంది రైలు ప్రయాణం చేయడానికి ఇష్టపడుతుంటారు. అయితే ఒక్కోసారి రైలు టికెట్‌ను రిజర్వేషన్ చేసుకున్నా సరే, ఆ సీట్లో ఎవరో వేరేవారు కూర్చుని ఉంటారు. సీటు ఖాళీ చేయాలని ఎంత చెప్పినా ఒప్పుకోరు. దీంతో వారితో మీరు గొడవ పడాల్సి వస్తుంది. అయితే ఎలాంటి గొడవలు, ఘర్షణలు లేకుండా, చాలా ఈజీగా మీరు రిజర్వేషన్ చేసుకున్న సీటును పొందొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫిర్యాదు చేయండిలా!
మీరు రిజర్వేషన్ చేసుకున్న సీటుపై ఇంకెవరైనా కూర్చుంటే, రైల్వే శాఖకు ఆన్లైన్లో ఫిర్యాదు చేయవచ్చు. లేదా ఫోన్ చేసి కంప్లైంట్ ఇవ్వవచ్చు. రైలు ప్రయాణికుల ఫిర్యాదులను సత్వరం పరిష్కరించడానికి, అలాగే వారికి సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు రైల్వే శాఖ పలు చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా ట్రైన్‌లోని సమస్యలపై ఫిర్యాదు చేయడానికి రైల్‌మదద్ అనే వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చింది. అలాగే ఓ టోల్‌ఫ్రీ నంబర్‌ను కూడా ఏర్పాటు చేసింది. ముందుగా మనం ఆన్లైన్లో ఎలా ఫిర్యాదు చేయాలో తెలుసుకుందాం.
మీరు రిజర్వ్ చేసుకున్న సీటును తిరిగిపొందేందుకు ఆన్లైన్లో ఎలా ఫిర్యాదు చేయాలంటే?
- ముందుగా మీరు రైల్‌మదద్ వైబ్‌సైట్ https://railmadad.indianrailways.gov.in ను ఓపెన్ చేయాలి.
- వైబ్సైట్లో మీ రైలు పేరు, పీఎన్ఆర్ నంబర్, సీటు నంబర్ ఎంటర్ చేయాలి. అంతే సింపుల్!
- మీరు చేసిన ఫిర్యాదు వెంటనే రైల్వే శాఖకు అందుతుంది. వారు తగిన చర్యలు తీసుకుని మీ సీటును మీకు ఇప్పిస్తారు.
- మీరు కావాలనుకుంటే, కంప్లైంట్ స్టేటస్‌ను కూడా ఆన్లైన్లో చూసుకునే వెసులుబాటు ఉంది.
రైల్వే హెల్ప్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేయడం ఎలా?
- ఆన్లైన్లో ఫిర్యాదు చేయలేనివారు, రైల్వే హెల్ప్‌లైన్ నంబర్ 139కి కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వవచ్చు.
- మీరు 139కు కాల్ చేసిన తరువాత, కస్టమర్ సర్వీస్ ఏజెంట్‌కు మీ ట్రైన్ పేరు, పీఎన్ఆర్ నంబర్, సీట్ నంబర్ వివరాలు తెలియజేయాలి.
- వెంటనే రైల్వే అధికారులు తగిన చర్యలు తీసుకుని, మీ రిజర్వ్డ్ సీట్‌ను మీకు ఇప్పిస్తారు. అంతే సింపుల్!
మంచి మైలేజ్ ఇచ్చే స్కూటర్ కొనాలా? టాప్-10 ఆప్షన్స్ ఇవే! - Best Mileage Scooters