ETV Bharat / business

ఒకే UPI ఐడీని ఐదుగురు వాడుకోవచ్చు - జాయింట్ అకౌంట్ తరహాలో కొత్త ఫీచర్​! - What Is UPI Circle

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 20, 2024, 5:11 PM IST

What Is UPI Circle : యూపీఐ యూజర్లకు గుడ్ న్యూస్​. ఎన్​పీసీఐ ఇటీవలే యూపీఐ సర్కిల్​ అనే ఫీచర్​ను ప్రవేశపెట్టింది. మరి ఇది ఎలా పనిచేస్తుంది? దీని వల్ల యూజర్లకు ఎలాంటి ప్రయోజనం ఉంటుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

UPI Circle
UPI Circle (ETV Bharat)

What Is UPI Circle : డిజిటల్ పేమెంట్స్​ను మరింత ప్రోత్సహించేందుకు 'నేషనల్​ పేమెంట్స్​ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా' (NPCI) ఇటీవలే 'యూపీఐ సర్కిల్​'ను లాంఛ్ చేసింది. ఇది ఒక డెలిగేటెడ్​ పేమెంట్ ఫీచర్​. అంటే ఒక ప్రైమరీ యూజర్​ తనకు నమ్మకమైన వ్యక్తులకు పేమెంట్ బాధ్యతలను అప్పగించేందుకు ఇది వీలు కల్పిస్తుంది.

ఆగస్టు నెలలో రిజర్వ్​ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంపీసీ మీటింగ్ నిర్వహించిన సందర్భంగా ఈ నయా యూపీఐ ఫీచర్​ను లాంఛ్ చేసింది ఎన్​పీసీఐ. భారతదేశ వ్యాప్తంగా డిజిటల్ పేమెంట్స్​ను మరింత పెంచడమే దీని లక్ష్యం.

యూపీఐ సర్కిల్ అంటే ఏమిటి?
యూపీఐ సర్కిల్ అనేది ఒక డెలిగేటెడ్​ పేమెంట్ ఫీచర్​. దీని ద్వారా ఒక ప్రైమరీ యూపీఐ యూజర్​, తనకు అత్యంత నమ్మకమైన వ్యక్తులకు (సెకెండరీ యూజర్లకు) పేమెంట్స్​ చేసే బాధ్యతను అప్పగించడానికి వీలవుతుంది. అంతేకాదు ప్రైమరీ యూజర్​, సెకెండరీ యూజర్లకు ఫుల్ యాక్సెస్ ఇవ్వవచ్చు. లేదా పాక్షికంగా పేమెంట్స్​ చేసే అవకాశం మాత్రమే ఇవ్వవచ్చు. అంతేకాదు వారు చేసే ఆర్థిక లావాదేవీలను కూడా ప్రైమరీ యూజర్ కంట్రోల్ చేయవచ్చు. ఈ విధానం వల్ల మరింత ఎక్కువగా, సురక్షితంగా యూపీఐ పేమెంట్స్ చేయడానికి వీలవుతుందని ఎన్​పీసీఐ చెబుతోంది.

యూపీఐ సర్కిల్ ఎలా పనిచేస్తుంది?
యూపీఐ సర్కిల్​లో రెండు రకాల యూజర్లు ఉంటారు. వారు:

1. ప్రైమరీ యూజర్​

2. సెకెండరీ యూజర్​

ప్రైమరీ యూజర్​ యూపీఐ సర్కిల్​ను ప్రారంభిస్తాడు. డెలిగేషన్​ను కూడా కంట్రోల్​ చేయగలుగుతాడు. ప్రైమరీ యూజర్​ తన యూపీఐ అకౌంట్​ను మేనేజ్ చేయడానికి, తనకు అత్యంత నమ్మకమైన వ్యక్తులను నియమించుకుంటాడు. వీరినే సెకెండరీ యూజర్లు అంటారు. వీరు పాక్షికంగా లేదా పూర్తి స్థాయిలో యూపీఐ చెల్లింపులు చేయడానికి అనుమతి ఇస్తాడు. అది ఎలాగో ఇప్పుడు మరింత వివరంగా చూద్దాం.

ఫుల్​ డెలిగేషన్​
ప్రైమరీ యూజర్​, ముందే నిర్దేశించిన మొత్తం వరకు, ఆర్థిక లావాదేవీలు నిర్వహించడానికి సెకెండరీ యూజర్లకు అనుమతి ఇస్తాడు. కనుక ఆ పరిమితి వరకు సెకెండరీ యూజర్లు ఎలాంటి అడ్డంకులు లేకుండా పేమెంట్స్ చేయగలుగుతారు. ఇందుకోసం ప్రతిసారీ ప్రైమరీ యూజర్​ అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. దీనినే ఫుల్ డెలిగేషన్ అని అంటారు.

పార్శియల్​ డెలిగేషన్​
సెకెండర్ యూజర్లు నిర్దేశిత మొత్తం వరకు యూపీఐ లావాదేవీలు చేయగలుగుతారు. కానీ ప్రతి లావాదేవీకి ప్రైమరీ యూజర్​ అథంటికేషన్ అవసరం అవుతుంది. అంటే ప్రైమరీ యూజర్ -​ యూపీఐ పిన్​ను ఎంటర్​ చేస్తేనే, సెకెండరీ యూజర్లు చేసిన లావాదేవీలు ఎగ్జిక్యూట్ అవుతాయి.

ఎన్​పీసీఐ గైడ్​లైన్స్ ఏం చెబుతున్నాయి?
యూపీఐ సర్కిల్​ ఫీచర్​ కోసం ఎన్​పీసీఐ కొన్ని గైడ్​లైన్స్ ఇచ్చింది. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

  • యూపీఐ సర్కిల్​లో ప్రైమరీ యూజర్​, సెకెండరీ యూజర్లు ఉంటారు.
  • సెకెండరీ యూజర్లకు యాప్ పాస్​కోడ్​/ బయోమెట్రిక్స్ తప్పనిసరిగా ఉండాలి.
  • ప్రైమరీ యూజర్ గరిష్ఠంగా 5 మందిని సెకెండరీ యూజర్లుగా తీసుకోవచ్చు.
  • ఒక డెలిగేషన్​కు, ఒక నెలలో గరిష్ఠంగా రూ.15,000 వరకు పరిమితి ఉంటుంది.
  • ఫుల్​ డెలిగేషన్​ మాగ్జిమమ్ ట్రాన్సాక్షన్ లిమిట్ రూ.5000 వరకు ఉంటుంది.
  • ఇప్పటికే ఉన్న యూపీఐ పరిమితిలు పార్శియల్ డెలిగేషన్​కు కూడా వర్తిస్తాయి.
  • డైలీ ట్రాన్సాక్షన్ లిమిడ్ రూ.5000 దాటిన తరువాత మరో 24 గంటల వరకు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు చేయడానికి వీలుపడదు. దీనినే కూలింగ్ పీరియడ్ అని అంటారు.
  • సెకెండరీ యూజర్లు చేసే ఆర్థిక లావాదేవీలు అన్నింటినీ ప్రైమరీ యూజర్ ట్రాక్ చేయగలుగుతారు.
  • యూపీఐ పేమెంట్స్​ విఫలమైనప్పుడు, కస్టమర్లకు అందించాల్సిన పరిహారం విషయంలో, టర్న్-అరౌండ్​ టైమ్​ విషయంలో ఆర్​బీఐ గైడ్​లైన్స్ కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది.

UPI ద్వారా రాంగ్ నంబర్​కు డబ్బులు పంపించారా? డోంట్ వర్రీ - ఇకపై 24 గంటల్లోనే రీఫండ్​! - UPI Wrong Transaction Refund

మీరు క్రెడిట్ కార్డ్ యూజర్లా? CPPతో ఆన్​లైన్​ మోసాల నుంచి రక్షణ పొందండిలా! - Credit Card Protection Plans

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.