ETV Bharat / business

హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలా? ఆ వయస్సులో తీసుకుంటే బోలెడు బెనిఫిట్స్​! - Right Age for Health Insurance - RIGHT AGE FOR HEALTH INSURANCE

Right Age For Health Insurance : ప్రస్తుత కాలంలో అనారోగ్య సమస్యలతో బాధపడే వారి సంఖ్య పెరిగిపోతోంది. వైద్య ఖర్చులను తగ్గించుకోవడానికి చాలా మంది హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకుంటున్నారు. అయితే ఒక వ్యక్తి ఏ వయస్సులో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి? దాని వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

best age for health insurance
health insurance benefits
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 29, 2024, 10:33 AM IST

Right Age For Health Insurance : ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు అంటుంటారు. భారత్‌లో నేడు సగటు ఆయుర్ధాయం పెరిగినప్పటికీ, జీవన శైలిలో మార్పులు, పెరుగుతున్న వాయు, ఆహార కాలుష్యం కారణంగా దేశంలో మునుపెన్నడూ లేని విధంగా చాలా మంది ఆనారోగ్యం బారిన పడుతున్నారు. వృద్ధులే కాకుండా యుక్త వయస్సులో ఉన్నవారు కూడా అనేక రోగాల బారిన పడుతున్నారు. అదే సమయంలో ఆసుపత్రి బిల్లులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అందుకే చాలా మంది హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఇంతకీ ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడానికి సరైన వయసు ఏది? హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల కలిగే ప్రయోజనాలేమిటి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

వెయిటింగ్ పీరియడ్​
హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో కొన్ని వ్యాధులకు 30-90 రోజుల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఈ సమయంలో ఎలాంటి పరిహారం క్లెయిమ్స్‌ చేయలేరు. కంటి శుక్లం, మూత్రనాళంలో రాళ్లు, మోకాళ్ల మార్పిడి, కీళ్లనొప్పులు మొదలైన అనేక వ్యాధులకు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. చాలా బీమా కంపెనీలు కనీసం కొన్ని జబ్బులకు వెయిటింగ్‌ పీరియడ్‌ను వర్తింపజేస్తుంటాయి. 60 ఏళ్లు పైబడిన వ్యక్తులకు కొన్ని సందర్భాల్లో ఈ వెయిటింగ్‌ పీరియడ్‌ ఎక్కువగా ఉంటుంది. యుక్త వయసులోనే ఆరోగ్య బీమా పాలసీని తీసుకుంటే మెడికల్‌ ఎమర్జెన్సీ గురించి చింతించకుండా వెయిటింగ్‌ పీరియడ్‌ను ఈజీగా దాటేయవచ్చు.

తక్కువ ప్రీమియం
బీమా ప్రొవైడర్‌ వసూలు చేసే ప్రీమియం మొత్తం, పాలసీదారుడి ప్రస్తుత వయసుపై ఆధారపడి ఉంటుంది. పాలసీ తీసుకునేవారు యుక్త వయసులోనే పాలసీని ఎంచుకుంటే, తక్కువ ప్రీమియంతోనే గట్టెక్కవచ్చు. ఉదాహరణకు 25 ఏళ్ల యువకుడు రూ.5 లక్షల విలువ గల ఆరోగ్య బీమా పాలసీ తీసుకుంటే, ప్రీమియం దాదాపుగా రూ.5,500-6,000 వరకు ఉంటుంది. అదే 35 ఏళ్ల వ్యక్తి పాలసీ తీసుకున్నప్పుడు బీమా ప్రీమియం సుమారుగా రూ.7,000-7,500కు పెరిగిపోతుంది. 45 ఏళ్ల వ్యక్తి పాలసీ తీసుకుంటే ప్రీమియం సుమారుగా రూ.8,500-9,000 వరకు ఉండొచ్చు. అదే 60 ఏళ్ల సీనియర్‌ సిటిజన్‌ పాలసీ తీసుకుంటే రూ.15,000-21,000 వరకు అవుతుంది. అందువల్ల యుక్త వయసులోనే ఆరోగ్య బీమాను తీసుకోవడం చాలా మంచిది.

మెడికల్ చెకప్​
యవ్వనంలో ఆరోగ్య బీమా పాలసీ కోసం దరఖాస్తు చేసుకుంటే, వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. 45 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉన్న వ్యక్తులకు వైద్య పరీక్షల నివేదిక ఆధారంగా వారి ప్రీమియాన్ని నిర్ణయిస్తాయి బీమా ప్రొవైడర్లు. అంతేకాకుండా రిస్క్ పరిమితిని బట్టి బీమా సంస్థలు పాలసీని తిరస్కరించే అవకాశం కూడా ఉంది. యుక్త వయసులో బీమా తీసుకునే వారికి ఈ పరిస్థితి ఉండదు. యవ్వనంలో ఆరోగ్య సమస్యలు తక్కువ కాబట్టి మీ బీమా పాలసీ తిరస్కరించే అవకాశం సాధారణంగా ఉండదు. ఒకవేళ ఉన్న చాలా తక్కువ.

కవరేజ్​
యవ్వనంలో ఉన్నప్పుడు తక్కువ ఖర్చుతో ఎక్కువ బీమా కవరేజీని పొందొచ్చు. అవసరం ఏర్పడినప్పుడు ఆస్పత్రిలో చేరడమే కాకుండా డే-కేర్‌ విధానాలు, ప్రీ/పోస్ట్‌-హాస్పిటలైజేషన్‌, ఓపీడీ ఖర్చులు మొదలైనవి కూడా బీమా సంస్థ కవర్‌ చేస్తుంది. యుక్త వయసులో ఉన్నప్పుడు సాధారణంగా బాధ్యతలు తక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు వ్యక్తిగత ఆరోగ్య బీమాను ఎంచుకుని ఆపై అప్‌గ్రేడ్‌ చేసుకోవచ్చు. రైడర్స్‌ను కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ విధంగా మీ పాలసీ పరిధిని మరింతగా పెంచుకోవచ్చు. అంతేకాకుండా యవ్వనంలో ఆరోగ్య బీమాను కొనుగోలు చేయడం వల్ల క్యాపింగ్‌ మొదలైన పరిమితులు లేకుండా ఆరోగ్య రక్షణను పొందవచ్చు.

ట్యాక్స్ బెనిఫిట్స్
యుక్త వయసులో ఆరోగ్య బీమా పాలసీని కొనుగోలు చేయడం వల్ల పాలసీదారుడు ఎక్కువ కాలం పాటు ట్యాక్స్ ప్రయోజనాలను పొందొచ్చు. తద్వారా చెల్లించే ప్రీమియంపై ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం సెక్షన్ 80D ప్రకారం, పాలసీదారుడికి పన్ను మినహాయింపు లభిస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.25 వేల వరకు పన్ను మినహాయింపులను క్లెయిం చేసుకోవచ్చు.

నో క్లెయిమ్ బోనస్​
ఆరోగ్య బీమా పాలసీ రెన్యువల్‌ చేసుకునేటప్పుడు గతేడాదిలో ఎలాంటి క్లెయిమ్స్‌ చేయకపోతే, బీమా సంస్థలు ‘నో క్లెయిం బోనస్‌’ను అందిస్తాయి. అంటే, క్లెయిమ్ లేని ప్రతి ఏడాదీ మీ బీమా హామీ మొత్తం పెరుగుతుంటుంది. యుక్తవయసులో పాలసీ తీసుకున్నవారికి క్లెయిమ్స్‌ ఉండే అవకాశం తక్కువ కాబట్టి, ఈ బోనస్‌ను వినియోగించుకోవచ్చు. ఈ బోనస్‌ వల్ల మీ బీమా కవరేజ్‌ మొత్తం పెరుగుతుంది. ఇది క్లెయిం చేసే సందర్భంలో ప్రయోజనకరంగా ఉంటుంది. నో క్లెయిమ్‌ బోనస్‌ బీమా మొత్తంలో 5 శాతం నుంచి 100 శాతం వరకు కూడా ఉండవచ్చు.

65 ఏళ్లు దాటినా నో ప్రోబ్లమ్
ఐఆర్​డీఏ ఆరోగ్య బీమా పాలసీల కొనుగోలుకు ఉన్న వయోపరిమితిని ఇటీవలే ఎత్తివేసింది. కనుక ఇకపై సీనియర్‌ సిటిజన్లు, విద్యార్థులు, పిల్లలు, గర్భిణులతో సహా, కాంపిటెంట్‌ అథారిటీ పేర్కొన్న అన్ని వయస్సుల వారందరూ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవచ్చు.

మీ పాన్​ కార్డ్​ పోయిందా? డోంట్​ వర్రీ - ఈజీగా డౌన్​లోడ్ చేసుకోండిలా! - How To Download ePAN Card

త్వరలో అమెజాన్ 'గ్రేట్ సమ్మర్ సేల్'​ - ఫోన్స్​, గ్యాడ్జెట్స్​పై భారీ డిస్కౌంట్స్ & ఆఫర్స్! - Amazon Great Summer Sale 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.