ETV Bharat / business

వాల్ స్ట్రీట్‌ ఢమాల్‌ - సోమవారం ఇండియన్ మార్కెట్లు ఎలా రియాక్ట్ కావచ్చంటే? - Indian Stock Market Forecast - INDIAN STOCK MARKET FORECAST

Indian Stock Market Forecast : వాల్ స్ట్రీట్ శుక్రవారం గత 18 నెలల్లో చూడనంత భారీ నష్టాలను చవిచూసింది. అమెరికాలో ఉద్యోగాల కల్పన తగ్గడం, టెక్నాలజీ స్టాక్స్ పతనం కావడమే ఇందుకు కారణం. అయితే ఈ ప్రభావం ఇండియన్ స్టాక్ మార్కెట్లపై పడుతుందా? లేదా? అనేది ఇప్పుడు చూద్దాం.

Stock Market
Stock Market (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 7, 2024, 11:25 AM IST

Indian Stock Market Forecast : శుక్రవారం యూఎస్ మార్కెట్లు గత 18 నెలల్లో చూడనంత భారీ నష్టాలను చవిచూశాయి. దీనితో మదుపరుల సంపద భారీగా ఆవిరైంది. నాస్‌డాక్‌ కాంపోజిట్‌ 2.6 శాతం, ఎస్‌&పీ 500 దాదాపు 1.7 శాతం, డౌ జోన్స్‌ 410 పాయింట్స్‌ (1 శాతం) మేర నష్టపోయాయి. బ్రాడ్‌కామ్‌, ఎన్వీడియా లాంటి టెక్నాలజీ స్టాక్స్‌ విలువలు పతనం కావడం, అమెరికాలో ఉద్యోగ కల్పన రేటు భారీగా తగ్గిందని నివేదికలు వెల్లడించడమే ఇందుకు కారణం.

అమెరికాలో ప్రస్తుతం మాన్యుఫాక్చురింగ్ రంగం బలహీనంగా ఉంది. మరోవైపు ద్రవ్యోల్బణం బాగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో యూఎస్ ఫెడరల్ రిజర్వ్‌ ఛైర్మన్‌ జెరోమ్ పావెల్‌ పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం యూఎస్ జాబ్ మార్కెట్‌ను రక్షించడం, ఆర్థిక మాంద్యం నివారణలపైనే ఆయన ప్రధానంగా దృష్టి సారించారు. మరి ఈ నెలాఖారున జరగనున్న ఫెడరల్ రిజర్వ్‌ సమావేశంలో కీలక వడ్డీ రేట్లను ఎంత మేరకు తగ్గిస్తారో చూడాలి.

ఒక వేళ కీలక వడ్డీ రేట్లు కనుక తగ్గిస్తే, పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంటుంది. కానీ ఈ విషయంలో పెఢ్‌ ఇప్పటికే బాగా ఆలస్యం చేసిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అమెరికాను ఆర్థిక మాంద్యం తాకినట్లయితే, కచ్చితంగా కార్పొరేట్ లాభాలు తగ్గుతాయి. అప్పుడు కీలక వడ్డీ రేట్లను తగ్గించినప్పటికీ, ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇంత వరకూ ఓకే. అయితే ఈ ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు, యూఎస్ మార్కెట్ల లాభనష్టాలు ఇండియన్ స్టాక్ మార్కెట్లపై పడతాయా? లేదా? అనేది ఇప్పుడు చూద్దాం.

భారత్‌పై ప్రభావం పడుతుందా?
గ్లోబల్ మార్కెట్ల ప్రభావం కచ్చితంగా ఇండియన్ స్టాక్ మార్కెట్లపై ఉంటుంది. మరీ ముఖ్యంగా యూఎస్ ఫెడరల్ రిజర్వ్ తీసుకునే నిర్ణయాలు, భారత మార్కెట్లపై కచ్చితంగా ప్రభావం చూపుతాయి. ఫెడ్ కనుక వడ్డీ రేట్లను పెంచితే, భారత్ నుంచి విదేశీ సంస్థాగత పెట్టుబడులు తరలివెళ్తాయి. ఒక వేళ ఫెడరల్ రిజర్వ్‌ కీలక వడ్డీ రేట్లను తగ్గిస్తే, భారత్‌కు విదేశీ పెట్టుబడులు పెరుగుతాయి.

స్టాక్ ఎక్స్ఛేంజీ డేటా ప్రకారం, శుక్రవారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.621 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను అమ్మేశారు. అయితే దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.2,121 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.

టెక్ స్టాక్స్‌కు కష్టమే!
టెక్నాలజీ స్టాక్స్ విషయానికి వస్తే, ప్రస్తుతం ప్రపంచంలోని దాదాపు అన్ని టెక్ కంపెనీలు ఆర్టిఫీషియెల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పైనే దృష్టి కేంద్రీకరించాయి. కొన్ని ఇప్పటికే ఏఐ వల్ల భారీ లాభాలను ఆర్జించాయి. వీటిలో ఎన్వీడియా కంపెనీ ఒకటి. అయితే తాజాగా ఈ కంపెనీ షేర్లు భారీగా పతనం అయ్యాయి. మరో టెక్ కంపెనీ బ్రాడ్‌కామ్‌ కూడా తీవ్రంగా నష్టపోయింది. ఈ ప్రభావం ఇండియన్ టెక్ కంపెనీలపై పడే ఛాన్స్ ఉంది.

పెరిగిన ఫారెక్స్ నిల్వలు
భారత్‌లో ఫారెక్స్ నిల్వలు భారీగా పెరిగాయి. ఆగస్టు 30తో ముగిసిన వారానికి మన విదేశీ మారకపు (ఫారెక్స్‌) నిల్వలు 2.299 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.19,000 కోట్లు) పెరిగి, జీవనకాల గరిష్ఠమైన 683.987 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.56.80 లక్షల కోట్ల)కు చేరాయని ఆర్‌బీఐ తెలిపింది. కిందటి వారంలో ఫారెక్స్‌ నిల్వలు 681.688 బి.డాలర్లుగా ఉన్నాయి. ఇది భారత్‌కు చాలా సానుకూల అంశమని చెప్పవచ్చు.

పసిడి నిల్వలు
ప్రస్తుతం భారత్‌లో పసిడి నిల్వలు 862 మిలియన్‌ డాలర్లు పెరిగి 61.859 బిలియన్‌ డాలర్లకు చేరాయి. దేశ ప్రత్యేక ఉపసంహరణ హక్కులు (ఎస్‌డీఆర్‌లు) 9 మిలియన్‌ డాలర్ల వృద్ధితో 18.468 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ఇది కూడా సానుకూల అంశమే. అయితే ఇంటర్నేషనల్ మోనటరీ ఫండ్‌ (ఐఎంఎఫ్‌) వద్ద మన దేశ నిల్వలు 58 మిలియన్‌ డాలర్లు తగ్గి 4.622 బిలియన్‌ డాలర్లుగా నమోదైనట్లు ఆర్‌బీఐ గణాంకాలు చెబుతున్నాయి.

ఎక్కడా తగ్గడం లేదు!
గ్లోబల్ మార్కెట్లు ఎలా ఉన్నా, భారతీయ మదుపరులు మాత్రం చాలా ఆశాజనకంగా ఉన్నారు. ప్రధానంగా యువత స్టాక్ మార్కెట్లలో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. భారత ఆర్థిక వృద్ధి అంచనాలు ఆశాజనకంగా ఉండడం, స్థిరమైన ప్రభుత్వం ఉండడం, పరిశ్రమలకు, పెట్టుబడిదారులకు, స్టార్టప్‌లకు ప్రోత్సాహకాలు ఇస్తుండడం - ఇవన్నీ కలిసి మదుపరుల సెంటిమెంట్‌ను బలపరుస్తున్నాయి.

ఫిచ్‌ రేటింగ్స్‌ 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను భారత వృద్ధిరేటును 7.2 శాతానికి పెంచింది. అలాగే 2024 భారత ఆర్థిక వృద్ధిరేటు 7.5 శాతం ఉంటుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరం(2023-24)లో భారత్​ 8.2 శాతం జీడీపీ వృద్ధి రేటు సాధించిందని జాతీయ గణాంక కార్యాలయం(NSO)​ తెలిపింది. ఇకపై కూడా ఇదే జోరు కొనసాగుతుందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇవన్నీ భారత ఆర్థిక ప్రగతిని తెలియజేస్తున్నాయి. మరి ఇన్ని అనుకూలతలు, ప్రతికూలతలు ఉన్న నేపథ్యంలో సోమవారం ఇండియన్ స్టాక్ మార్కెట్లు ఎలా స్పందిస్తాయో చూడాలి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.