Unlimited Voice Calls Plan Without Data : దేశంలో మొబైల్ వినియోగదారుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఫోన్ల వినియోగంతో పాటు వివిధ మొబైల్ నెట్‌వర్క్‌లకూ డిమాండ్ భారీగా పెరిగింది. దీంతో టెలికాం సంస్థల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో టెలికాం సంస్థలు అన్నీ తమ కస్టమర్ల కోసం వివిధ రకాల ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. అతి తక్కువ ధరలో డేటా, ఎస్ఎంఎస్, అన్లిమిటెడ్ కాలింగ్ ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటాయి.
బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ కేవలం రూ.99కే అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ మాట్లాడుకునే సూపర్ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. చాలామంది వినియోగదారులు అతి తక్కువ ధరలో అన్లిమిటెడ్ కాల్స్ మాట్లాడుకునేందుకు వీలుగా ఉండే ప్లాన్స్ కోసం వెతుకుతుంటారు. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొనే తాము ఈ అన్లిమిటెడ్ కాలింగ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టినట్లుగా బీఎస్ఎన్ఎల్ తెలిపింది. తమ సేవలు వినియోగదారులకు మరింత చేరువ కావాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
ప్లాన్ గడువు ఎంతంటే?
ఈ అన్లిమిటెడ్ కాలింగ్ ప్లాన్‌ను బీఎస్ఎన్ఎల్ స్పెషల్ టారీఫ్ ఓచర్‌గా అభివర్ణించింది. రూ.99లకే అందిస్తున్న ఈ ప్లాన్ వ్యాలిడిటీని 18 రోజులుగా నిర్ణయించింది. ఈ ఆఫర్‌ను దేశమంతంటా అందుబాటులోకి తెచ్చిన్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. అయితే ఈ ప్లాన్ కింద ఎలాంటి డేటా లేదా ఎస్ఎంఎస్ వంటి మరే ఇతర సదుపాయాలను కల్పించలేదు కంపెనీ. మొత్తంగా ఇంటర్నెట్ వినియోగించనివారికి, మేసేజ్‌లు పంపనివారికి బీఎస్ఎన్ఎల్ తీసుకువచ్చిన ఈ స్పెషల్ ఆఫర్(అన్లిమిటెడ్ కాలింగ్)ను ఓ బెస్ట్ ఆప్షన్‌గా సూచించవచ్చు.
బీఎస్ఎన్ఎల్ డేటా ప్యాక్స్
- రూ.16కే 2జీబీ డేటా, వ్యాలిడిటీ 1 రోజు.
- రూ.97కి 30జీబీ డేటా, వ్యాలిడిటీ 15 రోజులు.
- రూ.98కి 36జీబీ డేటా, వ్యాలిడిటీ 18 రోజులు.
- రూ.94కి 90జీబీ డేటా, వ్యాలిడిటీ 30 రోజులు.
- రూ.151కి 40జీబీ డేటా, వ్యాలిడిటీ 30 రోజులు.
- రూ.198కి 80జీబీ డేటా, వ్యాలిడిటీ 40 రోజులు.
- రూ.288కే 120జీబీ డేటా, వ్యాలిడిటీ 60 రోజులు.
జియో ఎయిర్‌ఫైబర్ యూజర్ల కోసం 2 కొత్త ప్లాన్స్
రిలయన్స్ జియో ఎయిర్‌ఫైబర్ వినియోగదారుల కోసం రెండు కొత్త ప్లాన్స్‌ను తీసుకొచ్చింది. అయితే ఇవి రెగ్యులర్ ప్లాన్స్ కావు. అదనపు డేటా అందించే డేటా బూస్టర్ ప్లాన్స్. వీటి ధరలను రూ.101, రూ.251గా జియో నిర్ణయించింది. వైర్ అవసరం లేని 5జీ ఆధారిత ఎయిర్ ఫైబర్ కోసం రెగ్యులర్, మ్యాక్స్ పేరిట మొత్తం ఆరు బేసిక్ ప్లాన్లను జియో అందిస్తోంది. ఆయా ప్లాన్లలో గరిష్ఠంగా 1 టీబీ డేటా లభిస్తుంది. ఈ డేటా పూర్తయినప్పుడు డేటా స్పీడ్ 64 కేబీపీఎస్‌కు పడిపోతుంది. ఇలాంటి సందర్భాల్లో డేటా బూస్టర్ ప్యాక్స్ అవసరం అవుతాయి.
జియో తీసుకొచ్చిన రూ.101 ప్లాన్‌తో 100 జీబీ డేటా లభిస్తుంది. రూ.251 ప్యాక్‌తో 500 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్లకు ప్రత్యేక గడువంటూ ఉండదు. బేస్ ప్లాన్ గడువే వీటికీ వర్తిస్తుంది. ఈ తరహాలో గతంలో రూ.401 డేటా బూస్టర్ ప్లాన్‌ను జియో తీసుకొచ్చింది. ఈ ప్లాన్ కింద 1టీబీ డేటా లభిస్తుంది. డేటా బూస్టర్ ప్లాన్లకు జీఎస్టీ అదనం. ఇక రెగ్యులర్ ప్లాన్ల విషయానికొస్తే రూ.599, రూ.899, రూ.1,199 ధరల్లో ఎయిర్ ఫైబర్ ప్లాన్లను; రూ.1,499, రూ.2,499, రూ.3,999 పేరిట ఎయిర్‌ఫైబర్ మ్యాక్స్ ప్లాన్లను జియో అందిస్తోంది.
ఏపీ, తెలంగాణలో బంగారం ధర ఎంతంటే?
ఫిబ్రవరి 12 నుంచి గోల్డ్ బాండ్ సబ్స్క్రిప్షన్ - వారికి ప్రత్యేక డిస్కౌంట్ - ఎలా అప్లై చేయాలంటే?