Top 6 Features For New Cars : ఈ రోజుల్లో ఓ మంచి కారు కొనుగోలు చేయాలని చాలా మంది భావిస్తుంటారు. ఎంతో కష్టపడి సంపాదించిన సొమ్ముతో కారు కొనుగోలు చేసేముందు అందులో అన్ని ఫీచర్లు ఉన్నాయో లేదో చూసుకోవాల్సిన అవసరం ఉంది. మరి కొత్తగా కారు కొనాలనుకునే వారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 6 ముఖ్యమైన ఫీచర్లు ఏంటి? ఏఏ విషయాలు పరిగణనలోకి తీసుకోవాలి అనే వివరాలు మీ కోసం.
- ఎయిర్ బ్యాగ్స్ : దాదాపు అన్ని కార్ల తయారీదారులు తమ ఉత్పత్తుల్లో ప్రామాణికంగా కనీసం 2 ఎయిర్ బ్యాగ్లను అందిస్తాయి. అయితే ఇంకా మెరుగైన భద్రత కోసం కనీసం 6 స్టాండర్డ్ ఎయిర్‌బ్యాగులు ఉన్న కారును ఎంచుకోవడం మంచిది. ఇవి డ్యాష్ బోర్డు, ఆక్యుపెంట్ మధ్య ఉండి ప్రమాదం జరిగే సమయంలో తెరుచుకుని మనల్ని కాపాడతాయి.
- టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ : కారులో టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్(టీఎమ్పిఎస్) అతి ముఖ్యమైనది. ఇది టైర్ గాలి ప్రెజర్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. తద్వార కారు సాఫీగా పనిచేసేలా చేస్తుంది. టైర్లో తగినంత ఎయిర్ లేనప్పుడు అదుపు తప్పి ప్రమాదం జరిగే అవకాశముంది. TPMS టైర్ ప్రెజర్ గురించి కారు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌పై డ్రైవర్ కు హెచ్చరికలు పంపిస్తుంది.
- ఇన్ బిల్ట్ నావిగేషన్ : మనం కారులో ప్రయాణించేటప్పుడు లొకేషన్‌ను తెలుసుకునేందుకు కారులోనే నేవిగేషన్ సిస్టమ్ ఉంటే మంచిది. దీనివల్ల ప్రతిసారీ మొబైల్ సహాయంతో లొకేషన్ చెక్ చేసుకునే అవసరం తప్పుతుంది. జీపీఎస్ కలిగి ఉన్న అనేక యాప్‌లు ఇదే పనిని చేస్తాయి. ప్రస్తుత కాలంలో చాలా కార్లలో నేవిగేషన్ ఫెసిలిటీ ఇన్‌బిల్ట్‌గా వస్తోంది.
- పార్కింగ్ సెన్సర్లు : కారులో పార్కింగ్ సెన్సర్లు చాలా ముఖ్యమైనవి. పార్కింగ్ ప్రదేశంలో ఎక్కువ కార్లను ఉంచి ఉన్నప్పుడు ఒక్కోసారి మనం వాహనం ఎక్కడ ఉందో తెలుసుకోవడం కాస్త కష్టమవుతుంది. అందువల్ల అలాంటి సందర్భాల్లో ఉపయోగపడేదే ఈ పార్కింగ్ సెన్సర్లు. వీటి సహాయంతో మన కారు ఎక్కడ ఉందో తెలుసుకోవడం సులభంగా ఉంటుంది. కారు ముందు, వెనక భాగంలో ఈ సెన్సర్లు ఉంటాయి.
- క్రూయిజ్ కంట్రోల్ : కార్లలో స్టాండర్డ్, అడాప్టివ్ అనే రెండు రకాల క్రూయిజ్ కంట్రోల్ అందుబాటులో ఉన్నాయి. స్టాండర్డ్ క్రూయిజ్ కంట్రోల్ మిమ్మల్ని హైవేపై ఒక నిర్దిష్టమైన స్పీడ్‌లో ఉంచుతుంది. కానీ మీ కారు చుట్టూ ఇతర వాహనాలు ఉన్నసమయంలో పెద్దగా పనిచేయదు. అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ అధునాతనమైనది. పరిస్థితిని బట్టి పనిచేస్తుంది. ముందు ఏదైనా వాహనం ఉంటే సురక్షితమైన దూరంలో ఉంచేందుకు కారు వేగాన్ని తగ్గిస్తుంది.
- ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ : ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ (AEB) ఇది మరో ఉపయోగకరమైన ఫీచర్. సెన్సర్ల ద్వారా పనిచేస్తుంది. మీ కారుకు దగ్గరగా ఏదైనా ఇతర వాహనం వచ్చినప్పుడు ప్రమాదం జరగకుండా ఉండేందుకు ఆటోమేటిక్‌గా బ్రేక్స్ వేస్తుంది. ఇది యాక్టివేట్ అయిన వెంటనే కారు వేగాన్ని తగ్గిస్తుంది. ఒకవేళ కారు అతివేగంతో ఉండి కంట్రోల్ చేయకపోయినా వేగాన్ని తగ్గిస్తుంది.
ఫ్యామిలీతో జర్నీ కోసం 7 సీటర్ కారు కొనాలా? మార్కెట్లో బెస్ట్ మోడల్స్ ఇవే!
కొత్త ఇంజిన్- 13రంగులు- మారుతి స్విఫ్ట్ నయా మోడల్ ఫీచర్లు అదుర్స్!