ETV Bharat / business

అతి త్వరలో లాంఛ్ కానున్న టాప్​-5 SUV కార్స్​ ఇవే! ధర ఎంతంటే? - Top 5 Upcoming SUV Cars in 2024

Top 5 Upcoming SUV Cars In India : కార్​ లవర్స్ అందరికీ గుడ్ న్యూస్​. ఈ సంవత్సరం టాటా, మారుతి సుజుకి, మహీంద్రా, హ్యుందాయ్​, ఫోక్స్​వ్యాగన్​ బ్రాండ్​లకు చెందిన టాప్​-5 ఎస్​యూవీ కార్లు ఇండియాలో లాంఛ్ కానున్నాయి. వీటిలో పెట్రోల్ కార్లతో పాటు ఎలక్ట్రిక్​ వెహికల్స్ కూడా ఉన్నాయి. మరెందుకు ఆలస్యం వాటిపై ఓ లుక్కేద్దాం రండి.

Upcoming Cars in India 2024
Top 5 Upcoming SUV Cars in India
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 17, 2024, 3:43 PM IST

Top 5 Upcoming SUV Cars In India : ప్రస్తుతం ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ చాలా అద్భుతమైన ప్రగతిని సాధిస్తోంది. దీనికి ప్రధాన కారణం ధనిక వర్గాలతోపాటు, మధ్యతరగతి వినియోగదారులు కూడా ఎక్కువగా కార్లు కొనుగోలు చేస్తున్నారు. అందుకే దీనిని క్యాష్ చేసుకునేందుకు, ప్రపంచ ప్రఖ్యాత ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ తమ లేటెస్ట్​ కార్లను మన భారతదేశంలో లాంఛ్ చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నాయి.

ఈవీ మార్కెట్​పై ఆధిపత్యం ఎవరిదో?
ముఖ్యంగా ఈవీ కార్లను ఇండియాలో విడుదల చేయడానికి ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటి వరకు టాటా మోటార్స్ ఒక్కటే భారత్​ ఈవీ మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తోంది. అయితే అతి త్వరలోనే దీనికి గట్టిపోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా హ్యుందాయ్​ ఈ ఏడాది క్రెటా ఈవీని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. మహీంద్రా కంపెనీ ఎక్స్​యూవీ 300 ఫేస్​లిఫ్ట్​ సహా, దాని ఈవీ వెర్షన్​ను విడుదల చేయడానికి సిద్ధం అవుతోంది. వీటితో పాటు అనేక ఎస్​యూవీలు కూడా లాంఛ్​కు రెడీగా ఉన్నాయి. మరెందుకు ఆలస్యం వాటిపై ఓ లుక్కేద్దాం రండి.

1. Hyundai Creta EV : హ్యుందాయ్ కంపెనీ విడుదల చేసిన మోస్ట్ పాపులర్​ కారు క్రెటా. దీని కొనసాగింపుగా ఈ ఏడాది క్రెటా ఈవీ వెర్షన్​ను ఇండియాలో లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. బహుశా దీనిని సెప్టెంబర్​లో విడుదల చేసే అవకాశం ఉంది. అయితే కంపెనీ దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ఈ హ్యుందాయ్ క్రెటాను ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 400 కి.మీ రేంజ్​ వరకు ప్రయాణించవచ్చని సమాచారం. అలాగే దీనిలో డ్యూయెల్​-స్క్రీన్ ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టమ్​, పనోరమిక్ సన్​రూఫ్​, వైర్​లెస్​ ఫోన్ ఛార్జింగ్ లాంటి ఎన్నో అధునాతన ఫీచర్లు ఉన్నాయని తెలుస్తోంది.

మార్కెట్లో ఈ హ్యుందాయ్ క్రెటా ఈవీ ధర సుమారుగా రూ.20 లక్షల నుంచి రూ.35 లక్షలు (ఎక్స్​-షోరూం) ప్రైస్​ రేంజ్​లో ఉండవచ్చు.

2. New Gen Maruti Suzuki Swift : భారత్​కు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి తన న్యూ-జెన్​ స్విఫ్ట్​ కారును బహుశా ఏప్రిల్​ 2024లో లాంఛ్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ పాపులర్ హ్యాచ్​బ్యాక్​ను జపాన్ మొబిలిటీ షోలో ప్రదర్శించారు. దీనిని బట్టి ఈ కారు డిజైన్​లో అనేక మార్పులు చేసినట్లు తెలుస్తోంది.

మారుతి సుజుకి కంపెనీ ఈ స్విఫ్ట్ కారులో అనేక అధునాతన ఫీచర్లను కూడా పొందుపరుస్తోంది. దీనిలో ప్రధానంగా మైల్డ్​-హైబ్రీడ్​ ఆప్షన్​తో 1.2 లీటర్​, 3 సిలిండర్​ పెట్రోల్ ఇంజిన్​ను అమరుస్తోంది. దీని వల్ల కారు ఫ్యూయెల్ ఎఫీషియన్సీ బాగా పెరుగుతుంది. పైగా కారు మాన్యువల్​, ఆటోమేటిక్ ట్రాన్స్​మిషన్​ గేర్​బాక్స్​ ఆప్షన్లతో లభిస్తుంది. మార్కెట్లో ఇది మారుతి బాలెనో, హ్యుందాయ్ ఐ20లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. దీని ధర సుమారుగా రూ.6.5 లక్షలు ఉండవచ్చని అంచనా.

3. Mahindra XUV300 Facelift : మహీంద్రా ఎక్స్​యూవీ 300 కారును బహుశా ఈ మార్చి నెలలోనే విడుదల చేసే అవకాశం ఉంది. ఈ మినీ ఎస్​యూవీ ఇప్పటికే చాలా సార్లు ఇండియన్ రోడ్ల మీద కనిపించింది. దీని గ్రిల్స్​, హెడ్​ లైట్స్​, టైల్​ గేట్​లను రీడిజైన్ చేశారు. ముఖ్యంగా రియర్​ సైడ్​లో ఫుల్ విడ్త్​ ఎల్ఈడీ బార్​ను అమర్చారు. క్యాబిన్ విషయానికి వస్తే, డ్యూయెల్ స్క్రీన్ సెటప్​ను ఏర్పాటు చేశారు. ఇందులో ఒకటి ఇన్ఫోటైన్​మెంట్ సెటప్​, మరొకటి ఇన్​స్ట్రుమెంటల్ క్లస్టర్​. ఈ మహీంద్రా ఎక్స్​యూవీ300 ధర బహుశా రూ.9 లక్షల నుంచి రూ.15 లక్షల రేంజ్​లో ఉండవచ్చు. ఇది కనుక మార్కెట్లోకి వస్తే టాటా నెక్సాన్​, కియా సోనెట్​లకు గట్టిపోటీ తప్పదు.

4. New Gen Renault Duster : కొత్త తరం రెనో డస్టర్​ కూడా ఈ 2024 చివరిలోపు ఇండియాలో లాంఛ్ అయ్యే అవకాశం ఉంది. ఇది 5-సీటర్ ఎస్​యూవీ కారు. ఈ డస్టర్​ కారు ఎక్స్​టీరియర్​ డిజైన్​ను, ఇంటీరియర్స్​ను అప్​గ్రేడ్ చేసినట్లు సమాచారం. ఈ కారు టర్బో-పెట్రోల్​ మైల్డ్ హైబ్రీడ్​, పెట్రోల్-ఎల్​పీజీ కాంబో ఆప్షన్లతో, మూడు ఇంజిన్​ వేరియంట్లతో లభిస్తుందని తెలుస్తోంది. ఈ మిడ్​-సైజ్​ ఎస్​యూవీ కారు ధర బహుశా రూ.10 లక్షల వరకు ఉండవచ్చు. ఇదే కనుక మార్కెట్లోకి వస్తే, హ్యుందాయ్​ క్రెటా, కియా సెల్టోస్​లకు గట్టి పోటీ ఖాయం.

5. Tata Curvv : టాటా కర్వ్​ను కూపే డిజైన్​తో స్టాండ్​-అవుట్​ ఎస్​యూవీగా మారుస్తున్నట్లు సమాచారం. ఇది ఈ 2024 డిసెంబర్​లో లాంఛ్ అయ్యే అవకాశం ఉంది. ఈ 5 సీటర్​ కారులో న్యూ 1.2 లీటర్​ టర్బో పెట్రోల్​ ఇంజిన్​ అమరుస్తున్నారు. ఇది మాన్యువల్ ట్రాన్స్​మిషన్​తో అనుసంధానమై ఉంటుంది. మార్కెట్లో ఇది హ్యుందాయ్​ క్రెటా, ఫోక్స్​వ్యాగన్ టైగన్​లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

కొత్తగా కార్​ డ్రైవింగ్​ నేర్చుకుంటున్నారా? ఈ అడ్వాన్స్​డ్​​ సేఫ్టీ ఫీచర్ల గురించి తెలుసుకోండి!

దేశవ్యాప్తంగా పెట్రో ధరల్లో ఏపీ టాప్- పన్నుల బాదుడే కారణం- తెలంగాణ ర్యాంక్ ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.