ETV Bharat / business

'టీసీఎస్ ఉద్యోగులకు లాస్ట్ వార్నింగ్​​ - ఆఫీస్​కు రాకపోతే తీవ్ర పరిణామాలు తప్పవ్​!'

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 7, 2024, 4:18 PM IST

TCS Final Call For Staff To Work From Office : ప్రముఖ దేశీయ ఐటీ కంపెనీ టీసీఎస్ తమ ఉద్యోగులకు ఫైనల్ నోటీస్​ ఇచ్చింది. ఉద్యోగులు మార్చి నెలాఖరు నాటికి కచ్చితంగా ఆఫీస్​కు వచ్చి పనిచేయాలని స్పష్టం చేసింది. లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది.

TCS Final Call For Staff  To Work From Office
TCS Final Call For Employees

TCS Final Call For Staff To Work From Office : దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్​ (టీసీఎస్​) తమ ఉద్యోగులకు ఫైనల్ నోటీస్ ఇచ్చింది. మార్చి నెలాఖరులోగా కచ్చితంగా ఆఫీస్​కు వచ్చి పనిచేయాలని స్పష్టం చేసింది. ఒకవేళ ఎవరైనా ఉద్యోగులు ఆఫీస్​కు వచ్చి పనిచేయకపోతే, తరువాత తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొంది.

"టీసీఎస్ ఉద్యోగులు కచ్చితంగా ఆఫీస్​కు వచ్చి పనిచేయాలి. లేకుంటే తరువాతి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్యోగులు ఇంటి వద్ద నుంచి పనిచేయడం వల్ల పని సంస్కృతి (వర్క్ కల్చర్​) దెబ్బతింటోంది. పైగా అనేక భద్రతాపరమైన సమస్యలు కూడా ఏర్పడుతున్నాయి."
- ఎన్​జీ సుబ్రమణియం, టీసీఎస్​ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్​

సహనం వహిస్తున్నాం - కానీ
'మేము ఉద్యోగుల పట్ల చాలా సహనం వహిస్తున్నాం. ఉద్యోగులు కచ్చితంగా ఆఫీస్​కు వచ్చి పనిచేయాలనే సూత్రప్రాయమైన నిర్ణయం తీసుకున్నాం. మేము ఇప్పటికే ఉద్యోగులకు ఈ విషయంపై ఫైనల్ నోటీస్ ఇచ్చాం. వారు కనుక మేము చెప్పినట్లు చేయకపోతే, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది' అని టీసీఎస్​ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుబ్రమణియం స్పష్టం చేశారు.

సెక్యూరిటీ ఇష్యూస్​
వర్క్ ఫ్రమ్ హోమ్ వలన ఉద్యోగులతోపాటు, యజమానులకు(ఐటీ సంస్థలకు) కూడా చాలా ఇబ్బందికరపరిస్థితి ఏర్పడుతోందని సుబ్రమణియం అభిప్రాయపడ్డారు. 'ముఖ్యంగా నేటి కాలంలో సైబర్ దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇంట్లో ఉండి పనిచేసేవారు ఈ భద్రతాపరమైన సవాళ్లను ఎదుర్కోలేరు. దీని వల్ల సంస్థకు తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడతాయి' అని ఆయన అన్నారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఇన్ఫోసిస్​కు చెందిన యూఎస్ యూనిట్​ సైబర్​ దాడికి గురైంది. ఫలితంగా అనేక అప్లికేషన్లు అందుబాటులో లేకుండా పోయాయి. మరో ఐటీ కంపెనీ హెచ్​సీఎల్ టెక్​ పైనా ర్యాన్సమ్​వేర్ దాడి జరిగింది. అయితే దీని వల్ల ఎలాంటి నష్టం వాటిల్లలేదని హెచ్​సీఎల్ టెక్ తెలిపింది. కానీ ఇది సెక్యూరిటీ లోపాలను స్పష్టంగా ఎత్తిచూపుతోంది.

హైబ్రిడ్ విధానానికి స్వస్తి
కొవిడ్-19 సంక్షోభం సమయంలో టీసీఎస్​ 25బై25 హైబ్రిడ్ విధానాన్ని అమలు చేసింది. కానీ ఇప్పుడు దానికి పూర్తిగా స్వస్తి చెప్పాలని నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీస్​కు వచ్చి పని చేయాలని స్పష్టం చేస్తోంది.

వారంలో మూడు రోజులు మాత్రమే!
టీసీఎస్​ డిసెంబర్ త్రైమాసిక ఫలితాలను జనవరి 11న ప్రకటించింది. అప్పుడే 65 శాతం మంది టీసీఎస్ ఉద్యోగులు వారంలో మూడు రోజులపాటు ఆఫీస్​కు వచ్చి పనిచేస్తున్నారని వెల్లడించింది.

ఉద్యోగ నియమాకాలు తగ్గాయ్​
2020 ఏప్రిల్ నుంచి 2023 అక్టోబర్ మధ్యలో టీసీఎస్ కంపెనీ ఉద్యోగుల సంఖ్య 1,67,000 వరకు పెరిగింది. కానీ ఆ తరువాత ఐటీ రంగం తీవ్రమైన ఒడుదొడుకులు ఎదుర్కొంది. దీనితో ఖర్చులను నియంత్రించుకునేందుకు ఐటీసీ ఉద్యోగ నియామకాలు బాగా తగ్గించింది.

భద్రత - గోప్యత
ఇటీవలి కాలంలో ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను భారీ సంఖ్యలో తొలగిస్తున్నాయి. అయితే ఇది సంస్థల భద్రతకు, గోప్యతకు సంబంధించిన అంశం అని సుబ్రమణియం పేర్కొన్నారు. అంతేకాదు ఉద్యోగులు ఇంటి వద్ద ఉండి పనిచేయడం వల్ల సంస్థకు ఎలాంటి ఉపయోగం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 6,333 మంది, మూడో త్రైమాసికంలో 5,680 మంది ఉద్యోగులు టీసీఎస్ నుంచి వైదొలిగారు. 2008 సంక్షోభం తరువాత ఇదే అత్యధికం కావడం గమనార్హం. అయితే టీసీఎస్ ఇప్పటికే క్యాంపెస్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తూ, కొత్త ఉద్యోగులను నియమించుకుంటూ ఉంది. కానీ విప్రో, ఇన్ఫోసిస్​ లాంటి ఐటీ కంపెనీలు క్యాంపస్ రిక్రూట్​మెంట్లకు ఇంకా దూరంగానే ఉండడం గమనార్హం.

ఎన్నికల వేళ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా? ప్రభుత్వం లెక్క ఇదీ!

పేటీఎంపై ఆర్‌బీఐ ఆంక్షలు - జోక్యం చేసుకోలేమన్న కేంద్రం - కానీ లాభాల్లోకి షేర్లు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.