ETV Bharat / business

దలాల్‌ స్ట్రీట్ ఢమాల్‌ - బేర్‌ దెబ్బకు సెన్సెక్స్ 1272 పాయింట్స్ డౌన్‌ - Stock Market Today - STOCK MARKET TODAY

Stock Market Today
Stock Market Today (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 30, 2024, 9:54 AM IST

Updated : Sep 30, 2024, 4:42 PM IST

Stock Market Today September 30, 2024 : సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వస్తుండడమే ఇందుకు కారణం. దీనికి తోడు ఈ వారంలో ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు ప్రకటించనున్న నేపథ్యంలో మదుపర్లు కాస్త అప్రమత్తత పాటిస్తున్నారు.

ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 540 పాయింట్లు నష్టపోయి 85,025 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 156 పాయింట్లు కోల్పోయి 26,022 వద్ద ట్రేడవుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా స్టీల్‌, టైటాన్‌, ఏసియన్ పెయింట్స్‌, హెచ్‌సీఎల్ టెక్‌, హిందూస్థాన్ యూనిలివర్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎన్‌టీపీసీ
  • నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్​ : టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎం అండ్ ఎం, యాక్సిస్ బ్యాంక్‌, రిలయన్స్‌, ఇండస్‌ఇండ్ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, పవర్‌గ్రిడ్‌, ఎస్‌బీఐ, ఇన్ఫోసిస్‌

రూపాయి విలువ
Rupee Open September 30, 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి విలువ 6 పైసలు తగ్గింది. ప్రస్తుతం అమెరికన్​ డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.75గా ఉంది.

LIVE FEED

4:39 PM, 30 Sep 2024 (IST)

క్లోజింగ్ బెల్‌

Stock Market Close : సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 1.5 శాతం వరకు నష్టపోయాయి. మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు మరింత తీవ్రం అవుతుండడం సహా, జపాన్ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడమే ఇందుకు కారణం. రిలయన్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ లాంటి ఫ్రంట్‌లైన్ స్టాక్స్‌ హెవీ సెల్లింగ్ జరగడం కూడా మార్కెట్ల పతనానికి కారణమైంది.

రికార్డ్ ర్యాలీ తరువాత మదుపరులు లాభాలు స్వీకరించడం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను ఉపసంహరించడం కూడా దేశీయ మార్కెట్లను దెబ్బకొట్టింది. దీనితో బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 1272 పాయింట్లు నష్టపోయి 84,299 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 368 పాయింట్లు కోల్పోయి 25,810 వద్ద ముగిసింది.

  • లాభపడిన షేర్లు : జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎన్‌టీపీసీ, టాటా స్టీల్‌, టైటాన్‌, ఏసియన్ పెయింట్స్
  • నష్టపోయిన షేర్లు : యాక్సిస్ బ్యాంక్‌, రిలయన్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎం అండ్ ఎం, బజాజ్‌ ఫిన్‌సెర్వ్‌, టెక్ మహీంద్రా, మారుతి సుజుకి, ఎస్‌బీఐ, నెస్లే ఇండియా, ఇన్ఫోసిస్‌

ఆసియా మార్కెట్లు
ఏసియన్ మార్కెట్లలో సియోల్, టోక్యోలు భారీగా నష్టపోగా, షాంఘై, హాంకాంగ్‌ లాభాలతో గట్టెక్కాయి. ప్రస్తుతం యూరోపియన్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. శుక్రవారం యూఎస్ మార్కెట్లు మిశ్రమ ఫలితాలతో ముగిసిన విషయం తెలిసిందే.

విదేశీ సంస్థాగత పెట్టుబడులు
స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం, శుక్రవారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.1209.10 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను అమ్మేశారు.

ముడి చమురు ధరలు
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.19 శాతం మేర తగ్గిపోయాయి. దీని ప్రస్తుతం బ్యారెల్ ముడిచమురు ధర 71.84 డాలర్లుగా ఉంది.

3:39 PM, 30 Sep 2024 (IST)

భారీగా నష్టపోయిన ఆటో, బ్యాంక్‌, రియాలిటీ షేర్స్‌

Stock Market Close : సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ప్రధానంగా ఆటో, బ్యాంక్‌, రియాలిటీ షేర్లు భారీగా నష్టపోయాయి. విదేశీ పెట్టుబడులు తరలివెళ్లడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడమే ఇందుకు కారణం.

చివరికి బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 1272 పాయింట్లు నష్టపోయి 84,299 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 368 పాయింట్లు కోల్పోయి 25,810 వద్ద ముగిసింది.

2:25 PM, 30 Sep 2024 (IST)

దలాల్ స్ట్రీట్ ఢమాల్‌

ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 1237 పాయింట్లు నష్టపోయి 84,340 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 365 పాయింట్లు కోల్పోయి 25,813 వద్ద ట్రేడవుతోంది.

ప్రధానంగా బ్యాంకింగ్, ఆటో షేర్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. రిలయన్స్‌, ఎం అండ్ ఎం, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టెక్ మహీంద్రా షేర్లు భారీగా నష్టపోతున్నాయి.

12:55 PM, 30 Sep 2024 (IST)

నిఫ్టీ 288 పాయింట్స్ డౌన్

ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 1006 పాయింట్లు నష్టపోయి 84,565 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 288 పాయింట్లు కోల్పోయి 25,890 వద్ద ట్రేడవుతోంది.

11:27 AM, 30 Sep 2024 (IST)

బేర్ దెబ్బకు స్టాక్ మార్కెట్లు విలవిల

ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 912 పాయింట్లు నష్టపోయి 84,659 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 264 పాయింట్లు కోల్పోయి 25,914 వద్ద ట్రేడవుతోంది. ఎం అండ్ ఎం, రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్ భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

10:11 AM, 30 Sep 2024 (IST)

నిఫ్టీ 180+ పాయింట్స్ డౌన్‌

Stock Market Today September 30, 2024 : దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వస్తుండడం, విదేశీ పెట్టుబడులు తరలివెళ్తుండడమే ఇందుకు కారణం. దీనితోపాటు ఈ వారంలో ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు ప్రకటించనున్న నేపథ్యంలో మదుపర్లు కాస్త అప్రమత్తత పాటిస్తున్నారు.

ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 656 పాయింట్లు నష్టపోయి 84,915 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 187 పాయింట్లు కోల్పోయి 25,991 వద్ద ట్రేడవుతోంది.

ఏసియన్ మార్కెట్లలో సియోల్‌, టోక్యో నష్టాల్లో ట్రేడవుతున్నాయి. షాంఘై, హాంకాంగ్‌ లాభాల్లో కొనసాగుతున్నాయి. శుక్రవారం యూఎస్ మార్కెట్లు మిశ్రమ ఫలితాలతో ముగిసిన విషయం తెలిసిందే.

విదేశీ పెట్టుబడులు
స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం, శుక్రవారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.1,209.10 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు.

ముడిచమురు ధరలు
Brent Crude Oil Prices September 30, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్‌ ధర 0.71 శాతం మేర పెరిగింది. ప్రస్తుతం బ్యారెల్‌ ముడి చమురు ధర 72.49 డాలర్లుగా ఉంది. ఇజ్రాయెల్‌ దూకుడుగా తన ప్రత్యర్థులపై విరుచుకుపడుతోంది. అందువల్ల యుద్ధం ఇప్పట్లో సద్దుమణిగే ఛాయలు కనిపించడం లేదు. కనుక ఇకపై చమురు ధరలు పెరుగొచ్చని అంచనాలు వెలువడుతున్నాయి.

Last Updated : Sep 30, 2024, 4:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.