దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు కూడా రికార్డ్ లాభాలతో ముగిశాయి. ఎర్లీ ట్రేడింగ్లో సెన్సెక్స్, నిఫ్టీలు జీవనకాల గరిష్ఠాలను తాకాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి 384 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ 84,928 వద్ద క్లోజ్ అయింది. 148 పాయింట్ల లాభంతో నిఫ్టీ జీవనకాల గరిష్ఠం 25,939 వద్ద ముగిసింది.
లాభాల్లో ఉన్న షేర్లు
- సెన్సెక్స్ : మహీంద్రా అండ్ మహీంద్రా, ఎస్బీఐ, భారతీ ఎయిల్టెల్, హిందుస్థాన్ యూనిలీవర్, కోటక్ మహీంద్రా మహీంద్రా అండ్ మహీంద్రా
- నిఫ్టీ 50 : బజాజ్ ఆటో, మహీంద్రా అండ్ మహీంద్రా, ఓఎన్జీసీ, హీరో మోటార్ కార్ప్, ఎస్బీఐ లైఫ్
నష్టాల్లో ఉన్న షేర్లు
- సెన్సెక్స్ : ఐసీఐసీఐ బ్యాంకు, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, ఆసియన్ పేయింట్స్, విప్రో
- నిఫ్టీ 50 : ఐషర్ మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, దివిస్ ల్యాబ్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఆసియన్ పేయింట్స్