10.30 AM : ప్రస్తుతం ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 585 పాయింట్లు లాభపడి 79,344 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 179 పాయింట్లు వృద్ధి చెంది 24,235 వద్ద ట్రేడవుతోంది.
Stock Market Today August 6, 2024 : దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. నిన్నటి నష్టాల నుంచి సూచీలు ఆరంభంలోనే బలంగా పుంజుకుంటుండడం విశేషం. ఆసియా- పసిఫిక్ మార్కెట్లలో నెలకొన్న సానుకూలతలు మన సూచీలకు దన్నుగా నిలుస్తున్నాయి. మార్కెట్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 1092 పాయింట్లు, నిఫ్టీ 327 పాయింట్ల మేర లాభపడ్డాయి.
ప్రస్తుతం ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 800 పాయింట్లు లాభపడి 79,571 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 443 పాయింట్లు వృద్ధి చెంది 24,298 వద్ద ట్రేడవుతోంది.
లాభనష్టాలు
సెన్సెక్స్-30 సూచీలో ఒక్క నెస్లే ఇండియా మాత్రమే స్వల్ప నష్టాల్లో ఉంది. టాటా మోటార్స్, మారుతీ, ఎల్ అండ్ టీ, అదానీ పోర్ట్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, ఎం అండ్ ఎం, ఎన్‌టీపీసీ, ఎస్‌బీఐ, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, బజాజ్ ఫిన్‌సర్వ్, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, టీసీఎస్ షేర్లు అత్యధికంగా లాభపడుతున్న జాబితాలో ఉన్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లు
మాంద్యం భయాల నేపథ్యంలో అమెరికా మార్కెట్ సూచీలు సోమవారం మూడు శాతం మేర నష్టపోయాయి. మరోవైపు ఆసియా మార్కెట్లు మాత్రం నిన్నటి భారీ నష్టాల నుంచి నేడు కోలుకున్నాయి. జపాన్ నికాయ్ 8 శాతం, కోస్పీ 3 శాతం, టాపిక్స్ 12 శాతానికి పైగా లాభంలో ఉండడం విశేషం. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ బ్రెంట్ చమురు ధర 77.20 డాలర్ల వద్ద కొనసాగుతోంది. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) సోమవారం నికరంగా రూ.10,074 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) రూ.9,156 కోట్ల వాటాలను కొనుగోలు చేశారు.
రూపాయి విలువ
Rupee Open August 6, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ 25 పైసలు పెరిగింది. US డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రూ.83.85గా ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు!
Petrol And Diesel Prices August 6, 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.39గా ఉంది. డీజిల్ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.27గా ఉంది. డీజిల్ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్ ధర రూ.87.66గా ఉంది.
ముడి చమురు ధర
Crude Oil Prices August 6, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 1.27 శాతం మేర పెరిగాయి. దీనితో ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 77.27 డాలర్లుగా ఉంది.
రూ.2 లక్షల్లో మంచి టూ-వీలర్ కొనాలా? టాప్-10 బైక్స్ & స్కూటర్స్ ఇవే! - Best Bikes Under 2 Lakh