Stock Market Close : సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. యూఎస్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడం, విదేశీ పెట్టుబడులు పెరగడమే ఇందుకు కారణం.
చివరికి బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 611 పాయింట్లు లాభపడి 81,698 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 187 పాయింట్లు పెరిగి 25,010 వద్ద ముగిసింది.
- లాభపడిన షేర్లు : హెచ్‌సీఎల్ టెక్, ఎన్టీపీసీ, బజాజ్ ఫిన్సెర్వ్, టెక్ మహీంద్రా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టైటాన్, ఎం అండ్ ఎం, టాటా స్టీల్, ఎల్ అండ్ టీ, ఐసీఐసీఐ బ్యాంక్
- నష్టపోయిన షేర్లు : అదానీ పోర్ట్స్, కోటక్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, మారుతి సుజుకి, హిందూస్థాన్ యూనిలివర్, సన్‌ఫార్మా, నెస్లే ఇండియా, ఐటీసీ, ఆల్ట్రాటెక్ సిమెంట్
Stock Market Today 26th August 2024 : దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. యూఎస్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వస్తుండడం, విదేశీ పెట్టుబడులు పెరగడమే ఇందుకు కారణం.
ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 538 పాయింట్లు లాభపడి 81,614 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 157 పాయింట్లు వృద్ధి చెంది 24,980 వద్ద ట్రేడవుతోంది.
- లాభాల్లో కొనసాగుతున్న షేర్లు : సెన్సెక్స్-30 సూచీలో టెక్ మహీంద్రా, టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, టైటన్, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, ఎం అండ్ ఎం, టాటా స్టీల్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
- నష్టాల్లో ట్రేడవుతున్న షేర్లు : ఐటీసీ, సన్‌ఫార్మా, మారుతి సుజుకి, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఏషియన్ పెయింట్స్, అదానీ పోర్ట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎల్ అండ్ టీ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లు
సెప్టెంబరులో వడ్డీరేట్ల కోత ఉండే అవకాశం ఉందన్న ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ వ్యాఖ్యల నేపథ్యంలో యూఎస్ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం భారీ లాభాలతో ముగిశాయి. ప్రస్తుతం ఆసియా మార్కెట్లలో హాంకాంగ్ లాభాల్లో కొనసాగుతుండగా, టోక్యో, షాంఘై, సియోల్ అన్నీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
విదేశీ పెట్టుబడులు
విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) శుక్రవారం నికరంగా రూ.1,944 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) సైతం రూ.2,896 కోట్ల విలువైన వాటాలను కొనుగోలు చేశారు.
రూపాయి విలువ
Rupee Open August 26, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ 10 పైసలు పెరిగింది. ప్రస్తుతం అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.80గా ఉంది.
ముడి చమురు ధర
Crude Oil Prices August 26, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.61 శాతం మేర పెరిగాయి. దీనితో ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 79.50 డాలర్లుగా ఉంది.