Stock Market Live Updates Today : ఆసియా మార్కెట్లలలో సానుకూల పననాలు, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, రిలయన్ ఇండస్ట్రీస్ వంటి స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతుతో దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం జీవనకాల గరిష్ఠాన్ని తాకి ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 712 పాయింట్లు లాభపడి 78,053 వద్ద లైఫ్ టైమ్ హై రికార్డ్ వద్ద ముగిసింది. సెన్సెక్స్ 78 వేల మార్కను దాటడం ఇదే తొలిసారి. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 183 పాయింట్లు వృద్ధి చెంది 23,721 వద్ద జీవన కాల గరిష్ఠాలను టచ్ చేసి స్థిరపడింది.
లాభాల్లో ఉన్న షేర్లు : యాక్సిస్ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్సెర్వ్, రిలయన్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్, కొటాక్ బ్యాంకు, సన్ ఫార్మా, ఇండస్ ఇండ్ బ్యాంకు
నష్టాల్లో ఉన్న స్టాక్స్ : బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్ టెల్, టైటాన్, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, ఎన్టీపీసీ, టాటా స్టీల్
గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో మన దేశ కరెంట్ ఖాతా మిగులు 5.7 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇది జీడీపీలో 0.6 శాతానికి సమానమని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) సోమవారం ప్రకటించింది. స్టాక్ మార్కెట్ల లాభాలకు ఇదొక సానుకూల సంకేతంగా పనిచేసిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్ కుమార్ అభిప్రాయపడ్డారు.
లాభాల్లో ఆసియా మార్కెట్లు
ఆసియా మార్కెట్లలో సియోల్, టోక్యో, హాంకాంగ్ లాభాల్లో స్థిరపడగా, షాంఘై నష్టాల్లో ముగిసింది. యూరప్ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి.
ముడిచమురు ధర
అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు 0.44 శాతం మేర తగ్గాయి. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 85.63 డాలర్లుగా ఉంది.