Stock Market Closing Today March 13th 2024 : దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ నష్టాలతో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు- ఒక్కసారిగా భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఒక సమయంలో సెన్సెక్స్ వెయ్యికిపైగా పాయింట్లతో నష్టాల్లో ట్రేడ్ అయింది. చివరకు 900 పాయింట్లకుపైగా నష్టంతో ముగిసింది. నిఫ్టీ 22 వేల దిగువకు చేరింది.
ఉదయం లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ 11 గంటల తర్వాత నష్టాల్లోకి జారుకుంది. ఇంట్రాడేలో 72,515.71 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 906.07 పాయింట్ల నష్టంతో 72,761.89 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 338 పాయింట్లు నష్టంతో 21,997.70 వద్ద స్థిరపడింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.85గా ఉంది.
లాభపడిన, నష్టపోయిన షేర్స్ ఇవే!
సెన్సెక్స్ 30 ప్యాక్‌లో ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా, నెస్లే ఇండియా షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, ఎన్టీపీసీ, టాటా స్టీల్, టాటా మోటార్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ నష్టాలు చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 82.98 డాలర్ల వద్ద, బంగారం ఔన్సు 2,163 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి.
రూ.13 లక్షల కోట్లు ఆవిరి
ముఖ్యంగా రిలయన్స్, ఎన్టీపీసీ, ఎల్‌అండ్‌టీ వంటి ప్రధాన షేర్లలో అమ్మకాలు సూచీలను పడేశాయి. సెబీ చీఫ్ వ్యాఖ్యల నేపథ్యంలో స్మాల్, మిడ్ క్యాప్ షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ సూచీ 5 శాతం, మిడ్‌క్యాప్ సూచీ 4 శాతం చొప్పున నష్టపోయాయి. బీఎస్‌ఈలో మదుపరుల సంపదగా పరిగణించే నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ దాదాపు రూ.13 లక్షల కోట్లు ఆవిరైంది.
సెబీ ఛైర్‌పర్సన్ వ్యాఖ్యల వల్లే!
స్టాక్ మార్కెట్లో పలు చిన్న, మధ్య స్థాయి కంపెనీల షేర్ల ధరలు పెరుగుతూ వస్తున్నాయని, అవి ఏమాత్రం సహేతుకంగా కనిపించడం లేదని మార్కెట్ల నియంత్రణ సంస్థ- సెబీ ఛైర్‌పర్సన్ మాధబి పురి బచ్ ఇటీవల తెలిపారు. ఈ క్రమంలోనే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్స్ స్మాల్‌క్యాప్ సెగ్మెంట్‌లో కొత్త సబ్‌స్క్రిప్షన్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. కొన్ని బ్రోకరేజీ సంస్థలు, ఇన్వెస్టర్లు కూడా సెబీ చీఫ్ వ్యాఖ్యలను సమర్థించడం వల్ల ఆయా స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి కనిపించింది.
స్టాక్ మార్కెట్లో బాగా సంపాదించాలా? డివిడెండ్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయండిలా!
స్మాల్/ మిడ్ క్యాప్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? జర జాగ్రత్త - ఎందుకంటే?