ETV Bharat / business

జీతం పెరిగిందా? ఈ టిప్స్ పాటిస్తే - మీ ఆర్థిక లక్ష్యాలు నెరవేరడం పక్కా! - Salary Management Tips

Salary Management Tips : మీ జీతం పెరిగిందా? అయితే ఇది మీ కోసమే. జీతం పెరిగిన తరువాత చాలా మంది అనవసర ఖర్చులు చేస్తుంటారు. కానీ పెరిగిన జీతాన్ని సరైన పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తే, భవిష్యత్​కు ఆర్థిక భద్రత చేకూరుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అందుకే ఈ ఆర్టికల్​లో పెరిగిన జీతం డబ్బులను ఎలా తెలివిగా మేనేజ్ చేయాలో తెలుసుకుందాం.

Salary Management Tips
Money Management Tips
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 26, 2024, 11:40 AM IST

Salary Management Tips : మీరు ఉద్యోగం చేస్తున్నారా? యాజమాన్యం మీ జీతాన్ని (ఇంక్రిమెంట్​) పెంచిందా? పెరిగిన ఆదాయాన్ని ఎలా మేనేజ్ చేయాలో తెలియడం లేదా? అయితే ఇది మీ కోసమే. ప్రతి ఒక్కరూ భవిష్యత్తు కోసం పొదుపు, మదుపు చేయాలనుకుంటారు. కానీ వారి జీతం ఖర్చులకే అయిపోతూ ఉంటుంది. ఇలాంటి సమయంలో జీతం పెరిగితే, వారి ఆనందానికి హద్దే ఉండదు. అయితే చాలా మంది జీతం పెరగగానే, తాత్కాలిక ఆనందాల కోసం అనవసర ఖర్చులు చేసేస్తూ ఉంటారు. కానీ ఇది సరైన పద్ధతి కాదు. మీ భవిష్యత్తును ఆర్థికంగా భద్రపరచుకోవాలనుకుంటే, ముందుగా పొదుపు, మదుపులు చేయాలి. ఆ తర్వాత మాత్రమే ఖర్చుల గురించి ఆలోచించాలి అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

ఇంక్రిమెంట్ ఫండ్స్‌తో ఏమి చేయాలి?
మీ జీతం పెరిగినప్పుడు లేదా ఇంక్రిమెంట్ వచ్చినప్పుడు, సదరు నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి స్పష్టమైన (బడ్జెట్​) ప్రణాళికను రూపొందించుకోవాలి. సౌకర్యవంతమైన జీవనం కోసం; గృహావసరాలు, కిరాణా సామానులు లాంటి నిత్యావసరాల కోసం కొంత మొత్తాన్ని కేటాయించాలి. ఏవైనా బాకీలు ఉంటే వాటిని చెల్లించేందుకు కొంత మొత్తాన్ని వినియోగించాలి. దీని వల్ల మీపై ఉన్న ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది. భవిష్యత్ ఆర్థిక భద్రత కోసం పొదుపు, పెట్టుబడులకు కొంత మొత్తాన్ని కేటాయించాలి.

ఫండ్స్ ఎలా ఇన్వెస్ట్ చేయాలి?
మీకు వచ్చిన ఇంక్రిమెంట్​లో కొంత భాగాన్ని పెట్టుబడిగా పెట్టాలి. పెరిగిన ఆదాయంలో కనీసం 75 శాతాన్ని పొదుపు పథకాలకు కేటాయించాలి. అనవసరపు ఖర్చులు తగ్గించి ఇంకా ఎక్కువ మొత్తం పొదుపు చేయడానికి ప్రయత్నించాలి. ఇది దీర్ఘకాలంలో మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది. భవిష్యత్​కు భరోసాను ఇస్తుంది.

Salary Management Tips : జీతం పెరిగిన తరువాత, దానిని సరిగ్గా మేనేజ్ చేసుకోవాలి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం

  1. అత్యవసర నిధి : ఊహించని ఖర్చులను, ఆర్థిక అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. కనీసం 3 నుంచి 6 నెలలకు సరిపడా డబ్బులను దగ్గర ఉంచుకోవాలి. అంటే లిక్విడిటీ సమస్య రాకుండా చూసుకోవాలి.
  2. అప్పులు తీర్చాలి : వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డు బిల్లులను సకాలంలో చెల్లించాలి. దీని వల్ల మీపై అధిక వడ్డీల భారం తగ్గుతుంది. పైగా మీ క్రెడిట్ స్కోర్ కూడా పెరుగుతుంది.
  3. పెట్టుబడులు : దీర్ఘకాలిక వృద్ధిని సాధించేందుకు ఈక్విటీలు, ఫిక్స్​డ్ డిపాజిట్లు, రియల్ ఎస్టేట్​, బంగారం లాంటి వివిధ పెట్టుబడి మార్గాల్లో ఇన్వెస్ట్ చేయాలి. అంటే పోర్ట్​ఫోలియో డైవర్సిఫికేషన్ చేసుకోవాలి. దీని వల్ల నష్టభయం తగ్గుతుంది. దీర్ఘకాలంలో మంచి రాబడి లభిస్తుంది.
  4. పదవీ విరమణ ప్రణాళిక : మీ ఆర్థిక భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకోవడానికి ఉద్యోగుల భవిష్య నిధి (EPF), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), నేషనల్ పెన్షన్ సిస్టమ్ ( NPS ) వంటి రిటైర్మెంట్ స్కీమ్​ల్లో పెట్టుబడి పెట్టాలి.
  5. జీవనశైలిలో మార్పులు : జీతం పెరగగానే చాలా మంది తమ లైఫ్ స్టైల్​ను మార్చేస్తుంటారు. లగ్జరీ వస్తువులు కొనుగోలు చేసేస్తూ, అనవసర, ఆడంబర ఖర్చులు పెట్టేస్తూ ఉంటారు. దీని వల్ల భవిష్యత్​లో ఆర్థికంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందువల్ల అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. సౌకర్యవంతంగా జీవిస్తూనే, భవిష్యత్ కోసం పొదుపు, మదుపులు చేస్తుండాలి.

పర్సనల్ లోన్ Vs ఓవర్ డ్రాఫ్ట్ - వీటిలో ఏది బెటర్ ఆప్షన్​! - Personal Loan Vs Overdraft

ఆన్​లైన్ షాపింగ్ తెగ చేస్తుంటారా? ఈ టిప్స్ ఫాలో అయితే మీరెప్పుడూ సేఫ్! - Online Safe Shopping Tips

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.