ETV Bharat / business

కోటక్​ బ్యాంక్​కు RBI షాక్​ - కొత్త అకౌంట్లు, క్రెడిట్​ కార్డ్​లపై బ్యాన్​! - RBI Bars Kotak Mahindra Bank

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 24, 2024, 4:38 PM IST

Updated : Apr 24, 2024, 5:25 PM IST

RBI Bars Kotak Mahindra Bank : రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా కోటక్ మహీంద్రా బ్యాంకుపై ఆంక్షలు విధించింది. కోటక్ మహీంద్రా బ్యాంకు కొత్త క్రెడిట్ కార్డులు జారీ చేయకుండా నిషేధం విధించింది.

RBI bars Kotak Mahindra Bank from issuing fresh credit cards
Kotak Mahindra Bank

RBI Bars Kotak Mahindra Bank : రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా కోటక్ మహీంద్రా బ్యాంకుపై ఆంక్షలు విధించింది. కోటక్ మహీంద్రా బ్యాంకు కొత్త క్రెడిట్ కార్డులు జారీ చేయకుండా నిషేధం విధించింది. అలాగే ఆన్‌లైన్, మొబైల్ బ్యాంకింగ్ విధానాల ద్వారా కూడా కొత్త అకౌంట్లను జారీ చేయవద్దని ఆదేశించింది. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. అయితే కోటక్ బ్యాంక్ ఇప్పటికే ఉన్న క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు, పాత కస్టమర్లకు సేవలను అందించుకోవచ్చని ఆర్​బీఐ తెలిపింది. 2022, 2023 ఏడాదికి సంబంధించి కోటక్ మహీంద్రా బ్యాంకు ఐటీ రిస్క్ మేనేజ్​మెంట్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ గవర్నెన్స్​లో లోపాలు గుర్తించిన ఆర్​బీఐ ఈ కఠిన చర్యలు తీసుకుంది.

ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ గవర్నెన్స్ లోపాలు
"ఐటీ ఇన్వెంటరీ మేనేజ్​మెంట్, ప్యాచ్ అండ్ ఛేంజ్​ మేనేజ్​మెంట్, యూజర్ యాక్సెస్ మేనేజ్​మెంట్, వెండర్ రిస్క్ మేనేజ్​మెంట్, డేటా సెక్యూరిటీ, డేటా లీక్ ప్రివెన్షన్ స్ట్రాటజీ, బిజినెస్ కంటిన్యూటీ, డిజాస్టర్ రికవరీ రిగర్ అండ్ డ్రిల్ మొదలైన అంశాలలో కోటక్ మహీంద్రా బ్యాంకు లోపాలు బయటపడ్డాయి. ముఖ్యంగా కోటక్ మహీంద్రా బ్యాంకు ఐటీ రిస్క్ మేనేజ్​మెంట్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ గవర్నెన్స్​లో లోపాలు ఉన్నాయి" అని ఆర్ బీఐ ప్రకటన విడుదల చేసింది.

గతంలోనూ
ప్రైవేటు రంగ బ్యాంకు కోటక్‌ మహీంద్రా బ్యాంకుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్నాళ్ల క్రితం కొరడా ఝుళిపించింది. రెగ్యులేటరీ నిబంధనలు పాటించనందుకు జరిమానా విధించింది. కోటక్‌ మహీంద్రా బ్యాంకుకు రూ.3.95కోట్లు జరిమానాగా చెల్లించాలని ఆదేశించింది. ఆర్థిక సేవల అవుట్‌ సోర్సింగ్‌లో రిస్క్‌లు, ప్రవర్తన నియమావళి ఉల్లంఘన, రికవరీ ఏజెంట్లు, కస్టమర్‌ సర్వీసుకు సంబంధించి నిర్దేశించిన నిబంధనలు పాటించడంలో విఫలమైనందుకు కోటక్‌ బ్యాంకుకు జరిమానా విధించినట్లు ఆర్‌బీఐ తెలిపింది. రెగ్యులేటరీ నిబంధనలు పాటించనందుకు మాత్రమే కోటక్ బ్యాంకుకు జరిమానా విధించామని, ఖాతాదారుల లావాదేవీలకు ఈ జరిమానాలతో సంబంధం లేదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ఆర్​బీఐ ఇటీవలి కాలంలో పలు బ్యాంకులపై తీవ్రమైన చర్యలు తీసుకుంటోంది. నిబంధనలు ఉల్లఘించిన వాటిపై భారీ జరిమానాలు, ఆంక్షలు విధిస్తోంది.

రోజుకు రూ.50 లక్షల జీతం - హయ్యెస్ట్ పెయిడ్ ఇండియన్​​ సీఈఓ - ఎవరో తెలుసా? - Highest Paid CEOs In India

పర్సనల్ లోన్ Vs ఓవర్ డ్రాఫ్ట్ - వీటిలో ఏది బెటర్ ఆప్షన్​! - Personal Loan Vs Overdraft

Last Updated : Apr 24, 2024, 5:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.