ETV Bharat / business

పోస్టాఫీస్​ సూపర్​ స్కీమ్​ : నెలకు వెయ్యి జమ చేస్తే.. మీ చేతికి ఎంత అమౌంట్​ వస్తుందో తెలుసా? - Post Office Recurring Deposit

RD Scheme: నేటికాలంలో పొదుపు అందరికీ చాలా అవసరం. అందుకే.. పొదుపు చేసేందుకు ఎన్నో పథకాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అలాంటి వాటిల్లో పోస్టాఫీస్ రికరింగ్​ డిపాజిట్​ స్కీమ్ ఒకటి. ఈ పథకంలో కొద్ది కొద్దిగా జమ చేస్తూ ఒకేసారి పెద్ద మొత్తంలో తీసుకోవచ్చు. ఒక వేళ మీరు నెలకు రూ.1000 చొప్పున జమ చేస్తే.. మెచ్యూరిటీ తర్వాత ఎంతొస్తుంది? వడ్డీ ఎంత? అనే వివరాలు తెలుసుకుందాం.

RD Scheme
Post Office Recurring Deposit Scheme (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 29, 2024, 12:33 PM IST

Post Office Recurring Deposit Scheme: ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా.. వచ్చిన ఆదాయంలో కొంత మేర పొదుపు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు నేటి జనరేషన్​. భవిష్యత్తులో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా.. ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడేందుకు వీలుగా పొదుపు చేస్తున్నారు. అయితే మనం సంపాదించిన డబ్బును మదుపు చేసేందుకు అందుబాటులో ఉన్న బెస్ట్​ ఇన్వెస్ట్​మెంట్ స్కీమ్స్​లో ఆర్​డీ(రికరింగ్​ డిపాజిట్​) ఒకటి. ప్రస్తుతం ఈ రికరింగ్​ డిపాజిట్​ స్కీమ్​ను దేశంలోని వివిధ బ్యాంకులతోపాటు ఇండియన్​ పోస్ట్​ ఆఫీస్ కూడా నిర్వహిస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వ హామీ ఉండడంతో బ్యాంకులతో పోలిస్తే పోస్టాఫీసులోనే మదుపు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఈ పథకంలో కొద్ది కొద్దిగా జమ చేస్తూ ఒకేసారి పెద్ద మొత్తంలో తీసుకోవచ్చు. ఒక వేళ మీరు నెలకు రూ.1000 చొప్పున జమ చేస్తే.. మెచ్యూరిటీ తర్వాత ఎంతొస్తుంది? వడ్డీ ఎంత? అనే వివరాలు తెలుసుకుందాం.

రికరింగ్​ డిపాజిట్లు: రికరింగ్​ డిపాజిట్స్​ అనేవి ఓ ప్రత్యేకమైన టర్మ్​ డిపాజిట్లు. అయితే తక్కువ సమయంలో భారీ లాభాలు పొందాలనుకునే వారికి పోస్టాఫీసు రికరింగ్​ డిపాజిట్​ మంచి ఎంపిక. ఈ పథకంలో మీరు నెలా నెలా తమకు నచ్చినంత పొదుపు చేసుకోవచ్చు. ప్రస్తుతం 2024, ఏప్రిల్- జూన్ త్రైమాసికానికి 6.7 శాతం మేర వడ్డీ అందిస్తోంది కేంద్రం. ఈ పథకం మెచ్యూరిటీ వ్యవధి 5 సంవత్సరాలు ఉంటుంది. మెచ్యూరిటీ తర్వాత కావాలనుకుంటే ఈ పథకాన్ని మరో 5 సంవత్సరాలు పొడిగించవచ్చు. కనీసం రూ.100 నుంచి ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్ఠంగా ఎంతైనా పెట్టవచ్చు. దానికి పరిమితి లేదు. అయితే రానున్న త్రైమాసికానికి స్మాల్ సేవింగ్ స్కీమ్స్ వడ్డీ రేట్లు పెంచే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. అది ఇందులో ఇన్వెస్ట్ చేసే వారికి అదనపు ప్రయోజనం కల్పిస్తుంది.

10 ఏళ్లలో చేతికి రూ.17 లక్షలు - పోస్టాఫీసు సూపర్​ స్కీమ్​! - Post Office RD Scheme

నెలకు రూ.1000 జమ చేస్తే ఎంతొస్తుందంటే: పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ అకౌంట్​ ఓపెన్​ చేసి మీరు నెల నెలా రూ.1000 చొప్పున జమ చేస్తున్నారు అనుకుందాం. అంటే రోజుకు రూ.33 మాత్రమే చెల్లించినట్లవుతుంది. ఇక ఆర్‌డీ స్కీమ్ మెచ్యూరిటీ 5 ఏళ్లు ఉంటుంది. ఐదేళ్ల పాటు మీ పెట్టుబడిపై కేంద్రం వడ్డీ చెల్లిస్తుంటుంది. ప్రస్తుతం ఇందులో 6.7 శాతం మేర వడ్డీ లభిస్తోంది. 5 ఏళ్ల పాటు మీరు జమ చేసే డబ్బులు, దానిపై వడ్డీ రూ.71 వేలు అవుతాయి. అంటే 5 ఏళ్ల తర్వాత చేతికి రూ.71 వేలు అందుతాయి. అలాగే మీరు ఈ స్కీమ్​ను మరో 5 ఏళ్ల పాటు నెలకు 1000 రూపాయలు జమ చేస్తూ వెళ్తే పదేళ్ల తర్వాత మీరు జమ చేసే సొమ్ము రూ.1.20 లక్షలు అవుతుంది. దానిపై వడ్డీ దాదాపు రూ. 50 వేల వరకు వస్తుంది. అంటే మీ చేతికి మొత్తంగా రూ.1.70 లక్షల వరకు వస్తాయి. ఐదేళ్లకే డబ్బులు తీసుకుంటే మీకు రూ.11 వేల వడ్డీ వస్తుంది. అదే మీరు ఇంకో పదేళ్లు కొనసాగిస్తే వడ్డీనే రూ.50,800 వరకు వస్తుంది.

ఫిక్స్‌డ్ డిపాజిట్ Vs రికరింగ్ డిపాజిట్ - వీటిలో ఏది బెస్ట్ ఆప్షన్​! - Fixed Deposit Vs Recurring Deposit

పోస్టాఫీస్ నుంచి సూపర్ స్కీమ్-రూ. 10వేలపై ఐదేళ్లలో బ్యాంకుల కంటే ఎక్కువ లాభం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.