ETV Bharat / business

పిచ్ డెక్ Vs బిజినెస్ ప్లాన్ - వీటిలో ప్రజెంటేషన్ కోసం ఏది వాడాలి? - Pitch Deck vs Business Plan - PITCH DECK VS BUSINESS PLAN

Pitch Deck vs Business Plan : యువ ఎంట్రప్రెన్యూర్‌లు తప్పకుండా పిచ్ డెక్, బిజినెస్ ప్లాన్ గురించి తెలుసుకొని ఉండాలి. ఈ రెండింటిని ఏయే సందర్భాల్లో ఉపయోగించాలో ఈ ఆర్టికల్​ ద్వారా తెలుసుకుందాం.

Pitch Deck vs Business Plan
Pitch Deck vs Business Plan (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 12, 2024, 10:11 AM IST

How to Explain Business Plan Strategy : కొత్తగా స్టార్టప్ పెట్టిన వారైనా, సీరియల్ స్టార్టప్‌లు నెలకొల్పి తలపండిన వారైనా సరే, కొన్ని బేసిక్స్‌ గురించి తప్పకుండా తెలుసుకోవాలి. పిచ్ డెక్‌కు, బిజినెస్ ప్లాన్‌కు తేడా ఏమిటనే దానిపై అవగాహన కలిగి ఉండాలి. వీటిలో ఏది ముందుగా అందుబాటులోకి వచ్చిందో తెలిసి ఉండాలి. బిజినెస్ ప్లాన్ కంటే పిచ్ డెక్‌ను వినియోగించేందుకు ఎందుకు ప్రయారిటీ ఇవ్వాలనే సమాచారం కూడా సగటు ఎంట్రప్రెన్యూర్‌కు తెలియాలి.

బిజినెస్ ప్లాన్లు కాలం చెల్లిన పద్ధతా? పిచ్ డెక్ కూడా బిజినెస్ ప్లాన్ లాంటిదేనా? స్టార్టప్‌లకు వీటిలో ఏది బెటర్? ఏయే అవసరాలకు వీటిని వాడొచ్చు? అనే ముఖ్యమైన ప్రశ్నలకు స్టార్టప్‌ల నిర్వాహకుల వద్ద సమాధానాలు ఉండాలి. కంపెనీ పురోగతిపై మీరు ఫోకస్ చేస్తున్న తరుణంలో మీ వద్ద తక్కువ టైం ఉంటుంది. అలాంటప్పుడు మీ వ్యాపార ప్రణాళికల ప్రజెంటేషన్ల కోసం ఒక మంచిటూల్ రెడీగా ఉండాలి. పిచ్ డెక్, బిజినెస్ ప్లాన్ గురించి ఈ కథనంలో మనం తెలుసుకుందాం.

బిజినెస్ పిచ్ డెక్

  • పిచ్ డెక్‌ అనేది వ్యాపారం లేదా ఏదైనా ప్రాజెక్టు గురించి ప్రజెంట్ చేసే డిజిటల్ పద్ధతి.
  • ఈ పద్ధతిలో మనకు 10 నుంచి 20 స్లైడ్‌లు అందుబాటులో ఉంటాయి.
  • పిచ్ డెక్ ప్రజెంటేషన్‌ను మనం ఇన్వెస్టర్లకు పీడీఎఫ్ రూపంలో కూడా పంపొచ్చు. దాన్ని ఇన్వెస్టర్లు చూసి మన సంస్థలో పెట్టుబడి పెట్టే అంశంపై ఒక నిర్ణయానికి వస్తారు. వాళ్లను ఇంప్రెస్ చేసేలా స్లైడ్‌లు తయారుచేయించాలి.
  • పిచ్ డెక్‌ ద్వారా తయారుచేసిన ప్రాజెక్టును ఇన్వెస్టర్లు లేదా ఆడియన్స్‌కు లైవ్ ప్రజెంటేషన్‌ ఇచ్చే సమయంలో కూడా వాడొచ్చు.
  • కంపెనీ ఏ కార్యకలాపాలు నిర్వహిస్తుంది? ఎందుకు ఆ రంగంలో కంపెనీ పనిచేస్తోంది? మార్కెట్ సైజ్ ఎంత? మార్కెట్‌లో కంపెనీ రాణించేందుకు ఉన్న అవకాశాలు ఏమిటి? భవిష్యత్తులో కంపెనీ పురోగతికి అనుకూలించే సానుకూల అంశాలు ఏమిటి? అనే వివరాలతో పిచ్ డెక్‌లో స్లైడ్‌లు తయారు చేయించాలి.
  • ఈ అంశాలను చూసి ఇన్వెస్టర్లు మన కంపెనీ ఎటువైపుగా పయనిస్తోంది అనే అంశంపై క్లారిటీకి వస్తారు. వారికి ఉన్న సందేహాలు తొలగిపోతాయి.
  • పిచ్ డెక్ ప్రజెంటేషన్‌ను ఇన్వెస్టర్‌కు పంపి వారికి కంపెనీపై ఒక పాజిటివ్ ఒపీనియన్‌ను క్రియేట్ చేయొచ్చు. అనంతరం ఆ ఇన్వెస్టర్‌తో వ్యక్తిగత సమావేశం కోసం అపాయింట్‌మెంట్‌ను పొందొచ్చు. చివరగా ఫండింగ్‌ను సాధించొచ్చు.

బిజినెస్ ప్లాన్

  • బిజినెస్ ప్లాన్ అనేది వివరమైంది. దీని తయారీలో భాగంగా బిజినెస్‌పై పూర్తి రీసెర్చ్ చేసి 10 నుంచి 100 పేజీల డాక్యుమెంటును తయారు చేస్తారు.
  • బిజినెస్ ప్లాన్ డాక్యుమెంట్‌లో వచ్చే 1, 3, 5 ఏళ్లలో కంపెనీ ఏమేం చేయబోతోంది? వ్యాపార వ్యూహం ఏమిటి? మార్కెట్ అవకాశాలు ఏమిటి? పోటీదారులు ఎవరు? అనే అంశాలపై వివరణ ఉంటుంది.
  • బిజినెస్ ప్లాన్‌లో సేల్స్, మార్కెటింగ్, నిర్వహణపరమైన ప్రణాళికలు, ఆర్థిక స్థితిగతుల గురించి స్పష్టంగా వివరిస్తారు.
  • కంపెనీలోని మేనేజ్‌మెంట్ టీమ్, వారి నైపుణ్యాలు, కంపెనీ వికాసం కోసం వారు చేస్తున్న కసరత్తు గురించి కూడా బిజినెస్ ప్లాన్‌లో వివరిస్తారు.
  • ఈ డాక్యుమెంటులో కొన్ని ఛార్ట్‌లు, ఫొటోలు కూడా ఉంటాయి. అయితే టెక్ట్స్ చాలా ఎక్కువగా ఉంటుంది.
  • కంపెనీలో పెట్టుబడి పెట్టాలా? వద్దా? అనే అంశంపై ఒక నిర్ణయానికి రావడంలో సంకోచిస్తున్న ఇన్వెస్టర్లకు ఈ తరహా సవివరమైన డాక్యుమెంటును అందిస్తుంటారు.
  • తాము అందించే పెట్టుబడులను కంపెనీ ఎలా వినియోగించగలదు అనే దానిపై ఇన్వెస్టర్లు స్పష్టమైన అవగాహనకు రావడానికి బిజినెస్ ప్లాన్ డాక్యుమెంట్ పనికొస్తుంది.

బిజినెస్ ప్లాన్‌కే బ్యాంకుల ప్రయారిటీ
పిచ్ డెక్‌తో పోలిస్తే బిజినెస్ ప్లాన్ అనేది చాలా పాత ప్రజెంటేషన్ పద్ధతి. అయినా నేటికీ దానికి మంచి విలువ ఉంది. బ్యాంకులు కంపెనీలకు లోన్‌లు మంజూరు చేసే క్రమంలో బిజినెస్ ప్లాన్‌ను ఇవ్వాలని అడుగుతున్నాయి. కొన్ని బ్యాంకులు పిచ్ డెక్ ప్రజెంటేషన్‌తో సరిపెడుతున్నాయి. అయితే నేటికీ బ్యాంకులు లోన్ల ప్రాసెసింగ్ కోసం బిజినెస్ ప్లాన్లకే ప్రయారిటీ ఇస్తున్నాయి. ఎందుకంటే వాటిలో వ్యాపారంతో ముడిపడిన వివరాలు సమగ్రంగా ఉంటాయి. కో ఫౌండర్స్, కో ఓనర్స్ కలిగిన సంస్థలు తప్పకుండా బిజినెస్ ప్లాన్ తయారీకే మొగ్గుచూపాలి. దీనివల్ల వ్యాపార భాగస్వాములంతా రాతపూర్వక ప్రతులు చదువుకొని వ్యాపార లక్ష్యాలపై స్పష్టతకు వస్తారు.

వెంచర్ క్యాపిటలిస్టుల ప్రాధాన్యత పిచ్ డెక్‌కే
వెంచర్ క్యాపిటలిస్టులు, ఏంజెల్ ఇన్వెస్టర్లు చాలా బిజీగా ఉంటారు. వారికి బిజినెస్ ప్లాన్లను చదివే తీరిక ఉండదు. అందుకే వారు పిచ్ డెక్ ప్రజెంటేషన్‌ను పంపమని స్టార్టప్‌లకు సలహా ఇస్తుంటారు. బిజినెస్ ప్లాన్‌‌ను తీసుకోవడంతో పాటు, అందులోని ప్రధాన అంశాలను సంక్షిప్తంగా చేసి పిచ్ డెక్ ప్రజెంటేషన్‌ను ఇవ్వమని వెంచర్ క్యాపిటలిస్టులు, ఏంజెల్ ఇన్వెస్టర్లు కోరుతుంటారు. మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ రూపంలో వ్యాపార ప్రణాళికలను ఇవ్వమని ఈ తరహా ఇన్వెస్టర్లు అడుగుతుంటారు. ఏంజెల్ ఇన్వెస్టర్ల నెట్‌వర్క్‌ను సంప్రదించే వారికి కూడా పిచ్ డెక్ ప్రజెంటేషన్ అనేది బెస్ట్ ఆప్షన్.

మీకు బ్యాంకు సేవింగ్స్ అకౌంట్ ఉందా? అయితే ఈ జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి! - Bank savings account

మీ దగ్గర చాలా సేవింగ్స్ అకౌంట్లు ఉన్నాయా? ఈ 7 టిప్స్ మీ కోసమే! - Savings Account Manage Tips

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.