ETV Bharat / business

కొత్తగా లోన్​ తీసుకుంటున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 29, 2024, 11:03 AM IST

Personal Loan Precautions: తక్షణ ఆర్థిక అవసరాల నుంచి బయటపడటానికి చాలా మంది వ్యక్తిగత రుణాలు తీసుకుంటుంటారు. క్షణాల్లో అందుతున్న ఈ రుణాలు చాలామందికి ఆర్థిక భరోసానిస్తున్నాయి. అయితే కొత్తగా రుణాలు తీసుకునే వారు తెలియకుండా కొన్ని సార్లు అవసరానికి మించి తీసుకుంటారు. దీనివల్ల వడ్డీ భారం పెరుగుతుంది. అందుకే కొత్తగా వీటిని తీసుకునేవారు ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే? అవేంటో ఓ సారి చూద్దాం.

Personal Loan Precautions
Personal Loan Precautions

Personal Loan Precautions : ఆర్థిక అవసరాలు, అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి వ్యక్తిగత రుణాలు తీసుకుంటున్నారు. దీనికి తోడు రుణాలు కూడా తర్వగా రావటం వల్ల ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఉంటోంది. దీంతో కొత్త వారు కూడా రుణాలపై ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈ రుణాలు తీసుకునేటప్పుడు ఈ విషయాలపై అవగాహన కలిగి ఉండాలి.

కచ్చితమైన సమాచారం అక్కడే చూడాలి
వ్యక్తిగత రుణం, క్రెడిట్‌ కార్డు ఏదైనా సరే కొత్తగా తీసుకునేటప్పుడు వాటి గురించి తెలుసుకునేందుకు ప్రయత్నించాలి. అలానే క్రెడిట్‌ స్కోరు, వడ్డీ రేటు, తిరిగి చెల్లించే విధానం, జరిమానాలు, రుసుముల్లాంటి ప్రాథమిక అంశాలపై అవగాహన కలిగి ఉండాలి. అందుబాటులో ఉన్న విభిన్న రకాల రుణాల గురించి తెలుసుకోవాలి. వాటి ప్రయోజనాలు, క్రెడిట్‌ స్కోరుపై చూపించే ప్రభావాన్ని విశ్లేషించండి. వీటి గురించి సమాచారన్ని అందించే పత్రికలను చదవడం అలవాటు చేసుకోవాలి. ఆన్‌లైన్‌లోనూ కూడా పేరున్న వెబ్‌సైట్లను మాత్రమే చూడాలి. మీకు పూర్తి విషయ పరిజ్ఞానం ఉన్నప్పుడే సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవచ్చు.

మెరుగైన క్రెడిట్ స్కోరు
బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణం ఇచ్చేటప్పుడు అతడి అర్హతలను గురించి తెలుసుకునేందుకు ప్రధానంగా క్రెడిట్‌ స్కోరుపై ఆధారపడతాయి. కొత్తగా రుణాలను తీసుకునే వారికి ఈ స్కోరు ఉండకపోవచ్చు. కానీ, దీన్ని సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. ప్రాథమిక స్థాయిలో తక్కువ పరిమితితో క్రెడిట్‌ కార్డులను తీసుకునే ప్రయత్నం చేయాలి. వినియోగ వస్తువుల కొనుగోలు కోసం చిన్న రుణాలను తీసుకోవటం. బిల్లు, వాయిదాలు సకాలంలో చెల్లించడం ద్వారా మంచి రుణ స్కోరును సాధించవచ్చు. ఇదే భవిష్యత్తులో పెద్ద రుణాలు తీసుకునేందుకు పునాదిగా ఉపయోగపడుతుంది. స్కోరు పెరుగుతున్న కొద్దీ వివిధ రకాల రుణాలు అందుబాటులోకి వస్తుంటాయి.

అవసరాన్ని అంచనా వేయాలి
ముఖ్యంగా కొత్తగా రుణం తీసుకునే వారు ఎంత మేరకు తీసుకోవాలన్న విషయంలో గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటారు. అవసరానికి మించి బ్యాంకులు రుణం ఇస్తామని అంటాయి. దీంతో చాలా సందర్భాల్లో కొత్త రుణగ్రహీతలు అవసరం లేకపోయినా అధిక రుణాన్ని తీసుకుంటుంటారు. అనవసరంగా వడ్డీ భారంతో ఇబ్బందులు పడుతుంటారు. ఆ రుణాన్ని సరిగా వినియోగించకపోతే అదనపు ఇబ్బందులను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. రుణం తీసుకునేటప్పుడు బాగా ఆలోచించి వ్యవహరించాలి. ఆదాయం, నెలవారీ ఖర్చులతో సమగ్ర బడ్జెట్‌ను రూపొందించుకోవాలి. ఎంత మేరకు ఈఎంఐ కట్టగలము అనేది చూసుకోవాలి. అధిక రుణం అందుబాటులో ఉన్నప్పటికీ అవసరం మేరకే తీసుకోవడం మంచిది.

తనిఖీ చేసుకోవాలి
ప్రస్తుతం ఆర్థిక ప్రయాణంలో క్రెడిట్‌ స్కోరు కీలక పాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలో స్కోరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం చాలా ముఖ్యం. క్రెడిట్‌ స్కోరులో ఏమైనా వ్యత్యాసాలుంటే గుర్తించడం సులభమవుతుంది. అలానే మోసపూరిత, అనధికార రుణాలున్నా తెలుసుకునేందుకు వీలువుతుంది. ఒకవేళ అలాంటివి ఏమైనా ఉంటే వెంటనే వాటిపై ఫిర్యాదు చేసి, వాటిని సరిదిద్దుకునే ప్రయత్నాలు చేయొచ్చు. క్రెడిట్‌ బ్యూరో వెబ్‌సైట్లలో క్రెడిట్‌ నివేదికలను క్రమం తప్పకుండా పర్యవేక్షించుకోవచ్చు. కొన్ని క్రెడిట్‌ బ్యూరోలు వాట్సాప్‌లోనూ క్రమం తప్పకుండా నివేదికలను పంపిస్తున్నాయి. మంచి క్రెడిట్‌ స్కోరున్నప్పుడు తక్కువ వడ్డీ రేట్లకే రుణాలు తీసుకునే అవకాశం ఉంటుంది.

సంపాదన ప్రారంభమైన తర్వాత కొత్తగా రుణం తీసుకోవడం చాలా కష్టంగా అనిపిస్తుంది. కానీ, వాటిపై అవగాహన ఉంటే సులభంగా రుణం తీసుకునేందుకు మార్గాలు తెలుస్తాయి. పూర్తి సమాచారంతో నిర్ణయాలు తీసుకోవాలి. గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే రుణాలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అప్పు తీసుకునేటప్పుడు తొందరపడ్డా, చిన్న పొరపాటు చేసినా అధిక వడ్డీ భారం మోయాల్సిందే. అలానే సకాలంలో వాయిదాలు చెల్లించకపోతే భవిష్యత్తులో కొత్త అప్పులు తీసుకోవడమూ కష్టంగా మారుతుంది.

కార్ ఇన్సూరెన్స్​ ప్రొవైడర్​ను మార్చాలా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? ఈ బెనిఫిట్ల గురించి తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.