Mutual Funds New Schemes : మ్యూచువల్ ఫండ్స్- ఈ మధ్యకాలంలో దాదాపు ప్రతిఒక్కరికి సుపరిచతమైన పదం. ప్రస్తుత రోజుల్లో చేస్తున్న ఉద్యోగం, వ్యాపారం నుంచి వచ్చే సంపాదనే కాకుండా ఇతర మార్గాల ద్వారా కూడా ఆదాయాన్ని ఆర్జించేందుకు చూస్తున్నారు చాలామంది. ఇందుకోసం అనేక ఆదాయ వనరులను అన్వేషిస్తున్నారు. మరి ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్‌లో మ్యుచువల్ ఫండ్స్ ఒకటి. స్టాక్ మార్కెట్లతో పాటు వీటిల్లోనూ మదుపు చేసేందుకు చాలామంది ఆసక్తి కనబురుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు సరికొత్త పథకాలతో మదుపరులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి సదరు మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు. మరి తాజాగా ఏయే కంపెనీలు ఏయే స్కీమ్స్ ఇన్వెస్టర్లకు అందిస్తున్నాయో, వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
వైట్‌వోక్ క్యాపిటల్
వైట్‌వోక్ క్యాపిటల్ మ్యూచువల్ ఫండ్ సంస్థ ఏకంగా రెండు కొత్త పథకాలను మదుపరుల కోసం అందుబాటులోకి తెచ్చింది. అవి..
- వైట్‌వోక్ క్యాపిటల్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్
- వైట్‌వోక్ క్యాపిటల్ ఫార్మా అండ్ హెల్త్ కేర్ ఫండ్.
- ఈ రెండు పథకాలు థీమ్యాటిక్ క్లాస్‌కు చెందిన ఓపెన్ ఎండెడ్ స్కీమ్స్.
- వీటి ఎన్‌ఎఫ్‌ఓ (న్యూ ఫండ్ ఆఫర్) ముగింపు తేదీ ఈనెల 30తో ముగియనుంది.
- బ్యాంకింగ్ ఫండ్‌లో కనీస పెట్టుబడి రూ.100.
- హెల్త్‌కేర్ ఫండ్‌లో కనీస పెట్టుబడి రూ.500.
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ కూడా ఇన్వెస్టర్ల కోసం ఒక ఇండెక్స్ ఫండ్‌ను లాంఛ్ చేసింది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ నిఫ్టీ 50 వాల్యూ ఇండెక్స్ ఫండ్ పేరుతో దీనిని ప్రారంభించింది.
- ఈ స్కీమ్ ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ జనవరి 29.
- దీంట్లో కనీస పెట్టుబడిగా రూ.100ను నిర్ణయించారు.
- నిఫ్టీ 50 వాల్యూ 20 ఇండెక్స్‌తో ఈ పథకానికి సంబంధించిన పనితీరును అంచనా వేస్తారు.
- ఈ సూచీలోని బ్లూచిప్ కంపెనీలపైనే ప్రధానంగా ఈ స్కీమ్ ఇన్వెస్ట్ చేస్తుంది.
- రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయ్డ్ (ఆర్‌ఓసీఈ), పీఈ రేషియో, ప్రైస్ టు బుక్ వ్యాల్యూ రేషియో, డివిడెండ్ ఈల్డ్ సహా వివిధ ప్రమాణాలను పరిశీలించి ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియోను తయారు చేస్తారు.
బంధన్ మ్యూచువల్
బంధన్ మల్టీ అసెట్ అలకేషన్ ఫండ్ అనే పేరుతో సరికొత్త పథకాన్ని తీసుకొచ్చింది బంధన్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ.
- దీని ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ ఈనెల 24.
- ఈ స్కీమ్ కింద కనీస పెట్టుబడి రూ.1,000గా ఉంది.
- ఈక్విటీ, రుణ పత్రాలు, బంగారం, వెండి తదితరాలకు చెందిన పెట్టుబడి పత్రాలపై ఈ పథకం ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది.
- ఈ స్కీమ్ ప్రధాన ఉద్దేశం తక్కువ రిస్కుతో స్థిరమైన లాభాలను ఆర్జించడం.
ప్రభుత్వ బ్యాంకుల్లోనే పెట్టుబడులు
హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్ నుంచి ఎక్స్ఛేంజ్‌ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్) పేరుతో కొత్త పథకం అందుబాటులోకి వచ్చింది.
- హెచ్‌డీఎఫ్‌సీ నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఈటీఎఫ్ అనే ఈ స్కీమ్ ఎన్‌ఎఫ్‌ఓ చివరితేదీ తేదీ జనవరి 23.
- ఎన్‌ఎఫ్‌ఓలో దీని కనీస పెట్టుబడి రూ.500.
- దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి ఈ స్కీమ్ ఎంతో ఉత్తమం.
- హెచ్‌డీఎఫ్‌సీ నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్‌తో ఈ పథకం పనితీరును పోల్చి చూస్తారు.
- ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకులపై ఈ పథకం పెట్టుబడులు పెడుతుంది.
మిరే అసెట్ మల్టీ అసెట్ అలకేషన్ స్కీమ్
మిరే అసెట్ మ్యూచువల్ ఫండ్ సంస్థ కొత్త మల్టీ అసెట్ ఫండ్‌ను ప్రారంభించింది. మిరే అసెట్ మల్టీ అసెట్ అలకేషన్ పేరుతో దీనిని ఆవిష్కరించింది. ఇది హైబ్రిడ్ క్లాస్‌కు చెందిన పథకం. ఈక్విటీ షేర్లతోపాటు, రుణ పత్రాలు, బంగారం-వెండి ఈటీఎఫ్‌లు, ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ కమొడిటీ డెరివేటివ్స్‌లలో పెట్టుబడులు పెట్టి, లాభాలు ఆర్జించే లక్ష్యంతో ఈ పథకాన్ని తీసుకొచ్చారు.
- ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ ఈనెల 24.
- దీని ఎన్‌ఎఫ్‌ఓలో కనీసం రూ.5,000 పెట్టుబడి పెట్టాలి.
- విభిన్నమైన పెట్టుబడి పత్రాలపై పెట్టుబడులు ఉండాలనుకునే ఇన్వెస్టర్లకు ఈ మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌ను బెస్ట్ ఆప్షన్‌గా సిఫార్సు చేయవచ్చు.
ఎస్‌బీఐ నిఫ్టీ 50
ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్- నిఫ్టీ 50లోని స్టాక్స్‌పై ఇన్వెస్ట్ చేసి, లాభాలు ఆర్జించే సరికొత్త ఇండెక్స్ ఫండ్‌ను రూపొందించింది. ఎస్‌బీఐ నిఫ్టీ 50 ఈక్వల్ వెయిట్ ఇండెక్స్ ఫండ్ పేరుతో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఇది ఇండెక్స్ క్లాస్‌కు చెందిన ఓపెన్ ఎండెడ్ స్కీమ్. లార్జ్‌క్యాప్ షేర్లతో పోర్ట్‌ఫోలియో ఉంటుంది.
- ఈ స్కీమ్ ముగింపు తేదీ జనవరి 29. కనీస పెట్టుబడి రూ.5,000.
- ఇందులో దీర్ఘకాలంలో నష్టపోతామనే భయం తక్కువగా ఉంటుంది.
మోతీలాల్ ఓస్వాల్ లార్జ్ క్యాప్ ఫండ్
ఒక లార్జ్ క్యాప్ ఫండ్ కొత్తగా మోతీలాల్ ఓస్వాల్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ నుంచి అందుబాటులోకి వచ్చింది. మోతీలాల్ ఓస్వాల్ లార్జ్ క్యాప్ ఫండ్ అనే పేరుతో ఈ పథకాన్ని రూపొందించారు. ఇది కూడా ఓపెన్ ఎండెడ్ పథకం.
- ఈ స్కీమ్ ప్రధానంగా పెద్ద కంపెనీలపైన మాత్రమే ఇన్వెస్ట్ చేస్తుంది.
- దీని ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ జనవరి 31.
- ఈ మ్యూచువల్ ఫండ్ పథకం పోర్ట్‌ఫోలియోలో 80 శాతం వరకూ 'నిఫ్టీ 100 లార్జ్ క్యాప్' సంస్థలే ఉంటాయి.
- మిగిలిన 20 శాతం కోసం మిడ్/ స్మాల్ క్యాప్ క్లాస్‌లకు చెందిన కంపెనీలను పరిగణనలోకి తీసుకుంటారు.
సిబిల్ స్కోర్ పెరగాలా? ఈ టాప్-5 టిప్స్ పాటించండి!
ఫైనాన్స్‌లో కారు కొనేటప్పుడు చేసే పొరపాట్లు ఇవే - ఆర్థికంగా చాలా నష్టం!