Maruti Suzuki Cuts Prices : కార్ లవర్స్ అందరికీ గుడ్ న్యూస్. దేశంలోని అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీ అయిన మారుతి సుజుకి ఆల్టో కే10, ఎస్-ప్రెసో మోడళ్లలోని కొన్ని వేరియంట్ల ధరలను తగ్గించినట్లు సోమవారం వెల్లడించింది. కొత్త ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.
1. Maruti Suzuki S-Presso Price Cut : ఎస్-ప్రెస్సో LXI పెట్రోల్ వేరియంట్ కారు ధరను రూ.2,000 వరకు తగ్గించినట్లు మారుతి సుజుకి తెలిపింది. ప్రస్తుతం ఎస్-ప్రెస్సో కారు ధర రూ.4.26 లక్షల నుంచి రూ.6.11 లక్షల (ఎక్స్‌షోరూం, దిల్లీ) మధ్య కొనసాగుతోంది.
Maruti Suzuki S-Presso Features : మారుతి సుజుకి ఎస్-ప్రెస్సోలో చాలా వేరియంట్లు ఉన్నాయి. వాటిలో స్టాండర్డ్ వేరియంట్ మాత్రమే రూ.5 లక్షల బడ్జెట్లో లభిస్తుంది. మిగతా వాటి ధర చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ స్టాండర్డ్ ఎస్-ప్రెస్సో కారులో కూడా ఆల్టో కె10లో ఉన్న 1.0 లీటర్ కె10సీ ఇంజినే ఉంటుంది.
2. Maruti Suzuki Alto K10 Price Cut : ఆల్టో కే10 VXI పెట్రోల్ వేరియంట్ కారు ధరను రూ.6,500 వరకు తగ్గించినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో మారుతి సుజుకి వెల్లడించింది. ప్రస్తుతం ఆల్టో కే10 ధర రూ.3.99 లక్షల నుంచి రూ.5.96 లక్షల ప్రైస్ రేంజ్లో ఉంది.
Maruti Suzuki Alto K10 Features : ఇండియాలో లభిస్తున్న అత్యంత సరసమైన కార్లలో మారుతి సుజుకి ఆల్టో కే10 ఒకటి. ఆల్టో 800ని పూర్తిగా నిలిపివేయడం వల్ల ప్రస్తుతం ఇండియాలో ఆల్టో కే10 మాత్రమే లభిస్తోంది. ఈ కారు రెండు వేరియంట్లలో లభిస్తుంది. అవి - స్టాండర్డ్ (Std), బేసిక్ పెట్రల్ (Lxi) వేరియంట్లు. ఈ ఆల్టో కే10 కారులో 1.0 లీటర్ కె10సీ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 67 పీఎస్ పవర్, 89 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. దీనికి అనుసంధానంగా 5-స్పీడ్ ఎమ్టీ గేర్‌బాక్స్ ఉంటుంది. రూ.5 లక్షల బడ్జెట్లో మంచి కారు కొనాలని అనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది.
తగ్గిన విక్రయాలు
మారుతి సుజుకి కంపెనీ ఆగస్టులో 10,648 యూనిట్ల వరకు ఆల్టో, ఎస్-ప్రెస్సో కార్లను విక్రయించింది. గతేడాది ఈ సంఖ్య 12,209గా ఉంది.