ETV Bharat / business

మారుతి కార్​ కొనాలా? ఆ మోడల్​ కోసం 4 నెలలు వేచిచూడాల్సిందే! - Maruti Invicto Waiting Period

Maruti Suzuki Cars Waiting Period 2024 : మీరు మారుతి సుజుకి ఫ్రాంక్స్​, గ్రాండ్ విటారా, ఇన్విక్టో కార్లను బుక్​ చేసుకున్నారా? అయితే మీరు డెలివరీ కోసం కనీసం 4 నెలలపాటు వెయిట్​ చేయాల్సి ఉంటుంది. అది ఎందుకో ఇప్పుడు చూద్దాం.

Maruti cars Waiting Period 2024
Maruti Suzuki cars Waiting Period 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 21, 2024, 1:24 PM IST

Maruti Suzuki Cars Waiting Period 2024 : దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి తమ కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త మోడళ్లను పరిచయం చేస్తుంటుంది. అలాగే తమ కార్లను వీలైనంత త్వరగా కస్టమర్లకు డెలివరీ చేస్తుంటుంది. అయితే సాధారణంగా వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా కార్లను రూపొందించి, వాటిని డెలివరీ చేయడానికి కాస్త సమయం పడుతుంది. అందుకే ఏయే మారుతి కార్లకు ఎంతెంత వెయిటింగ్ పీరియడ్ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

Maruti Suzuki Fronx Waiting Period : మారుతి సుజుకి 2023 ఆటో ఎక్స్​పోలో ఫ్రాంక్స్​ కారును ప్రదర్శించింది. దీనిని 2023 ఏప్రిల్​లో లాంఛ్ కూడా చేసింది. ఈ 5 సీటర్​ కాంపాక్ట్ ఎస్​యూవీ కారుకు ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తోంది. అది ఎంతలా అంటే, లాంఛ్ అయిన కేవలం 10 నెలల్లోనే ఒక లక్ష ఫ్రాంక్స్ కార్లు సేల్ అయ్యాయి.

ఈ మారుతి సుజుకి ఫ్రాంక్స్​ కారు 1.0 లీటర్ బూస్టర్​జెట్​ టర్బో త్రీ-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్​, సీఎన్​జీ ఇంజిన్ వేరియంట్లలో లభిస్తుంది. ఈ కారు బేస్​ మోడల్ ధర రూ.7.47 లక్షల వరకు ఉంటుంది. దీనిలోని హై-ఎండ్ మోడల్ ధర రూ.13.14 లక్షలు (ఎక్స్​-షోరూం) వరకు ఉంటుంది.

ప్రస్తుతానికి మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఎంట్రీ-లెవల్​ సిగ్మా సీఎన్​జీ వేరియంట్ కోసం 3-4 నెలలు వెయిట్​ చేయాల్సి వస్తోంది. మిగతా వేరియంట్లు అన్నీ దాదాపు డెలివరీకి సిద్ధంగానే ఉన్నాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Maruti Suzuki Grand Vitara : మారుతి సుజుకి కంపెనీ రూపొందించిన ఈ మిడ్​ సైజ్​ ఎస్​యూవీ కారుకు కూడా భారతదేశంలో మంచి డిమాండ్ ఉంది. అయితే ఈ కారుకు టయోటా అర్బన్​ క్రూయిజర్ హైరైడర్​తో అనేక సారూప్యతలు ఉన్నాయి.

ఈ గ్రాండ్ విటారా కారు 1.5 లీటర్ మైల్డ్ హైబ్రీడ్​ పెట్రోల్​, 1.5 లీటర్​ స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ వేరియంట్లలో లభిస్తుంది. అంతేకాదు దీనిలో సీఎన్​జీ వేరియంట్ కూడా ఉంది.

ఈ మారుతి సుజుకి గ్రాండ్ విటారా కారు ధర సుమారుగా రూ.10.80 లక్షల నుంచి రూ.20.09 లక్షల వరకు ఉంటుంది. ప్రస్తుతానికి డెల్టా సీఎన్​జీ మోడల్ తప్ప, మిగతా గ్రాండ్ విటారా మోడల్స్ అన్నీ డెలివరీగా సిద్ధంగా ఉన్నాయి. డెలివరీ చేయాల్సిన స్థానాన్ని బట్టి డెల్టా సీఎన్​జీ కారు వెయిటింగ్ పీరియడ్​ 4-6 నెలలు ఉంటుంది.

Maruti Suzuki Invicto : ఈ మారుతి సుజుకి ఇన్విక్టో కారు అనేది టయోటా ఇన్నోవా హైక్రాస్​ బ్యాడ్జ్​డ్ ఇంజినీర్డ్ వెర్షన్. ఈ ప్రీమియం ఎంవీపీ కారును నెక్సా డీలర్​షిప్స్​లోనూ విక్రయిస్తున్నారు.

ఈ మారుతి సుజుకి ఇన్విక్టో కారు ధర రూ.25.03 లక్షల నుంచి రూ.28.70 లక్షల (ఎక్స్​-షోరూం) ప్రైస్ రేంజ్​లో ఉంటుంది. ప్రస్తుతానికి ఒక ఆల్ఫా ప్లస్​ హైబ్రిడ్ వేరియంట్ తప్ప మిగతావన్నీ డెలివరీకి సిద్ధంగా ఉన్నాయి. ఆల్ఫా ప్లస్ హైబ్రిడ్​ డెలివరీ కావాలంటే కనీసం 3 నుంచి 4 నెలలు వేచి చూడాల్సిందే.

రూ.70,000 బడ్జెట్లో మంచి ఎలక్ట్రిక్ స్కూటర్​ కొనాలా? టాప్-9 ఆప్షన్స్ ఇవే!

2024-25లో లాంఛ్ కానున్న టాప్​-8 కాంపాక్ట్​ SUV కార్స్ ఇవే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.