ETV Bharat / business

LIC 'జీవన్​ ధార 2' పాలసీ లాంఛ్​ - ఈ ప్లాన్​తో జీవితాంతం ఇన్​కం గ్యారెంటీ! - LIC Jeevan Dhara 2 Annuity Options

LIC Jeevan Dhara II Policy Details In Telugu : ప్రముఖ ప్రభుత్వ రంగ బీమా సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) 'జీవన్​ ధార-2' పేరుతో ఒక కొత్త యాన్యుటీ ప్లాన్​ను లాంఛ్ చేసింది. ఈ పథకంలో చేరినవారికి ఆదాయం గ్యారెంటీ అని ఎల్​ఐసీ చెబుతోంది. పైగా డిఫర్​మెంట్ పీరియడ్​లోనూ పాలసీదారులకు బీమా రక్షణ లభిస్తుంది. పూర్తి వివరాలు మీ కోసం.

LIC Jeevan Dhara II policy benefits
LIC Jeevan Dhara II policy launch
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 21, 2024, 12:30 PM IST

LIC Jeevan Dhara II Policy : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్​ఐసీ) 'జీవన్​ ధార-2' పేరుతో ఒక సరికొత్త యాన్యుటీ ప్లాన్​ను లాంఛ్ చేసింది. 2024 జనవరి 22 నుంచి ఈ ఎల్​ఐసీ బీమా పాలసీ అందుబాటులోకి రానుంది. ఈ పాలసీ తీసుకోవడానికి కావాల్సిన అర్హతలు, వయోపరిమితి, యాన్యుటీ ఆప్షన్స్​, ప్రీమియం వ్యవధులు మొదలైన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఎల్​ఐసీ జీవన్ ధార 2 అంటే ఏమిటి?
జీవన్ ధర-2 అనేది ఒక వ్యక్తిగత, పొదుపు, డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్​. ఈ పాలసీ గుర్తింపు సంఖ్య (UIN) - 512N364V01. ప్లాన్ నంబర్​ 872.

ఎవరు ఆ పాలసీ తీసుకోవచ్చు?

  • కనీస వయస్సు : 20 ఏళ్ల వయస్సు నిండిన వ్యక్తులు అందరూ ఈ ఎల్​ఐసీ జీవన్​ ధార 2 పాలసీని​ తీసుకోవచ్చు.
  • గరిష్ఠ వయస్సు : మీరు ఎంచుకున్న పాలసీ యాన్యుటీ ప్రకారం, గరిష్ఠ వయస్సు (80 ఏళ్లు/ 70ఏళ్లు/ 65 ఏళ్లు) మారుతూ ఉంటుంది.

యాన్యుటీ ఆప్షన్స్

  • ఈ ఎల్ఐసీ జీవన్​ ధార పాలసీలో 11 యాన్యుటీ ఆప్షన్స్ ఉన్నాయి.
  • ఆ పాలసీ తీసుకున్నవారికి హామీతో కూడిన (గ్యారెంటీ ఇన్​కం) వార్షిక చెల్లింపులు ఉంటాయి.
  • ఎక్కువ వయస్సు ఉన్నవారికి ఎక్కువ వడ్డీ లభిస్తుంది.
  • వాయిదా (డిఫర్మెంట్​ పీరియడ్​) వ్యవధిలోనూ జీవిత బీమా రక్షణ ఉంటుంది.

ప్రీమియం ఫ్లెక్సిబిలిటీ

  • పాలసీదారులు రెగ్యులర్​ ప్రీమియం చెల్లించవచ్చు. లేదా ఒకేసారి మొత్తం ప్రీమియంను చెల్లించవచ్చు. ఈ రెండు ఆప్షన్లలో మీకు నచ్చిన దానిని ఎంచుకోవచ్చు.
  • పాలసీదారులు సింగిల్ లైఫ్ యాన్యుటీ, జాయింట్​ లైఫ్ యాన్యుటీల్లో తమకు నచ్చిన దానిని ఎంచుకోవచ్చు. అంటే వ్యక్తిగతంగా లేదా కుటుంబం మొత్తానికి ఈ ఎల్​ఐసీ పాలసీ తీసుకోవచ్చు.

పాలసీ టెన్యూర్​

  • రెగ్యులర్ ప్రీమియం డిఫర్మెంట్ పీరియడ్​​ 5-15 సంవత్సరాలు ఉంటుంది. సింగిల్ ప్రీమియానికైతే​ ఈ వాయిదా కాలం 1-15 సంవత్సరాలు ఉంటుంది.
  • పాలసీదారులు తమ పరిస్థితులకు అనుగుణంగా యాన్యుటీ చెల్లింపులను, ఎప్పుడు ప్రారంభించాలో నిర్ణయించుకోవచ్చు.
  • పాలసీదారులు నెలవారీగా పాలసీ ప్రీమియం చెల్లించవచ్చు. లేదా 3 నెలలు, 6 నెలలు, ఒక సంవత్సరం వ్యవధుల్లో ప్రీమియాన్ని చెల్లించవచ్చు.

బెనిఫిట్స్​

  • అధిక ప్రీమియం కట్టినవారికి, ఆన్​లైన్​లో పాలసీ తీసుకున్నవారికి అధిక వడ్డీ చెల్లిస్తారు.
  • యాన్యుటీ టాప్​-అప్​ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
  • ఈ ఎల్​ఐసీ జీవన్ ధార 2 పాలసీపై లోన్​ తీసుకోవచ్చు.
  • పాలసీదారుడు మరణిస్తే ఏకమొత్తంగా పరిహారం పొందవచ్చు. లేదా వాయిదా పద్ధతుల్లోనూ పరిహారం తీసుకోవచ్చు.

మార్కెట్​లోకి కొత్త మ్యూచువల్​ ఫండ్స్​ ​- ఇన్వెస్ట్​ చేశారంటే లాభాల పంటే!

మీ కారు "గ్యారేజ్​కు దారెటు భయ్యా?" అంటోందా - ఇవి చెక్ చేయకుంటే అంతేమరి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.