Low Interest Rates With A Good Credit Score : బ్యాంకులు లేదా రుణదాత లోన్స్ ఇచ్చే ముందు కచ్చితంగా రుణ గ్రహీత క్రెడిట్ స్కోర్‌ను పరిశీలిస్తాయి. సిబిల్ స్కోర్ మెరుగ్గా ఉంటే తక్కువ వడ్డీతో లోన్లు మంజూరు చేస్తాయి. క్రెడిట్ స్కోరు తక్కువ ఉన్నవారి లోన్ దరఖాస్తును తిరస్కరించొచ్చు. లేదంటే రుణంపై అధిక వడ్డీ వేస్తాయి. అందుకే లోన్లు ఈజీగా, తక్కువ వడ్డీ రేటుతో మంజూరు అవ్వాలంటే సిబిల్ స్కోరు చాలా ముఖ్యం. అప్పుడే మీరు రుణదాతతో లోన్ వడ్డీ రేట్ల విషయంలో మాట్లాడగలరు. ఈ క్రమంలో పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలు ఏంటంటే?
రుణం తీసుకోవాలనుకునే వ్యక్తి క్రెడిట్ స్కోరు 750 ఉందనుకుందాం. అప్పుడు అతడికి బ్యాంకులు లేదా రుణదాతలు ఈజీగా లోన్‌ను మంజూరు చేస్తాయి. అలాగే తక్కువ వడ్డీ రేటుకే రుణాన్ని ఇస్తాయి. వడ్డీ రేటు విషయమై ఆ వ్యక్తి బ్యాంకులతో చర్చించవచ్చు. అదే రుణ గ్రహీత క్రెడిట్ స్కోరు 500-600 ఉందనుకోండి. అతడికి లోన్ మంజూరు కష్టమవుతుంది. ఒకవేళ లోన్ మంజూరు అయినా, రుణ సంస్థలు ఎక్కువ వడ్డీ రేటును విధిస్తాయి. అలాగే వడ్డీ విషయంలో రుణగ్రహీతతో చర్చలు కూడా జరపలేడు. అందుకు కారణం అతడి పేలమైన క్రెడిట్ స్కోరే కారణం అని చెప్పాలి.
వడ్డీ రేటు విషయంలో రుణదాతతో చర్చించే ముందు పరిశీలించాల్సిన అంశాలు?
క్రెడిట్ స్కోర్
రుణ సంస్థలతో వడ్డీ రేటుపై చర్చించే ముందు మీ క్రెడిట్ స్కోరును తనిఖీ చేసుకోవడం చాలా ముఖ్యం. మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే తక్కువ వడ్డీ రేటును మీరు అడగొచ్చు.
వడ్డీ రేట్లు
వివిధ బ్యాంకులు, రుణ సంస్థలు లోన్‌పై విధించే వడ్డీ రేట్లను తెలుసుకోండి. అది మీరు లోన్ తీసుకోబోయే సంస్థతో వడ్డీ రేటు మాట్లాడేటప్పుడు ఉపయోగపడుతుంది.
క్రెడిట్ యోగ్యత
వడ్డీ రేటు విషయంలో రుణదాతతో చర్చలు జరుపుతున్నప్పుడు మీ మంచి క్రెడిట్ హిస్టరీ, క్రెడిట్ స్కోర్ ను తెలియజేయండి. అప్పుడు రుణదాతలు తక్కువ క్రెడిట్ రిస్క్ ఉన్న రుణగ్రహీతలకు తక్కువ వడ్డీకి లోన్ మంజూరు చేసే అవకాశం ఉంది.
వివిధ బ్యాంక్‌ల వడ్డీ రేట్లను పరిశీలించండి
మార్కెట్లో ఉన్న రుణసంస్థలు, అవి విధించే వడ్డీ రేట్లను తెలుసుకోండి. అప్పుడు మీరు తీసుకునే లోన్‌పై విధించే వడ్డీ కంటే ఇతర బ్యాంకులు తక్కువకు ఇస్తున్నాయా లేదో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది.
ఈ విషయాలు తెలియజేయండి
మీకు ఇతర రుణదాతల నుంచి మెరుగైన ఆఫర్స్ వచ్చినట్లైతే, వాటిని మీ ప్రస్తుత రుణదాతకు తెలియజేయాలి. అప్పుడు వారు పోటీతత్వంతో అంతకంటే తక్కువ, సమానమైన వడ్డీ రేటును విధించవచ్చు.
సిద్ధంగా ఉండండి
కొన్నిసార్లు మీరు ఊహించినదాని కంటే రుణదాత ఎక్కువ వడ్డీ రేటును కోరవచ్చు. మీరు ఎంత చర్చించినా ఆయన వడ్డీ రేటు విషయంలో తగ్గకపోతే, వేరొక రుణదాతను ఎంచుకోవడం ఉత్తమం.
అదొక్కటే ముఖ్యం కాదు!
మంచి క్రెడిట్ స్కోర్ మీరు రుణదాతతో వడ్డీ రేటుపై చర్చించడానికి ఉపయోగపడుతుంది. అయితే మీతో చర్చలు జరిపేందుకు ఆ ఆర్థిక సంస్థలు పరిగణించే ఏకైక అంశం క్రెడిట్ స్కోర్ మాత్రమే కాదని గుర్తుంచుకోండి. మీ ఆదాయం, రుణం-ఆదాయ నిష్పత్తి, ఉద్యోగ చరిత్ర, ఇతర ఆర్థిక అంశాలు కూడా మీ లోన్‌పై వడ్డీ రేటును నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
క్రెడిట్ స్కోర్ ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలా?
అవును. క్రెడిట్ స్కోర్‌ను క్రమం తప్పకుండా చేసుకోవడం మంచిది. అప్పుడు మీ క్రెడిట్ యోగ్యత తెలుస్తుంది.
హార్ట్ ఎంక్వైరీ అంటే ఏమిటి?
మీరు డెట్ కన్సాలిడేషన్ లోన్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు, రుణదాత మీ క్రెడిట్ నివేదికపై విచారణ చేయడాన్ని హార్డ్ ఎంక్వైరీ అంటారు.
మీ క్రెడిట్ నివేదికను ఎందుకు చెక్ చేసుకోవాలి?
ప్రతి ఒక్కరూ క్రెడిట్ స్కోర్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవాలి. అఫ్పుడే మీ ఆర్థిక స్థితి తెలుస్తుంది. అలాగే బ్యాంకు ఖాతా నుంచి అనధికార ట్రాన్సాక్షన్స్ జరిగినా, లోపాలు ఉన్నా తెలుసుకోవచ్చు.
మీరు క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు! - 5 Common Credit Card Mistakes